ఆ ఇద్దరి ప్రేమ! | Iddari Madhya 18 Movie Opening | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరి ప్రేమ!

Published Wed, Apr 6 2016 10:34 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM

ఆ ఇద్దరి  ప్రేమ!

ఆ ఇద్దరి ప్రేమ!

 అందమైన ప్రేమకథ  నేపథ్యంలో సాగే ఎంటర్‌టైనర్‌గా ఓ చిత్రం రూపొందనుంది. కార్తీక్, భాను జంటగా నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్ పాటిల్ నిర్మించనున్న చిత్రం ‘ఇద్దరి మధ్య 18’. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరా బాద్‌లో జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి శివరాజ్ పాటిల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ కొట్టారు.

దర్శకుడు మాట్లాడుతూ- ‘‘యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సింగిల్ షెడ్యూల్‌లో ఈ సినిమా రూపొందిస్తున్నాం’’ అని అన్నారు. ‘‘నాని చెప్పిన కథ కొత్తగా ఉంది. యువతరానికి  మెచ్చే సందేశాత్మక చిత్రమిది’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.ఎమ్. క్రిష్, సంగీతం: ఘంటాడి కృష్ణ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement