ముంబై: ముంబై నగరంపై 2013 నవంబర్ 26న పాకిస్తాన్ లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాదులు దాడి జరిపిన సమయంలో కేంద్ర హోం శాఖ సకాలంలో స్పందించలేదని వస్తున్న విమర్శలు వాస్తవం కాదని మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ స్పష్టం చేశారు. దాడి జరిగిన రోజు రాత్రి వెంటనే కేంద్ర బలగాలను పంపామని అయితే.. ముంబై పోలీసులు తమ ఆధ్వర్యంలో ఉగ్రవాదులను ఏరివేసే అపరేషన్ను నిర్వహించారని వెల్లడించారు.
ఘటన సమయంలో హోం శాఖ అధికారులు పాకిస్థాన్లోని ముర్రేలో ఉన్నారని, దీని వెనుక కుట్ర ఉందని అభియోగాలు చేస్తున్నవారు తగిన ఆధారాలతో మాట్లాడాలన్నారు. శాంతి భద్రతల సమస్యను రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయనీ, అయినప్పటికీ 26/11 దాడుల తాము వెంటనే కేంద్ర బలగాలను పంపిన విషయాన్ని శివరాజ్ పాటిల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్ఎస్జీ బృందాలు సైతం వెంటనే స్పందించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ చండీగఢ్ నుంచి రావడానికి ఎయిర్క్రాఫ్ట్ అందుబాటులో లేదని తెలిపారు.
Law & order is a state subject. Bombay police was handling it (26/11) yet we sent forces quickly: Shivraj Patil pic.twitter.com/gnZnhKC8VB
— ANI (@ANI_news) June 11, 2016