అనంతపురం: అనంతపురంలో దారుణం జరిగింది. జీవితాంతం వెంట ఉండాల్సిన భర్త కాలయముడిగా మారాడు. కిరాతకంగా కత్తితో పొడిచి పరారయ్యాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగింది. వివరాలు.. సునిత (25) అనే మహిళను తన భర్త సంతోశ్ కుమార్ గొంతు కోసి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ భాను మృతి చెందింది. భాను ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చినట్టు సమాచారం. గత కొద్ది కాలంగా భార్య సునీతను సంతోశ్ అనుమానించేవాడు.
పెయింటర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్న సంతోశ్ ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులోనే భార్యను హత్య చేసి ఉంటాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలించి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కట్టుకున్నోడే కడతేర్చాడు
Published Mon, May 11 2015 11:56 AM | Last Updated on Mon, Jul 30 2018 9:16 PM
Advertisement
Advertisement