నాటింగ్‌హామ్: ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకొని ఔరా అనిపించాడు. కరేబియన్ బౌలర్ థామస్ వేసిన 45 ఓవర్ రెండో బంతిని స్టీవ్ స్మిత్ ఫైన్ లెగ్ వైపు భారీ షాట్ ఆడతాడు. అక్కడ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కాట్రెల్ సిక్సర్ వెళ్లే బంతిని గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. ఐతే బ్యాలెన్స్ కోల్పోయిన కాట్రెల్ బౌండరీ హద్దును తాకబోతున్నట్లు గమనించి బంతిని లోపలికి విసిరేశాడు. అనంతరం మళ్లీ లైన్ లోపలికి వచ్చి బంతిని అందుకొని ఆశ్చర్యపరిచాడు. కాట్రెల్ స్టన్నింగ్ క్యాచ్‌తో స్మిత్‌తో సహా ఆసీస్ ప్యాన్స్ షాక్‌కు గురయ్యారు.
ఇక వృత్తిరీత్యా సోల్జర్ అయిన కాట్రెల్.. ఈ సూపర్ క్యాచ్ అందుకోవడంతో కామెంటేటర్ల్ అతడికి నిజంగా సెల్యూట్ చేయాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాట్రెల్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ‘వికెట్ తీసిన వెంటనే సెల్యూట్ చేసే కాట్రెల్‌కు.. ఈ క్యాచ్‌తో మనం అతడికి సెల్యూట్ చేయాల్సిందే’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లలో వికెట్ తీసిన వెంటనే సెల్యూట్ చేస్తూ అతడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రపంచకప్‌లో కాట్రెల్ సెల్యూటే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
ఈ క్యాచ్ చూస్తే.. ‘సెల్యూట్’ చేయాల్సిందే
Published Thu, Jun 6 2019 7:39 PM | Last Updated on Fri, Jun 7 2019 3:17 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment