13 రోజుల్లో పూర్తి | D Ramakrishna's 'Marla Puli' shot in just 13 days | Sakshi
Sakshi News home page

13 రోజుల్లో పూర్తి

Published Fri, Mar 23 2018 12:18 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

D Ramakrishna's 'Marla Puli' shot in just 13 days - Sakshi

వరుణ్‌ సందేశ్‌

1983లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం ‘మర్లపులి’. డి.నరసింహా సమర్పణలో సుధాకర్‌ ఇంపెక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్మించింది. వరుణ్‌ సందేశ్‌ ప్రత్యేక పాత్రలో, అర్చన ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్ర గీతాలను మరో హీరోయిన్‌ భాను చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత, సంగీత దర్శకుడు బి.సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ – ‘‘మా చిత్రదర్శకుడు రామకృష్ణ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా చిత్రం రూపొందింది.

నా సంగీతంలో విడుదలవుతున్న ఈ చిత్రం పాటలు మంచి ప్రజాదరణ పొందుతాయని ఆశిస్తున్నా’’ అన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ – ‘‘13 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశాం. తక్కువ సమయంలో అయినా మంచి క్వాలిటీతో తీశాం’’ అన్నారు.‘‘వరుణ్‌సందేశ్‌ పక్కన లీడు రోల్‌లో నటించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు భాను. పోసాని కృష్ణమురళి, తాగుబోతు రమేశ్‌ నటించిన ఈ చిత్రానికి కెమెరా: యం.మురళీకృష్ణ. నిర్మాతలు: భీరం సుధాకర్‌ రెడ్డి, బి.భవానీ శంకర్, ఖమ్మం శ్రీను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement