Shivraj Patil
-
కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన శివరాజ్ పాటిల్ కోడలు
లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కోడలు అర్చన పాటిల్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం అర్చన పాటిల్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో బీజేపీలో చేరారు. శివరాజ్ పాటిల్ కాంగ్రెస్ సీనియర్ నేత. ఆయన లాతూర్ లోక్‌సభ స్థానం నుండి ఏడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటీవల మహారాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. వీరిలో అశోక్ చవాన్, మిలింద్ దేవరా, బాబా సిద్ధిఖీ ఉన్నారు. అశోక్ చవాన్ బీజేపీలో చేరగా, మిలింద్ దేవరా ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో, బాబా సిద్ధిఖీ అజిత్ వర్గం నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు ఐదు దశల్లో జరగనున్నాయి. మొదటి దశ ఏప్రిల్ 19న, రెండో దశ ఏప్రిల్ 26న, మూడో దశ మే 7న జరగనుంది. నాలుగో దశ మే 13న, ఐదో దశ పోలింగ్ మే 20న జరగనుంది. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. #WATCH | Archana Patil Chakurkar, daughter-in-law of senior Congress leader and former Union Home Minister Shivraj Patil, joins Bharatiya Janata Party, in the presence of Maharashtra Deputy CM Devendra Fadnavis, in Mumbai pic.twitter.com/mTwUfpZUBw — ANI (@ANI) March 30, 2024 -
ఆ ఆరోపణలు అవాస్తవం: శివరాజ్ పాటిల్
ముంబై: ముంబై నగరంపై 2013 నవంబర్ 26న పాకిస్తాన్ లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాదులు దాడి జరిపిన సమయంలో కేంద్ర హోం శాఖ సకాలంలో స్పందించలేదని వస్తున్న విమర్శలు వాస్తవం కాదని మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ స్పష్టం చేశారు. దాడి జరిగిన రోజు రాత్రి వెంటనే కేంద్ర బలగాలను పంపామని అయితే.. ముంబై పోలీసులు తమ ఆధ్వర్యంలో ఉగ్రవాదులను ఏరివేసే అపరేషన్‌ను నిర్వహించారని వెల్లడించారు. ఘటన సమయంలో హోం శాఖ అధికారులు పాకిస్థాన్‌లోని ముర్రేలో ఉన్నారని, దీని వెనుక కుట్ర ఉందని అభియోగాలు చేస్తున్నవారు తగిన ఆధారాలతో మాట్లాడాలన్నారు. శాంతి భద్రతల సమస్యను రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయనీ, అయినప్పటికీ 26/11 దాడుల తాము వెంటనే కేంద్ర బలగాలను పంపిన విషయాన్ని శివరాజ్ పాటిల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్ఎస్జీ బృందాలు సైతం వెంటనే స్పందించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ చండీగఢ్ నుంచి రావడానికి ఎయిర్‌క్రాఫ్ట్ అందుబాటులో లేదని తెలిపారు. Law & order is a state subject. Bombay police was handling it (26/11) yet we sent forces quickly: Shivraj Patil pic.twitter.com/gnZnhKC8VB — ANI (@ANI_news) June 11, 2016 -
ఆ ఇద్దరి ప్రేమ!
అందమైన ప్రేమకథ నేపథ్యంలో సాగే ఎంటర్టైనర్గా ఓ చిత్రం రూపొందనుంది. కార్తీక్, భాను జంటగా నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్ పాటిల్ నిర్మించనున్న చిత్రం ‘ఇద్దరి మధ్య 18’. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరా బాద్‌లో జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి శివరాజ్ పాటిల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ కొట్టారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమా రూపొందిస్తున్నాం’’ అని అన్నారు. ‘‘నాని చెప్పిన కథ కొత్తగా ఉంది. యువతరానికి మెచ్చే సందేశాత్మక చిత్రమిది’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.ఎమ్. క్రిష్, సంగీతం: ఘంటాడి కృష్ణ. -
త్వరలో కొత్త గవర్నర్లు
న్యూఢిల్లీ: రానున్న రెండు, మూడు వారాల్లో బీహార్, పంజాబ్, అస్సాం సహా దాదాపు ఆరు రాష్ట్రాల్లో కొత్త గవర్నర్లను నియమించనున్నామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం బీహార్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, త్రిపురల్లో గవర్నర్ పదవి ఖాళీగా ఉంది. పంజాబ్ గవర్నర్ శివరాజ్ పాటిల్ ఈ నెల 21న రిటైర్ అవుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ ఊర్మిళ సింగ్ పదవీకాలం జనవరి 24తో ముగుస్తోంది. తమిళనాడు గవర్నర్ కె. రోశయ్య, ఒడిశా గవర్నర్ ఎస్సీ జమీర్ కూడా త్వరలో రిటైర్ కానున్నారు. వారిద్దరినీ యూపీఏ ప్రభుత్వం నియమించింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్డీఏ ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, హరియాణా, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, నాగాలాండ్, గోవాలకు కొత్త గవర్నర్లను నియమించింది. మోదీ సీఎంగా ఉండగా గుజరాత్ గవర్నర్‌గా ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించిన కమల బేణివాల్‌ను మిజోరంకు బదిలీ చేసి, అనంతరం ఆ పదవి నుంచి తొలగించారు. అలాగే, పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీరేంద్ర కటారియాను కూడా తొలగించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని వారాల తరువాత యూపీఏ హయాంలో గవర్నర్లుగా నియమితులైన పలువురిని రాజీనామా చేయాల్సిందిగా కేంద్ర హోంశాఖ సెక్రటరీ అనిల్ గోస్వామి కోరడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత యూపీఏ నియమించిన గవర్నర్లు షీలా దీక్షిత్(కేరళ), ఎంకే నారాయణన్(పశ్చిమబెంగాల్), అశ్వని కుమార్(నాగాలాండ్), బీఎల్ జోషి(యూపీ), బీవీ వాంఛూ(గోవా), శేఖర్ దత్(ఛత్తీస్‌గఢ్), వీకే దుగ్గల్(మణిపూర్) రాజీనామా చేశారు. -
కౌన్సిలర్లకు బంపర్ ఆఫర్!
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఎలాగైనా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు పోటీపడి గెలుపొందిన కౌన్సిలర్లకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. విలువైన ప్లాటు, కారు ఇచ్చి తమ పార్టీకి మద్దతు ఇచ్చే వారిలో ఒకరికి వైస్ చైర్మన్ ఇస్తామని ఎర చూపుతున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాల్టీలో పార్టీ జెండా ఎగరవేయడానికి పోటీ పడి ఇరు పార్టీలు నజరానాలు ప్రకటిస్తున్నాయి. సదాశివపేట మున్సిపల్ పరిధిలోని 13 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్‌కి చైర్మన్ పదవి దక్కకుండా ఇండిపెండెంటుకు, కాంగ్రెస్‌లోని అసంతృప్తులకు ఎర వేసి తమ వైపు తిప్పుకునేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నేతృత్వంలో తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నశివరాజ్ పాటిల్‌కు పదవి దక్కకుండా ఆయన వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కౌన్సిల్ సభ్యడు చీలమల్లన్న సతీమణిని తెరపైకి తెచ్చి జగ్గారెడ్డి అనుచరుడు సుభాష్‌కు చెక్ పెట్టాలని చింతా ప్రభాకర్ చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతాయనే చెప్పవచ్చు. ఇందుకోసం టీఆర్ఎస్తో పాటు ఎంఐఎం, స్వతంత్రులు, టీడీపీ కౌన్సిలర్లు టీఆర్ఎస్కి మద్దతు ఇస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఇందుకోసం ఒక స్థానంలో గెలిచిన బీజేపీ మద్దతు సైతం తీసుకొని పార్టీకి చెందిన సీనియర్ నాయకుడికి కోఅప్షన్ సభ్యనిగా నియమించేందుకు హమీ ఇవ్వడంతో పేట మున్సిపాలిటీపై టీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు జిల్లా కేంద్రమైన సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పాగా వేసేందుకు అనూహ్యంగా స్వతంత్ర మహిళా అభ్యరిని చైర్‌పర్సన్‌గా నియమించేందుకు గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఇందుకోసం 30, 26వ వార్డులల్లో స్వతంత్ర మహిళా అభ్యర్థులను చైర్ పర్సన్లుగా నియమించేందుకు టీఆర్ఎస్ ఎంఐఎం మద్దతు కోరింది. ఎంఐఎం గెలిచిన స్థానాల్లో బీసీ కేటగిరిలో మహిళలు లేకపోవడంతో మద్దతు ఇచ్చేందుకు ఎంఐఎం సైతం అంగీకరించినట్లు తెలిసింది. 28 వార్డుల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ 2 వార్డుల్లో గెలవడం ఆ రెండింటిలో కూడా మహిళా అభ్యర్థి లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిని తెరపైకి తీసుకువచ్చి చైర్మన్ పదవి కాంగ్రెస్‌కు దక్కకుండా తనదైన వ్యూహరచనతో చింతా ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పక్షాన గెలిచిన నేతల సైతం గతంలోని తమ స్థానాలను నిలుపుకునేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడంతో సదాశివపేట, సంగారెడ్డి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయని చెప్పవచ్చు. స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారు ప్రత్యర్థి కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు భారీ నజరానాలు ఎర వేస్తున్నారు.