వీనుల విందుగా..కను విందుగా... | Nuvvala Nenila Movie Audio Launched | Sakshi
Sakshi News home page

వీనుల విందుగా..కను విందుగా...

Published Fri, Jul 18 2014 12:02 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

వీనుల విందుగా..కను విందుగా... - Sakshi

వీనుల విందుగా..కను విందుగా...

 ‘‘కథ వినకుండా ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. త్రినాథరావుగారి మీద నాకంత నమ్మకం. ‘ఏమైంది ఈ వేళ’ తర్వాత అంతటి హిట్ సినిమా చేయలేదు. ఈ సినిమా ఆ కొరతను తీరుస్తుందనే నమ్మకం ఉంది’’ అని వరుణ్ సందేశ్ చెప్పారు. వరుణ్ సందేశ్, పూర్ణ, సోనియా బిర్జి ముఖ్య తారలుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నువ్వలా నేనిలా’. లోలారెడ్డి సమర్పణలో రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. సాయి కార్తీక్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను దామోదర ప్రసాద్ విడుదల చేశారు. ఈ వేడుకలో బెక్కెం వేణుగోపాల్, నవదీప్, నిఖిల్, ప్రిన్స్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ చిత్రం టైటిల్ వినడానికి హాయిగా ఉందని అందరూ అంటున్నారనీ, వినడానికి మాత్రమే కాదు, చూడ్డానికి కూడా ఈ సినిమా హాయిగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. వచ్చే నెల రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement