స్కూలు, కాలేజి రోజుల నుంచి రోజుల తరబడి పాటలు వినేది ధ్వని భానుశాలి. అందరూ తనను సరదాగా ‘సాంగ్ ఈటర్’ అని పిలిచేవారు. రికార్డ్ బ్రేకింగ్ సాంగ్ ‘వాస్తే’తో లైమ్‌లైట్‌లోకి వచ్చిన ధ్వని సింగర్‌గా బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. మంత్రముగ్ధులను చేసే అందమైన గానంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. చిత్రపరిశ్రమలో గొప్ప సంగీతదర్శకులతో కలిసి పనిచేసే అదృష్టాన్ని సొంతం చేసుకుంది. ధ్వని పాడిన ‘దిల్బార్’ పాట బిల్‌బోర్డ్ యూట్యూబ్‌లో మ్యూజిక్ ర్యాంకింగ్‌లో మూడో స్థానంలో నిలిచిన తొలి భారతీయ సింగిల్‌గా చరిత్ర సృష్టించింది.
‘ఒక ఆర్టిస్ట్ నుంచి స్ఫూర్తి తీసుకోవచ్చు. కానీ వారి శైలిని కాపీ కొట్టకూడదు’ అంటున్న ధ్వని సంగీతప్రపంచంలో తనదైన అందమైన సంతకాన్ని సృష్టించుకుంది. ధ్వని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు ప్రోత్సాహకంగా మాట్లాడిన వారు తక్కువే. దీని గురించి ఇలా స్పందిస్తుంది ధ్వని... ‘ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. రకరకాల అభిప్రాయాలు వినడం వల్ల మనం ఎంచుకున్న దారి సరిౖయెనదేనా అనే డౌటు వచ్చి అయోమయంలోకి వెళతాం. ఇలాంటి సమయంలో మనపై మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. నా ప్రయాణంలో నేను అది కోల్పోలేదు’ అంటుంది ధ్వని భానుశాలి.
Comments
Please login to add a commentAdd a comment