బర్మింగ్‌హామ్ : ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీస్‌లో జోస్ బట్లర్ తన సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్(85)ను బట్లర్ తన బుల్లెట్ త్రోతో అవుట్ చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ సందర్బంగా క్రిస్ వోక్స్ వేసిన 48 ఓవర్ తొలి బంతిని స్మిత్ డిఫెన్స్ ఆడబోయాడు. అది కీపర్ వైపు వెళ్లడంతో నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న స్టార్క్ పరుగు కోసం యత్నించాడు. అయితే ఆలస్యంగా స్పందించిన స్మిత్ అవతలి ఎండ్‌లోకి చేరోలోపే బట్లర్ బంతిని డైరెక్ట్‌గా వికెట్లపైకి విసిరాడు. దీంతో సెంచరీ సాధించకుండానే స్మిత్ భారంగా క్రీజు వదిలి వెళ్లాడు.
ప్రసుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. అంతేకాకుండా బట్లర్ సూపర్ ఫీల్డింగ్‌ను మెచ్చుకుంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక స్టార్క్ తప్పిదానికి స్మిత్ బలయ్యాడంటూ విమర్శిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఇంగ్లండ్ బౌలర్లు వణుకుపుట్టించారు. అయితే స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీలు రాణించడంతో ఇంగ్లండ్ ముందు ఆసీస్ గౌరవప్రదమైన లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
Comments
Please login to add a commentAdd a comment