
ఆడిలైడ్ వేదికగా వెస్టిండీస్‌తో తొలి టెస్టును ఆస్ట్రేలియా ఘనంగా ఆరంభించింది. తొలి రోజు ఆటలో విండీస్‌పై ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మొదటి రోజు ఆటముగిసే సమయానికి ఆసీస్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 293 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా బ్యాటర్లలో మార్నెస్ లాబుషేన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 270 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్స్‌తో 154 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతడితో పాటు స్టీవన్ స్మిత్ కూడా 59 పరుగలతో ఆజేయంగా నిలిచాడు.
ఇక ఓపెనర్ డేవిడ్ వార్నర్(5) వికెట్‌ను అదిలోనే కోల్పోయినప్పటికీ.. ఉస్మాన్ ఖవాజా, లూబుషేన్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అనంతరం ఖవాజా 65 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్, లూబుషేన్ మరో వికెట్ కోల్పోకుండా తొలి రోజు ఆటను ముగించారు. విండీస్ బౌలర్లలో సీల్స్, మైర్స్ తలా వికెట్ సాధించారు.
Smashed through point to bring up the ton! 💪
— cricket.com.au (@cricketcomau) November 30, 2022
Labuschagne celebrates his eighth Test century #PlayOfTheDay@nrmainsurance | #AUSvWI pic.twitter.com/KWsatgIzNZ
చదవండి: టీమిండియాకు వెలకట్టలేని ఆస్తి దొరికింది! జడ్డూ నువ్వు రాజకీయాలు చూసుకో! ఇక నీ అవసరం ఉండకపోవచ్చు!
Comments
Please login to add a commentAdd a comment