కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన శివరాజ్ పాటిల్ కోడలు | Shivraj Patil Daughter in Law Join BJP | Sakshi
Sakshi News home page

Maharastra: కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన శివరాజ్ పాటిల్ కోడలు

Published Sat, Mar 30 2024 1:40 PM | Last Updated on Sat, Mar 30 2024 1:53 PM

Shivraj Patil Daughter in Law Join BJP - Sakshi

లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కోడలు అర్చన పాటిల్  కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. 

మీడియాకు అందిన సమాచారం ప్రకారం అర్చన పాటిల్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో బీజేపీలో చేరారు. శివరాజ్ పాటిల్ కాంగ్రెస్ సీనియర్ నేత. ఆయన లాతూర్ లోక్‌సభ స్థానం నుండి ఏడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 

ఇటీవల మహారాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. వీరిలో అశోక్ చవాన్, మిలింద్ దేవరా, బాబా సిద్ధిఖీ ఉన్నారు. అశోక్ చవాన్ బీజేపీలో చేరగా, మిలింద్ దేవరా ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో, బాబా సిద్ధిఖీ అజిత్ వర్గం నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు ఐదు దశల్లో జరగనున్నాయి. మొదటి దశ ఏప్రిల్ 19న, రెండో దశ ఏప్రిల్ 26న, మూడో దశ మే 7న జరగనుంది.  నాలుగో దశ మే 13న, ఐదో దశ పోలింగ్‌ మే 20న  జరగనుంది. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్‌ 4న జరగనుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement