Labuschagne
-
సూర్యకుమార్ యాదవ్‌లా సూపర్ షాట్ ఆడిన లబూషేన్.. వైరల్ వీడియో
ఆస్ట్రేలియా స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబూషేన్ భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను గుర్తు చేశాడు. బిగ్‌బాష్ లీగ్ 2024-25లో భాగంగా హోబర్ట్ హరికేన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లబూషేన్ స్కై ట్రేడ్‌మార్క్ 360 డిగ్రీస్ స్కూప్ షాట్ ఆడాడు. లబూషేన్ ఈ షాట్‌ను అచ్చుగుద్దినట్లు సూర్యకుమార్ యాదవ్‌లా ఆడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.😱 MARNUS 😱That's some shot at The Gabba! #BBL14 pic.twitter.com/VTTdEULcEy— KFC Big Bash League (@BBL) January 16, 2025ఎప్పుడూ క్లాసీ షాట్లు ఆడే లబూషేన్ విన్నూత్నమైన షాట్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. హోబర్ట్ హరికేన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లబూషేన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 44 బంతులు ఎదుర్కొన్న లబూషేన్ 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేశాడు. బిగ్‌బాష్ లీగ్‌లో లబూషేన్‌కు ఇదే అత్యధిక స్కోర్.లబూషేన్ సూపర్ ఇన్నింగ్స్‌తో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. బ్రిస్బేన్ హీట్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా (9 బంతుల్లో 23; 3 ఫోర్లు, సిక్స్), మ్యాట్ రెన్షా (25 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), అల్సోప్ (27 బంతుల్లో 39; 4 ఫోర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. నాథన్ మెక్‌స్వీని (1), మ్యాక్స్ బ్రయాంట్ (4) విఫలమయ్యారు.లబూషేన్ ధాటికి హరికేన్స్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా రిలే మెరిడిత్‌కు లబూషేన్ చుక్కలు చూపించాడు. లబూషేన్ స్కై తరహా సూపర్ సిక్సర్‌ను మెరిడిత్ బౌలింగ్‌లోనే బాదాడు. మెరిడిత్ తన కోటా నాలుగు ఓవర్లలో వికెట్లు ఏమీ తీసుకోకుండా 57 పరుగులు సమర్పించుకున్నాడు. హరికేన్స్ కెప్టెన్ నాథన్ ఇల్లిస్ మూడు వికెట్లు తీసుకున్నప్పటికీ.. 4 ఓవర్లలో 42 పరుగులు సమర్పించుకున్నాడు. మార్కస్ బీన్, మిచెల్ ఓవెన్ తలో వికెట్ పడగొట్టారు.202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్ ధాటికి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఆ జట్టు 8.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ ఓవెన్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి ఔటయ్యాడు. ఓవెన్ 20 బంతుల్లో బౌండరీ, అర డజను సిక్సర్ల సాయంతో 44 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ కాలెబ్ జువెల్ కూడా ధాటిగా ఆడుతున్నాడు. కాలెబ్ 24 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 38 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. చార్లీ వకీం డకౌట్ కాగా.. కాలెబ్‌కు జతగా నిఖిల్ చౌదరీ క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో హరికేన్స్ నెగ్గాలంటే 70 బంతుల్లో 115 పరుగులు చేయాల్సి ఉంది. -
లబుషేన్ సెంచరీ.. పోరాడుతున్న ఆస్ట్రేలియా
మాంచెస్టర్: ‘యాషెస్’ సిరీస్ నాలుగో టెస్టులో ఓటమినుంచి తప్పించుకునేందుకు పోరాడుతున్న ఆ్రస్టేలియాకు శనివారం వర్షం రూపంలో అదృష్టం కూడా కలిసొచ్చింది. ఇక ఆ జట్టు మ్యాచ్ చివరి రోజు ఆదివారం కూడా వాన కురవడంపై కూడా ఆశలు పెట్టుకోవాలి! 162 పరుగులు వెనుకబడి ఓవర్‌నైట్ స్కోరు 113/4తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. పట్టుదలగా ఆడిన మార్నస్ లబుషేన్ (173 బంతుల్లో 111; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెరీర్లో 11వ సెంచరీ పూర్తి చేసుకోగా, మిచెల్ మార్ష్ (31 నాటౌట్) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 103 పరుగులు జోడించారు. వాన కారణంగా శనివారం మొత్తం 27 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా, ఆస్ట్రేలియా మరో 101 పరుగులు జత చేసింది. అయితే ఆసీస్ ఇంకా 61 పరుగులు వెనుకబడి ఉంది. చివరి రోజు మిగిలిన ఐదు వికెట్లతో మరికొన్ని పరుగులు సాధించడంతో పాటు వర్షం కూడా అంతరాయం కలిగిస్తే ‘డ్రా’కు అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఆ్రస్టేలియా ‘యాషెస్’ను నిలబెట్టుకుంటుంది. -
సెంచరీతో చెలరేగిన లాబుషేన్.. తొలి రోజు ఆస్ట్రేలియాదే!
ఆడిలైడ్ వేదికగా వెస్టిండీస్‌తో తొలి టెస్టును ఆస్ట్రేలియా ఘనంగా ఆరంభించింది. తొలి రోజు ఆటలో విండీస్‌పై ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మొదటి రోజు ఆటముగిసే సమయానికి ఆసీస్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 293 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మార్నెస్ లాబుషేన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 270 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్స్‌తో 154 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతడితో పాటు స్టీవన్ స్మిత్ కూడా 59 పరుగలతో ఆజేయంగా నిలిచాడు. ఇక ఓపెనర్ డేవిడ్ వార్నర్(5) వికెట్‌ను అదిలోనే కోల్పోయినప్పటికీ.. ఉస్మాన్ ఖవాజా, లూబుషేన్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అనంతరం ఖవాజా 65 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్, లూబుషేన్ మరో వికెట్ కోల్పోకుండా తొలి రోజు ఆటను ముగించారు. విండీస్ బౌలర్లలో సీల్స్, మైర్స్ తలా వికెట్ సాధించారు. Smashed through point to bring up the ton! 💪 Labuschagne celebrates his eighth Test century #PlayOfTheDay@nrmainsurance | #AUSvWI pic.twitter.com/KWsatgIzNZ — cricket.com.au (@cricketcomau) November 30, 2022 చదవండి: టీమిండియాకు వెలకట్టలేని ఆస్తి దొరికింది! జడ్డూ నువ్వు రాజకీయాలు చూసుకో! ఇక నీ అవసరం ఉండకపోవచ్చు! -
18 నెలల తర్వాత సెంచరీ చేసిన స్మిత్.. వీడియో వైరల్
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవన్ స్మిత్ ఎట్టకేలకు సెంచరీ సాధించాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో స్మిత్ అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు. దీంతో అతడి 18 నెలల నిరీక్షణకు తెరపడింది. ఈ మ్యాచ్‌లో 193 బంతుల్లో అతడు శతకాన్ని సాధించాడు. ఇక తన టెస్టు కెరీర్లో స్మిత్‌కు ఇది 28వ సెంచరీ. 2021లో భారత్‌తో జరిగిన సిడ్నీ టెస్టులో అంతర్జాతీయ క్రికెట్లో స్మిత్ తన చివరి సెంచరీ సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్(109), కారీ(16) పరుగులతో ఉన్నారు. కాగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్( 5), ఉస్మాన్ ఖవాజా(37) రాణించక పోవడంతో 70 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ కలిసి మూడో వికెట్‌కి 134 పరుగుల భాగస్వామ్యంతో జట్టును అదుకున్నారు. ఈ క్రమంలో విదేశీ గడ్డపై తొలి సెంచరీను లబుషేన్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 104 పరుగులు సాధించిన లబుషేన్ ప్రబాత్ జయసూర్య బౌలింగ్‌లో ఔటయ్యాడు. శ్రీలంక బౌలర్లలో జయసూర్య మూడు వికెట్లు, రజితా, మెండీస్ తలా వికెట్ సాధించారు. చదవండి: IND vs ZIM: ఆరేళ్ల తర్వాత జింబాబ్వే పర్యటనకు టీమిండియా..! This is Steve Smith 28'th century moment pic.twitter.com/gxJXKAV9a5 — Hammered Truth 🇦🇺🦘 (@hammered_truth7) July 8, 2022 -
ICC Rankings: టాప్‌లో లబూషేన్.. దిగజారిన కోహ్లి ర్యాంక్
దుబాయ్: ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ బ్యాటర్ల హవా కొనసాగింది. ఏకంగా నలుగురు ఆటగాళ్లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సత్తా చాటిన ఆసీస్ ఆటగాడు లబూషేన్(103, 51) 912 పాయింట్లతో.. ఇంగ్లండ్ సారధి జో రూట్(897)ను వెనక్కు నెట్టి అగ్రస్థానానికి చేరుకోగా, స్టీవ్ స్మిత్(884) మూడో స్థానంలో, డేవిడ్ వార్నర్(775) ఆరు, ట్రవిస్ హెడ్(728) పదో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ 5వ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా, టెస్ట్ సారధి విరాట్ కోహ్లి ఓ స్థానాన్ని కోల్పోయి 7వ ప్లేస్‌లో ఉన్నాడు. 🔝 Labuschagne dethrones Root 💪 Starc makes significant gains Australia stars shine in the latest @MRFWorldwide ICC Men’s Test Player Rankings. 👉 https://t.co/DNEarZ8zhm pic.twitter.com/W3Aoiy3ARP — ICC (@ICC) December 22, 2021 ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ఈ విభాగంలోనూ ఆసీస్ ప్లేయర్ల హవానే నడించింది. యాషెస్ రెండో టెస్ట్‌లో 6 వికెట్లు సాధించి ఇంగ్లండ్ పతనాన్ని శాసించిన మిచెల్ స్టార్క్.. దాదాపు ఏడాది తర్వాత తిరిగి టాప్-10లో చోటు దక్కించుకోగా.. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు దూరమైనప్పటికీ ఆసీస్ టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు. టీమిండియా సీనియర్ స్పిన్నర్ ఆశ్విన్ రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో ఇంగ్లండ్ సారధి రూట్ కెరీర్(111 టెస్ట్‌ల తర్వాత)లో తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. 🔹 Babar Azam surges to the 🔝 🔹 Mohammad Rizwan into the top three 🔥 Significant gains for Pakistan batters in the latest @MRFWorldwide ICC Men’s T20I Player Rankings 👉 https://t.co/hBFKXGWUp4 pic.twitter.com/qqUfYsFGkA — ICC (@ICC) December 22, 2021 మరోవైపు టీ20 ర్యాంకింగ్స్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్‌లు సంయుక్తంగా అగ్రపీఠాన్ని అధిరోహించగా.. పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 798 పాయింట్లతో మూడో ప్లేస్‌లో నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ 729 పాయింట్లతో ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. చదవండి: అభిమానులకు ‘గుడ్‌న్యూస్’... స్టేడియంలోకి అనుమతి.. అయితే! -
పింక్ బాల్ టెస్ట్‌లో ఆడడం చాలా కష్టం: మార్నెష్ లబూషేన్
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆడిలైడ్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నెష్ లబూషేన్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. రెండో రోజు మ్యాచ్ అనంతరం విలేకరల సమావేశంలో మాట్లాడిన లబూషేన్ పలు విషయాలను వెల్లడించాడు. పింక్‌బాల్‌తో ఆడడం చాలా కష్టమని, అంత సులభంగా పరుగులు రాబట్టలేమని లబూషేన్ తెలిపాడు. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఆడడం చాలా భిన్నమైనదని, ఒక్కో పిచ్‌పై ఒక్కోలా పింక్ బాల్ ప్రవర్తిస్తుందని అతడు చెప్పాడు. "పింక్ బాల్‌తో ఆడడం చాలా కష్టం. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్.. సాధరణ టెస్ట్ మ్యాచ్ కంటే భిన్నంగా ఉంటుంది. మేము గతంలో ఇదే వేదికలో పాకిస్తాన్‌తో ఆడాము. అప్పుడు వికెట్‌పై కొంచెం గ్రాస్ ఉండడంతో పిచ్ చదునుగా ఉండేది. దీంతో బంతి అంత బౌన్స్‌గా కాలేదు. కానీ ప్రస్తుతం పిచ్‌పై ఎక్కువగా గ్రాస్ ఉండడంతో బంతి ఎక్కువగా బౌన్స్ అవుతోంది. దీంతో ఆడడం చాలా కష్టం అవుతోంది. రెండో రోజు ఆట ప్రారంభించినప్పుడు పరుగులు ఎలా సాధించాలో నాకు అర్ధం కాలేదు" అని లబూషేన్ పేర్కొన్నాడు. ఇక ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 473 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటరల్లో లబూషేన్(103), వార్నర్(95), స్మిత్(93) టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకే ఆలౌటైంది. ప్రస్తుతం మ్యాచ్ జరుగుతోంది. చదవండి: IPL 2022: ‘‘అవును.. అతడిని తీసుకున్నాం’’.. కొత్త ఫ్రాంఛైజీ మెంటార్‌గా గౌతీ -
దిగజారిన పాక్ కెప్టెన్.. రెండో స్థానంలో అశ్విన్
Babar Azam: టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత వరుస వైఫల్యాల బాట పట్టిన పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ ఆజమ్.. తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. బంగ్లాదేశ్, విండీస్‌లతో జరిగిన సిరీస్‌ల్లో దారుణంగా విఫలమైన బాబర్.. రెండు ర్యాంకులు దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. బాబర్.. బంగ్లాదేశ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 26 పరుగులు, విండీస్‌తో స్వదేశంలో జరుగుతున్న సిరీస్(2 మ్యాచ్‌లు)లో 8 పరుగులు మాత్రమే చేయడంతో అగ్రస్థానాన్ని చేజార్చుకున్నాడు. గత 5 మ్యాచ్‌ల్లో బాబార్ బ్యాటర్‌గా దారుణంగా విఫలమైనా పాక్ జట్టు మాత్రం ఐదింటిలోనూ గెలవడం విశేషం. వరుస వైఫల్యాలతో బాబర్ ర్యాంక్ పతనం కాగా.. ఇంగ్లండ్ డాషింగ్ ప్లేయర్ డేవిడ్ మలాన్ తిరిగి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. అతని తర్వాత రెండో ప్లేస్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ ఉన్నాడు. Australia’s batters and Pakistan’s pacers make significant gains in the latest @MRFWorldwide ICC Men’s Test Player Rankings 📈 Details 👉 https://t.co/kkMymOpUSW pic.twitter.com/SeCzbldK5g — ICC (@ICC) December 15, 2021 ఇదిలా ఉంటే, ఈ వారం ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ ఆటగాళ్లు సత్తా చాటారు. బ్యాటర్ల విభాగంలో లబూషేన్ రెండో స్థానానికి ఎగబాకగా, డేవిడ్ వార్నర్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక బౌలర్ల విభాగానికి వస్తే.. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానాన్ని పదిలం చేసుకోగా.. పాక్ బౌలర్ షాహిన్ అఫ్రిది మూడో ప్లేస్‌కు ఎగబాకాడు. ఆసీస్ బౌలర్ పాట్ కమిన్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: రిటైర్మెంట్పై స్పందించిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్.. -
పక్కకు పోతుందని వదిలేశాడు.. మైండ్‌బ్లాక్; లబుషేన్ అద్భుతం
Marnus Labuschagne Super Delivery Shocks Cameron Green: షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ అద్భుత బంతితో మెరిశాడు. స్వతహాగా బ్యాట్స్‌మన్ అయిన లబుషేన్లో ఇలాంటి వైవిధ్యమైన బౌలింగ్ ఉందా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. విషయంలోకి వెళితే.. షెఫీల్డ్ టోర్నీలో క్వీన్స్లాండ్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. కాగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 16వ ఓవర్‌ను లబుషేన్ వేశాడు. క్రీజులో ఉన్న కామెరాన్ గ్రీన్.. లబుషేన్ వేసిన ఓవర్ మూడో బంతి పక్కకు పోతుందని భావించాడు. అయితే బంతి అనూహ్యంగా ఇన్‌స్వింగ్ అయి వికెట్లను గిరాటేసింది. దీంతో గ్రీన్‌కు దెబ్బకు మైండ్‌బ్లాక్ అయింది. లబుషేన్ అద్బుత బౌలింగ్‌పై క్వీన్స్ లాండ్ కెప్టెన్ ఉస్మాన్ ఖవాజా స్పందించాడు. చదవండి: T20 World Cup 2021: అదరగొడుతున్న ఆడం జంపా.. అయినా గానీ... ''లబుషేన్ బౌలింగ్‌లో వైవిధ్యత ఏంటనేది ఏడేళ్ల క్రితమే చూశా. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ప్రాక్టీస్ సమయంలో లబుషేన్ నాకు బంతులు విసిరాడు. అతను వేసిన ప్రతీ బంతి వికెట్ల మీదకు వస్తుండడంతో ఆడడం కష్టమైంది. కానీ ఆ తర్వాత లబుషేన్ బ్యాటింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టడంతో బౌలింగ్‌ను లైట్ తీసుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు అతనికి బౌలింగ్ చేసే అవకాశం లభించింది. ఈరోజు మ్యాచ్‌లో అతను అద్భుతంగా బౌలింగ్ వేశాడు. ఇది ఇలాగే కొనసాగితే లబుషేన్ మంచి బౌలర్‌గాను చూడొచ్చు. రానున్న ఇంగ్లండ్ సిరీస్‌కు లబుషేన్‌ను సరిగ్గా వినియోగిస్తే మాత్రం ఆసీస్‌కు తిరుగుండదు. నా వరకు అతని ఆటతీరును ఎంజాయ్ చేశా.. ఎంజాయ్ చేస్తూనే ఉంటా అంటూ చెప్పుకొచ్చాడు. అయితే మ్యాచ్‌లో క్వీన్‌లాండ్స్ ఓటమి పాలవడం విశేషం. క్వీన్స్లాండ్ విధించిన 95 పరుగుల లక్ష్యాన్ని వెస్ట్రన్ ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇక మార్నస్ లబుషేన్ ఆస్ట్రేలియా తరపున 18 టెస్టుల్లో 1885 పరుగులు.. 13 వన్డేల్లో 473 పరుగులు చేశాడు. చదవండి: T20 WC 2021: పాపం కివీస్.. టి20 ప్రపంచకప్ కొట్టినా నెంబర్‌వన్ కాకపోవచ్చు Get the feeling Cameron Green is going to be hearing absolutely heaps from Marnus about this one all summer long #SheffieldShield pic.twitter.com/6BHAg7MVmF — cricket.com.au (@cricketcomau) November 13, 2021 -
45 ఏళ్ల వయసులో ఏమా విధ్వంసం.. 15 ఫోర్లు, 15 సిక్సర్లు
లండన్: కౌంటీ క్రికెట్లో కెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న 45 ఏళ్ల ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ డారెన్ స్టీవెన్స్ బౌండరీలు, సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చేలరేగిపోయాడు. టాలెంట్‌కు వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపించాడు. శుక్రవారం గ్లామోర్గన్‌తో జరిగిన మ్యాచ్‌లో 149 బంతుల్లో 15 బౌండరీలు, 15 సిక్సర్ల సాయంతో 128 స్ట్రయిక్ రేట్‌తో 190 పరుగులు సాధించాడు. లేటు వయసులో స్టీవెన్స్ చేసిన విధ్వంసాన్ని చూసిన యువ క్రికెటర్లు ముక్కున వేలేసుకున్నారు. Enjoy EVERY boundary from Darren Stevens' 190 😍 Watch him bowl LIVE: https://t.co/4ZkDAI69AU#LVCountyChamp pic.twitter.com/rgKdT0GtaT — LV= Insurance County Championship (@CountyChamp) May 21, 2021 ఇంతటితో ఆగని స్టీవెన్స్ బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. ఆసీస్ స్టార్ ఆటగాడు మార్నస్ లబూషేన్‌ను ఎల్బీడబ్యూ చేసి వయసు మీదపడినా తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని, యువ బ్యాట్స్మెన్లకు సవాల్ విసిరాడు. ఇదిలా ఉంటే, 315 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన స్టీవెన్స్ 15940 పరుగులతో పాటు 565 వికెట్లు సాధించాడు. అతనికిది 36వ ఫస్ట్ క్లాస్ సెంచరీ. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన కెంట్.. స్టీవెన్స్ అద్భుత ఇన్నింగ్స్ సహకారంతో 307 పరుగులు స్కోర్ చేయగలిగింది. Of course he's just dismissed Marnus Labuschagne for the second time this season Reminder: Darren Stevens is 45!!! 🤯 Watch Now: https://t.co/4ZkDAI69AU pic.twitter.com/Zab35CrmLb — LV= Insurance County Championship (@CountyChamp) May 21, 2021 92 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును స్టీవెన్స్ ఆదుకున్నాడు. ఎనిమిదో వికెట్‌కు 36 పరుగులు, తొమ్మిదో వికెట్‌కు 166 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. అనంతరం బౌలింగ్‌లో లబూషేన్‌ను ఔట్ చేసి ప్రత్యర్ధిని కోలుకోలుని దెబ్బతీశాడు. రెండు రోజు ఆట ముగిసే సమయానికి గ్లామోర్గన్ 2 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. చదవండి: సలాం సాహా.. నిజమైన ప్రొఫెషనలిజం చూపించావు -
ఆ క్యాచ్‌పై తీవ్ర చర్చ.. మీరు కూడా ఓ లుక్కేయండి
న్యూసౌత్‌వేల్స్: క్రికెట్లో కొన్ని అసాధారణ క్యాచ్‌లు ఎప్పటికీ మనకు గుర్తుండిపోతాయి. సింగిల్ హ్యాండెడ్ క్యాచ్, బౌండరీ లైన్‌పై క్యాచ్‌లు, డైవ్ కొట్టి పట్టిన క్యాచ్‌లు, రన్నింగ్ బ్యాక్ క్యాచ్‌లు ఎక్కువగా అభిమానుల్ని అలరిస్తూ ఉంటాయి. కాగా, ఇప్పుడు ఒక రన్నింగ్ బ్యాక్ క్యాచ్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. అది అసాధారణ క్యాచ్ అయినప్పటికీ కూడా దాన్ని ఎలా క్యాచ్ ఇస్తారంటూ ట్వీటర్లో ప్రశ్నల వర్షం కురుస్తోంది. వివరాల్లోకి వెళితే.. షెఫల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా న్యూసౌత్‌వేల్స్-క్వీన్‌లాండ్స్ మధ్య నిన్న మ్యాచ్ ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో క్వీన్‌లాండ్స్ ఆటగాడు లబూషేన్ ఒక మంచి క్యాచ్‌ను అందుకున్నాడు. మిచెల్ స్వీప్సెన్ బౌలింగ్‌లో న్యూసౌత్‌వేల్స్ ఆటగాడు బాక్స్టర్ హోల్ట్ ఒక షాట్ ఆడగా అది కాస్తా అవుట్ సైడ్ ఎడ్జ్ పట్టుకుని గాల్లోకి లేచింది. ఆ సమయంలో కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న లబూషేన్ వెనక్కి పరుగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్ అందుకున్నాడు. బాల్‌ను వెంటాడీ మరీ క్యాచ్ తీసుకున్నాడు. అయితే క్యాచ్‌ను అందుకున్న మరుక్షణమే అంటే ఇంకా పూర్తి నియంత్రణ రాకుండా ఆ క్యాచ్‌ను కిందికి విసిరేశాడు. దీనిపైనే చర్చ నడుస్తోంది. ఆ క్యాచ్‌ను పట్టిన వెంటనే ఇలా కావాలనే కిందికి విసిరేయడాన్ని కామెంటేటర్లు కూడా అనుమానం వ్యక్తం చేశారు. అది క్యాచ్ తీసుకున్నాడా.. లేక డ్రాప్ చేశాడా అనే అనుమానం లేవనెత్తారు. ఇదే విషయాన్ని ట్వీటర్లో అభిమానులు కూడా వేలెత్తిచూపుతున్నారు. ఇది లీగల్ క్యాచ్ ఎలా అవుతుందంటూ ప్రశ్నిస్తున్నారు. మరి కొంతమంది ఇది కచ్చితంగా క్యాచ్ అంటూ కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు. ఇక్కడ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదని, క్యాచ్ పట్టిన తర్వాత కిందికి విసిరేయవచ్చని బదులిస్తున్నారు. ఇక్కడ గత మెగా ఈవెంట్లలో జరిగిన సందర్భాలను కూడా ప్రస్తావిస్తున్నారు. 1999 వరల్డ్‌కప్‌లో భాగంగా సూపర్ సిక్స్ మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను దక్షిణాఫ్రికా ఆటగాడు గిబ్స్ ఇలానే పట్టి వదిలేశాడని అంటున్నారు. అప్పుడు అది క్యాచ్ ఔట్ ఇవ్వలేదని నిలదీస్తున్నారు. దానికి-దీనికి కూడా ఒకే తరహా పోలికలున్నాయని వాదనకు దిగుతున్నారు. A 'peculiar' ending to the NSW innings, with this deemed to be a legal catch #SheffieldShield pic.twitter.com/T4gQgr1Rc2 — cricket.com.au (@cricketcomau) April 4, 2021 -
లైఫ్ ఇచ్చారు.. మూల్యం చెల్లించుకున్నారు!
బ్రిస్బేన్: తనకు లైఫ్ ఇస్తే ఎలా ఉంటుందో మరోసారి నిరూపించాడు ఆసీస్ స్టార్ ఆటగాడు లబూషేన్. క్యాచ్‌ను వదిలేస్తే సెంచరీతో కదం తొక్కాడు లబూషేన్. 37 పరుగుల వద్ద దొరికిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకుని శతకం పూర్తి చేసుకున్నాడు. ఇది లబూషేన్‌కు టెస్టుల్లో ఐదో సెంచరీ. బ్రిస్బేన్ టెస్టులో భాగంగా లబూషేన్ క్యాచ్‌ను రహానే వదిలేశాడు. నవదీప్ సైనీ వేసిన 36 ఓవర్ ఐదో బంతికి గల్లీలోకి స్టైయిట్ ఫార్వర్డ్ క్యాచ్ ఇచ్చాడు లబూషేన్. దాన్ని రహానే జారవిడిచాడు. పట్టాల్సిన క్యాచ్‌ను వదిలేయడంతో రహానే నిరాశ చెందాడు. స్టీవ్ స్మిత్ ఔటైన తర్వాత ఓవర్లో లబూషేన్ క్యాచ్ ఇచ్చినా అది నేలపాలైంది. కానీ ఆ తర్వాత మళ్లీ లబూషేన్ చాన్స్ ఇచ్చాడు. లబూషేన్ ఇచ్చిన మరొక క్యాచ్ ఫస్ట్ స్టిప్‌లో పుజారా ముందు పడిపోవడంతో మళ్లీ బ్రతికిపోయాడు. ఆ తర్వాత హాఫ్ సెంచరీని శతకంగా మలచుకున్నాడు లబూషేన్. శతకంతో ఆసీస్ తేరుకోగా, టీమిండియా మూల్యం చెల్లించుకున్నట్లయ్యింది. 195 బంతుల్లో 9 ఫోర్లతో సెంచరీ సాధించాడు లబూషేన్. మాథ్యూవేడ్(45;87 బంతుల్లో 6 ఫోర్లు)తో కలిసి 113 పరుగులు జత చేశాడు లబూషేన్. కాగా, ఆసీస్ స్కోరు రెండొందల వద్ద ఉండగా వేడ్ నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. కాగా, సెంచరీ సాధించిన తర్వాత లబూషేన్ ఎంత సేపో క్రీజ్‌లో నిలవలేదు. నటరాజన్ వేసిన 66 ఓవర్ ఐదో బంతికి పంత్‌కు క్యాచ్ లబూషేన్ ఔటయ్యాడు. (రోహిత్ ‘బౌలింగ్’ మార్చాడు) నటరాజన్‌కు తొలి వికెట్ మాథ్యూవేడ్‌ను నటరాజన్ ఔట్ చేశాడు. ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన నటరాజన్.. వేడ్ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నింగ్స్ 64 ఓవర్ నాల్గో బంతికి వేడ్ పెవిలియన్ చేరాడు. అవుట్ సైడ్ ఆప్ స్టంప్‌కు వేసిన గుడ్ లెంగ్త్‌లో వేసిన బంతిని పుల్ చేయబోయిన వేడ్.. శార్దూల్ ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ బంతి ఎడ్జ్ తీసుకోవడంతో క్యాచ్‌గా లేచింది. ఆ క్యాచ్‌ను పట్టడానికి నటరాజన్ పరుగెత్తగా, శార్దూల్ ఠాకూర్‌ను చూసి వెనక్కి తగ్గాడు. ఈ ఇద్దరు క్రికెటర్ల సమన్వయంతో వేడ్ పెవిలియన్ బాట పట్టాడు. ఆపై లబూషేన్‌ను సైతం నటరాజన్ పెవిలియన్‌కు పంపాడు. దాంతో 213 పరుగుల వద్ద ఆసీస్ ఐదో వికెట్‌ను కోల్పోయింది. 204 బంతుల్లో 108 పరుగులు చేసి లబూషేన్ ఔటయ్యాడు. (లెఫ్టార్మ్ సీమర్‌ను చూసి ఎంత కాలమైందో తెలుసా?) -
లబూషేన్ క్రీజ్‌లో ఉండు: స్టార్క్ వార్నింగ్
సౌత్ ఆస్ట్రేలియా: ఇటీవల కాలంలో క్రికెట్లో మన్కడింగ్ మాట ఎక్కువగా వినిపిస్తోంది. బౌలర్ బంతిని విసరకముందే బ్యాట్స్‌మన్ క్రీజ్‌ను దాటి వెళితే అతన్ని మన్కడింగ్ ద్వారా ఔట్ చేయవచ్చు. ఇది ఐసీసీ నిబంధనల్లో భాగమే. ఈ సీజన్ ఐపీఎల్లో ఆర్సీబీతో మ్యాచ్‌లో అరోన్ ఫించ్ క్రీజ్‌ను దాటి వెళ్లినా ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జస్ట్ వార్నింగ్‌తో సరిపెట్టాడు. గతేడాది రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్‌ను మన్కడింగ్ ద్వారా ఔట్ చేయడంతో అశ్విన్ వార్తల్లో నిలిచాడు. ఆ సమయంలో కింగ్స్ పంజాబ్ తరఫున ఆడిన అశ్విన్ చర్య క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పలువురు అభిప్రాయపడ్డారు. దాంతోనే ఈ ఏడాది ఫించ్‌ను మన్కడింగ్ ద్వారా ఔట్ చేసే అవకాశం వచ్చినా అశ్విన్ వెనక్కి తగ్గి కేవలం వార్నింగ్‌తో సరిపెట్టాడు. (ప్లేఆఫ్స్ రేసు: ఎవరికి ఎంత అవకాశం?) కాగా, తాజాగా ఆస్ట్రేలియా దేశవాళీ సీజన్లో భాగంగా షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో మన్కడింగ్ చేస్తానంటూ క్వీన్స్లాండ్ ఆటగాడు లబూషేన్‌కు న్యూసౌత్ వేల్స్ పేసర్ అయిన మిచెల్ స్టార్క్ వార్నింగ్ ఇచ్చాడు. క్వీన్స్లాండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా 48 ఓవర్ ఐదో బంతికి ముందు స్టార్క్ పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని వేయడాన్ని ఆపేశాడు. ఆ క్రమంలోనే నాన్ స్టైకర్ ఎండ్‌లో ఉన్న లబూషేన్‌ను క్రీజ్‌లో ఉండమంటూ హెచ్చరించాడు. ఈ చర్యతో లబూషేన్ కాస్త ఆశ్చర్యానికి గురయ్యాడు. తాను క్రీజ్‌లో ఉన్నప్పటికీ ఇలా చెప్పడం ఏమిటని స్టార్క్‌ను తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. తాను క్రీజ్‌ను దాటి బయటకు వెళ్లలేదనే విషయాన్ని తన చేష్టల ద్వారా చెప్పాడు లబూషేన్. స్టార్క్‌ను ఏదో అడగబోతే అతను ఏదో అనుకుంటూ బంతిని వేయడానికి బౌలింగ్ ఎండ్‌కు చేరుకున్నాడు. క్వీన్స్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో లబూషేన్ సెంచరీ చేశాడు. 203 బంతుల్లో 16 ఫోర్లతో 117 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. A warning from Mitch Starc to Marnus Labuschagne 🙊 #SheffieldShield pic.twitter.com/iGGQU7lItP — cricket.com.au (@cricketcomau) October 30, 2020 -
‘జస్ప్రీత్ బుమ్రాతో చాలా డేంజర్’
బ్రిస్బేన్: టీమిండియా పేస్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రానే కఠినమైన బౌలర్ అని అంటున్నాడు ఆసీస్ క్రికెటర్ మార్కస్ లబూషేన్. ఇటీవల నిలకడగా రాణిస్తూ ఆసీస్ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయిన లబూషేన్.. బుమ్రా చాలా డేంజర్ అని అభిప్రాయపడ్డాడు.2020–21 సీజన్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించిన కాంట్రాక్ట్ జాబితాలో స్థానం దక్కించుకున్న లబూషేన్. అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియాలో భారత్ పర్యటించే అవకాశం ఉండటంతో బుమ్రాపై లబ్‌షేన్ ప్రశంసలు కురిపించాడు. ‘గంటకు 140 కి.మీల వేగంతో నిలకడా బౌలింగ్ చేయగల సత్తా బుమ్రాది. పరిస్థితులు అనుకూలిస్తే బంతిని ఇరువైపులా స్వింగ్‌ను రాబట్టడంలో కూడా బుమ్రా దిట్ట. అందుకే బుమ్రా బౌలింగ్ ఆడటం చాలా కష్టం. (టి20 ప్రపంచకప్ భవితవ్యం తేలేది నేడే) భారత్ పేస్ దళం చాలా మెరుగ్గా ఉంది. అందులో బుమ్రా ప్రమాదకర బౌలర్. నీకు నువ్వు బ్యాట్స్‌మన్‌గా పరీక్షించుకోవాలంటే బుమ్రా బౌలింగ్‌ను ఆడితేనే సత్తా బయటకొస్తుంది. టీమిండియా పేస్ దళానికి బుమ్రానే లీడర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. నేను భారత్‌లో ఒకే టెస్టు మ్యాచ్ ఆడాను. గతంలో సిడ్నీ మ్యాచ్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడా. నాకు భారత్ బౌలింగ్‌ను ఆడటంలో కొద్దిపాటి అనుభవం మాత్రమే ఉంది. ఇక పరిమిత ఓవర్ల సిరీస్ ఆడటానికి భారత్‌కు వచ్చా. టెస్టుల్లో పరంగా చూస్తే భారత్ బౌలింగ్‌ను చాలా తక్కువగానే ఆడాను. టీమిండియా పేస్ బౌలింగ్ యూనిట్లో ఇషాంత్ శర్మ కూడా బాగా మెరుగయ్యాడు. రాబోయే సిరీస్‌ల్లో భారత నుంచి బాగా గట్టి పోటీ తప్పదు’ అని బ్రిస్బేన్‌లో పీటీఐకి ఇచ్చిన ఇంటర్య్వూలో లబూషేన్ పేర్కొన్నాడు. ఇప్పటివరకూ 14 టెస్టు మ్యాచ్‌లు ఆడిన లబూషేన్ 63పైగా యావరేజ్‌తో ఉన్నాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గతేడాది లార్డ్స్ మైదానంలో యాషెస్ రెండో టెస్టులో స్టీవ్ స్మిత్ గాయపడటంతో లబూషేన్ కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్ సెంచరీతో మెరిసి ఆసీస్‌ను ఆదుకున్నాడు. దాంతో స్మిత్ జట్టులో ఉన్నప్పటికీ లబూషేన్ రెగ్యులర్ ఆటగాడు అయిపోయాడు. తనకు ఇచ్చిన వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు లబూషేన్. ఆపై పాకిస్తాన్‌తో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల్లో భారీ శతకాలు సాధించి ఆసీస్ ఇన్నింగ్స్ విజయాలు సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు.ఈ ఏడాది ఆరంభంలోనే డబుల్ సెంచరీ బాదేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన చివరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో లబూషేన్ డబుల్ సెంచరీ సాధించాడు. -
భారత్ పర్యటించకపోతే కష్టమే: లబ్‌షేన్
సిడ్నీ: ఒకవేళ భారత్ తమ దేశంలో పర్యటించకపోతే అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ లబ్‌షేన్ అన్నాడు. టి20 ప్రపంచకప్‌కు ముందు అక్టోబర్‌లో ఆసీస్‌కు వెళ్లనున్న భారత్ తొలుత ముక్కోణపు టి20 సిరీస్ ఆడనుంది. అనంతరం డిసెంబర్–జనవరిలో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌తో ఈ సుదీర్ఘ పర్యటన ముగుస్తుంది. అయితే ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల వల్ల అక్కడి పర్యటనతో పాటు టి20 ప్రపంచకప్ కూడా సందిగ్ధంలో పడింది. దీనిపై లబ్‌షేన్ మాట్లాడుతూ ‘ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌తో సిరీస్ జరగకపోతే పూర్తిగా దివాలా తీయడం ఖాయం. ఆటగాడిగా నాతోపాటు జట్టుకు, బోర్డుకు ఇది తీరని నష్టం చేస్తుంది’ అని అన్నాడు. తమ దేశంలో క్రికెట్ వెలిగిపోవాలంటే భారత్‌తో సిరీస్ కచ్చితంగా జరగాల్సిందేనని చెప్పాడు. ప్రస్తుత లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానని... వన్డేల్లో కూడా సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడే నైపుణ్యం సంపాదిస్తున్నట్లు ఈ బ్యాట్స్‌మన్ చెప్పాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో లబ్‌షేన్ మూడో ర్యాంకులో ఉన్నాడు. కరోనా నుంచి ఆస్ట్రేలియా గట్టెక్కిందని, ప్రపంచం, మిగతా దేశాలతో పోల్చితే కరోనా ప్రభావం తక్కువేనని అతను వివరించాడు. ఆసీస్ కట్టుదిట్టమైన చర్యలతో అక్కడ వైరస్ అదుపులోనే ఉంది. కేవలం 6,800 బాధితులే ఉండగా... 100లోపే మరణాలు సంభవించాయి. -
‘టీమిండియా రాకపోతే.. తీవ్రంగా నష్టపోతాం’
సిడ్నీ: ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) దృష్టంతా భారత్‌పైనే ఉంది. కరోనా వైరస్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాల జాబితాలో ఆస్ట్రేలియా కూడా ఉన్నప్పటికీ అక్కడ కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టింది. అయితే ఈ ఏడాది చివరి నాటికి అంతా సద్దుమణిగి క్రీడా టోర్నీలో కూడా ఆరంభమైతే కొన్ని బోర్డులకు ఊరట లభిస్తుంది. ప్రస్తుతం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) మళ్లీ గాడిన పడాలంటే భారత్ పర్యటన ఒక్కటే మార్గమంటున్నారు ఆ దేశ క్రికెటర్లు. ఈ సీజన్ చివర్లో ఆస్ట్రేలియాలో భారత్ పర్యాటించాల్సి ఉండటంతో అది ఏమౌతుందోనని ఆసీస్ క్రికెటర్లు ఆందోళనలోనే ఉన్నారు. భారత జట్టు తమ దేశంలో పర్యటిస్తేనే ఆర్థికంగా ఏర్పడ్డ నష్టాలను సీఏ పూడ్చుకోగలుగుతుందని టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ కొన్ని రోజుల క్రితం పేర్కొనగా, తాజాగా ఆ దేశ స్టార్ ఆటగాడు లబూషేన్ సైతం ఇదే అభిప్రాయన్ని వ్యక్తం చేశాడు. ఒకవేళ నిర్ణీత షెడ్యూల్లో భారత జట్టు పర్యటనకు రాకపోతే అది ఆర్థికపరమైన వినాశానికి దారి తీస్తుందన్నాడు. (‘టీమిండియా పర్యటనే మాకు శరణ్యం’) ఈ టోర్నీ జరగకపోతే తనతో పాటు జట్టుకు దేశానికి కూడా తీవ్ర నష్టమేనని లబూషేన్ వెల్లడించాడు. మరో 3నుంచి 4 నెలల్లో కానీ, 4 నుంచి 5 నెలల్లో కానీ అంతా చక్కబడుతుందని లబూషేన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఒకవేళ అదే జరిగితే ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ కచ్చితంగా వస్తుందన్నాడు. ఇటీవల టిమ్ పైన్ మాట్లాడుతూ.. టీమిండియా పర్యటనపై తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని, తమ కష్టాలకు భారత పర్యటనతో ముగింపు దొరుకుతుందని ఆశిస్తున్నానని పైన్ అన్నాడు. ఒకవేళ ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ రాకపోతే 250 నుంచి 300 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందన్నాడు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా-ప్రభుత్వం మధ్య ఇప్పటికే చర్చలు నడిచాయన్నాడు. దీనికి సంబంధించి ఆస్ట్రేలియా కొన్ని ఆంక్షల్ని సడలించడమే కాకుండా, చార్టెడ్ విమానాలు, ఐసోలేషన్ వంటివి టీమిండియా క్రికెటర్ల కోసం ప్రత్యేకం ఏర్పాటు చేస్తుందన్నాడు. కాగా, ఆస్ట్రేలియాలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. దాంతో లాక్డౌన్ రూల్స్‌ను కూడా సడలిస్తూ ముందుకు సాగుతోంది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఇప్పటివరకూ ఆస్ట్రేలియాలో 6,800 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మృతి చెందిన వారి సంఖ్య వంద కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. (అతని రీఎంట్రీ ఖాయం.. బెట్ వేస్తా: రాయుడు) -
లబ్‌షేన్‌కు సీఏ కాంట్రాక్టు
మెల్బోర్న్: ఆసీస్ జట్టులో ఇటీవల నిలకడగా రాణిస్తున్న లబ్‌షేన్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సెంట్రల్ కాంట్రాక్టు కట్టబెట్టింది. అయితే స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ గైర్హాజరీలో కంగారూ జట్టును ఆదుకున్న ఉస్మాన్ ఖాజాకు సీఏ షాకిచ్చింది. 2020–21 సీజన్‌కుగానూ గురువారం ప్రకటించిన కాంట్రాక్టు జాబితా నుంచి అతన్ని తప్పించింది. గతేడాది యాషెస్ సిరీస్ నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని ఖాజాతో పాటు మార్కస్ హారిస్, నాథన్ కూల్టర్‌నీల్, పీటర్ హ్యాండ్స్కోంబ్, షాన్ మార్‡్ష, మార్కస్ స్టొయినిస్ తమ కాంట్రాక్టులు కోల్పోయారు. వీరి స్థానంలో బర్న్స్, లబ్‌షేన్, మాథ్యూ వేడ్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్‡్ష, పేసర్ కేన్ రిచర్డ్సన్, స్పిన్నర్ ఆస్టన్ అగర్ సెంట్రల్ కాంట్రాక్టులు పొందారు. సీఏ ప్రకటించిన జాబితాలో మొత్తం 20 మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. గతేడాది అక్టోబర్‌లో చివరి టి20 ఆడిన మ్యాక్స్‌వెల్‌ను జాబితాలో కొనసాగించారు. -
‘15 నిమిషాల ఆటలో స్పెషల్ ప్లేయర్‌ని చూశా’
సిడ్నీ: ఫీల్డ్‌లో దిగితే పరుగుల దాహం.. ఒక్కసారి క్రీజ్‌లో కుదురుకుంటే సెంచరీల కోసం ఆరాటం. అతడే లబూషేన్. ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు గుండె చప్పుడు. 2018 అక్టోబర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసినా, అతని లైఫ్ వచ్చింది మాత్రం గతేడాది యాషెస్ సిరీస్ అనే చెప్పాలి. యాషెస్ సిరీస్ రెండో టెస్టులో స్టీవ్ స్మిత్ గాయపడటంతో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి మెరిశాడు. తొలి కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా రికార్డు పుటల్లోకెక్కిన లబూషేన్.. అప్పట్నుంచి ఇప్పటివరకూ వెనుదిరిగి చూడలేదు. వరుస పెట్టి సెంచరీలు సాధిస్తూ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. గతేడాది హ్యాట్రిక్ టెస్టు సెంచరీలు సాధించిన ఆసీస్ ఆటగాడు లబూషేన్.. ఈ ఏడాది ఆరంభంలోనే డబుల్ సెంచరీ బాదేశాడు. గత నెల్లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ద్విశతకంతో మెరిశాడు. గతేడాది టెస్టుల్లో వెయ్యి పరుగులు సాధించిన ఏకైక ప్లేయర్ కూడా లబూషేన్ కావడం ఇక్కడ విశేషం. అయితే లబూషేన్ ఆటను ఆస్వాదించే ఒకానొక సందర్భంలో అతనిలో తాను కనబడ్డానని భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాను కుదిపేసిన కార్చిచ్చు బాధితుల సహాయార్థం నిధుల సేకరణ కోసం తలపెట్టిన ఎగ్జిబిషన్ మ్యాచ్ ‘బుష్ ఫైర్ బాష్’లో రెండు జట్లలో ఒకదానికి సచిన్ కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మీడియా సమావేశంలో సచిన్‌కు ఎదురైన ప్రశ్నకు ఎవరూ ఊహించని లబూషేన్ పేరును ప్రస్తావించాడు. ‘ ఇప్పటివరకూ మీ ఆటకు దగ్గరగా ఉన్న ఆటగాడు ఎవరైనా ఉన్నారా’ అన్న ప్రశ్నకు అందుకు లబూషేన్ అని సమాధానమిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ‘యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టును నేను చూశా. మా మావయ్యతో కలిసి మ్యాచ్‌ను ఇంట్రెస్ట్‌గా చూస్తున్నా. ఆ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ గాయం కారణంగా బ్యాటింగ్‌కు రాకపోవడంతో అతని స్థానంలో లబూషేన్ ఇన్నింగ్స్‌ను కాస్త ఆసక్తిగానే తిలకించా. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో లబూషేన్ ఆడిన రెండో బంతినే హిట్ చేశాడు. ఆ మ్యాచ్‌లో లబూషేన్ 15 నిమిషాలు ఆడిన తర్వాత లబూషేన్లో ఒక స్పెషల్ ప్లేయర్‌గా కనబడుతున్నాడనే విషయాన్ని పక్కనున్న మా అంకుల్‌తో అన్నా. అతని ఫుట్‌వర్క్ అమోఘం. అదే అతనిలో స్పెషల్. ఫుట్‌వర్క్ అనేది శరీరానికి సంబంధించినది కాదు. మనసుకు సంబంధించినది. ఫుట్‌వర్క్‌ను కదల్చడంలో పాజిటివ్‌గా ఆలోచించకపోతే, నీ కాలిని ఎటు కదల్చాలో తెలియదు. ఇక్కడ లబూషేన్ చక్కటి ఫుట్‌వర్క్‌తో ఉన్నాడు. ఫుట్‌వర్క్ విషయంలో నన్ను లబూషేన్ గుర్తు చేశాడు’ అని సచిన్ పేర్కొన్నాడు. -
టీమిండియాపైనే వన్డే అరంగేట్రం!
మెల్బోర్న్: గత కొంతకాలంగా ఆస్ట్రేలియా టెస్టు జట్టులో లబూషేన్ రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయాడు. వరుసగా పరుగుల మోత మోగిస్తూ ఆసీస్ టెస్టు జట్టులో ప్రత్యేక ముద్ర వేశాడు లబూషేన్. అతని రాకతో ఆసీస్ జట్టు మరింత బలోపేతం అయ్యిందనడంలో ఎటువంటి సందేహం లేదు. గతేడాది వెయ్యి టెస్టు పరుగులకు పైగా సాధించి ఆ ఫీట్ సాధించిన ఏకైక ఆటగాడిగా లబూషేన్ నిలవడం అతని ఆటకు అద్దం పడుతోంది. కాగా, ఇప్పటివరకూ సుదీర్ఘ ఫార్మాట్‌కు మాత్రమే పరిమితమైన లబూషేన్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో అరంగేట్రం చేయడానికి కూడా రంగం సిద్ధమైంది. ఈనెలలో టీమిండియాతో వన్డే సిరీస్ నేపథ్యంలో లబూషేన్ అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. దీనిపై ఆసీస్ జట్టు కెప్టెన్ అరోన్ ఫించ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. టెస్టుల్లో భీకరమైన ఫామ్‌లో ఉన్న లబూషేన్‌ను వన్డేల్లో తీసుకోవడానికి సమయం ఆసన్నమైందన్నాడు. ఈ క్రమంలోనే భారత్‌తో పోరుకు పక్కా ప్రణాళికతో సిద్ధం అవుతున్నట్లు తెలిపాడు. ‘ భారత్‌లో ఆ జట్టుతో పోరు ఎలా ఉంటుందో మాకు తెలుసు. మా ప్రణాళిక మాకు ఉంది. భారత్‌పై ఎప్పుడూ అనుమాన పడుతూ గేమ్ ప్లాన్‌ను అవలంభించకూడదు. అలా చేస్తే టీమిండియా ముందుగానే పైచేయి సాధిస్తుంది. ఏది జరిగిన టీమిండియాపై దూకుడుగా ఆడి సత్తాచాటతాం. భారత్‌ను వారి దేశంలో ఓడించే సత్తా మాకు ఉంది. మా ఆటగాళ్ల ప్రదర్శనపై నాకు నమ్మకం ఉంది. టీమిండియాను ఓడించే ఆత్మవిశ్వాసం మాలో ఉంది. టెస్టుల్లో సత్తాచాటిన లబూషేన్ వన్డే అరంగేట్రం అతి త్వరలోనే ఉంటుంది. ప్రధానంగా లబూషేన్ స్పిన్నర్లను బాగా ఆడతాడు. అది భారత్‌లో మాకు సహకరిస్తుంది. తన ఫామ్‌ను కొనసాగిస్తాడని ఆశిస్తున్నా’ అని ఫించ్ తెలిపాడు. జనవరి 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ భారత్-ఆసీస్‌ల మధ్య మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్ జరుగనుంది. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న శ్రీలంక చివరి టీ20 ముగిసిన తర్వాత స్వదేశానికి పయనమవుతుంది. శుక్రవారం భారత్-శ్రీలంకల మధ్య చివరిదైన మూడో టీ20 జరుగనుంది. -
టెస్టుల్లో కోహ్లి ‘టాప్’ ర్యాంకు పదిలం
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తన టాప్ ర్యాంక్‌ను పదిలపరుచుకున్నాడు. అతను 928 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంకులో కొనసాగుతుండగా... 911 రేటింగ్ పాయింట్లతో ఆసీస్ బ్యాట్స్‌మన్ స్మిత్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఆసీస్ తాజా బ్యాటింగ్ సంచలనం మార్నస్ లబ్‌షేన్ తొలిసారిగా మూడో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో 549 పరుగులు చేయడం అతనికి కలిసొచి్చంది. దక్షిణాఫ్రికాతో ముగిసిన రెండో టెస్టులో రాణించి ఇంగ్లండ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ 10వ స్థానంలో నిలిచాడు. ఇక భారత బ్యాట్స్మెన్లలో పుజారా ఒక స్థానం దిగువకు పడిపోయి ఆరో స్థానంలో, రహనే రెండు స్థానాలు దిగజారి 9వ స్థానంలో నిలిచారు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా (794) తన ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. -
ఈసారి డబుల్ సెంచరీ బాదేశాడు..!
సిడ్నీ: గతేడాది హ్యాట్రిక్ టెస్టు సెంచరీలు సాధించిన ఆసీస్ ఆటగాడు లబూషేన్.. ఈ ఏడాది ఆరంభంలోనే డబుల్ సెంచరీ బాదేశాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా తొలి రోజు ఆటలో సెంచరీతో అజేయంగా నిలిచిన లబూషేన్.. రెండో రోజు ఆటలో ద్విశతకం పూర్తి చేసుకున్నాడు. 130 పరుగుల వ్యక్తిగత స్కోరుతో శనివారం ఆటను కొనసాగించిన లబూషేన్ డబుల్ సెంచరీ సాధించి ఆ ముచ్చట తీర్చుకున్నాడు. గతేడాది వరుసగా మూడు టెస్టు సెంచరీలు సాధించడంతో పాటు ఆ క్యాలెండర్ ఇయర్లో వెయ్యికి పైగా పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచిన లబూషేన్.. అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.(ఇక్కడ చదవండి: 2020లో తొలి సెంచరీ) 283/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్.. మరో ఐదు పరుగులు జత చేసిన తర్వాత మాథ్యవేడ్(22) వికెట్‌ను కోల్పోయింది. ఆపై ట్రావిస్ హెడ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు లబూషేన్. కాకపోతే హెడ్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. ఆసీస్ స్కోరు 331 పరుగుల వద్ద హెడ్(10) ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత కెప్టెన్ టిమ్ పైన్‌పై పడింది . ఈ క్రమంలోనే లబూషేన్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఈ ఏడాది డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా కూడా లబూషేన్ రికార్డు నెలకొల్పాడు. లబూషేన్‌తో కలిసి 79 పరుగులు జత చేసిన తర్వాత పైన్(35) ఔటయ్యాడు. డబుల్ సెంచరీ సాధించిన కాసేపటికి లబూషేన్ కూడా పెవిలియన్ చేరాడు. 363 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్‌తో 215 పరుగులు చేసిన లబూషేన్ ఏడో వికెట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. చివర్లో మిచెల్ స్టార్క్(22) బ్యాట్ ఝుళిపించడంతో ఆసీస్ 454 పరుగులు చేసింది. భారీ శతకాల మోత.. లార్డ్స్ మైదానంలో యాషెస్ రెండో టెస్టులో స్టీవ్ స్మిత్ గాయపడటంతో లబూషేన్ కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్ సెంచరీతో మెరిసి ఆసీస్‌ను ఆదుకున్నాడు. దాంతో స్మిత్ జట్టులో ఉన్నప్పటికీ లబూషేన్ రెగ్యులర్ ఆటగాడు అయిపోయాడు. తనకు ఇచ్చిన వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు లబూషేన్. ఇటీవల పాకిస్తాన్‌తో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల్లో భారీ శతకాలు సాధించి ఆసీస్ ఇన్నింగ్స్ విజయాలు సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు. అదే జోరును కొనసాగిస్తూ న్యూజలాండ్తో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లోనూ భారీ శతకం నమోదు చేశాడు. 240 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు, 1 సిక్స్‌తో 143 పరుగులు చేశాడు. అంతకుముందు పాకిస్తాన్ జరిగిన రెండు వరుస టెస్టుల్లో లబూషేన్ 162, 185 పరుగులు చేశాడు. దాంతో హ్యాటిక్ సెంచరీల రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూడు భారీ శతకాలే అయినప్పటికీ వాటిని డబుల్ సెంచరీగా మార్చుకోవడంలో లబూషేన్ విఫలమయ్యాడు. దాన్ని కివీస్‌తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే తీర్చుకున్నాడు లబూషేన్. న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన లబూషేన్.. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆపై రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 63 పరుగులు సాధించాడు.(ఇక్కడ చదవండి: తొలి కాంకషన్ సబ్‌స్టిట్యూట్ క్రికెటర్) -
లబ్‌షేన్ మరో సెంచరీ
సిడ్నీ: కొంతకాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ లబ్‌షేన్ కొత్త ఏడాదిని కూడా ఘనంగా ప్రారంభించాడు. గత సంవత్సరం 11 టెస్టులు ఆడి 1104 పరుగులు చేసి ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచిన లబ్‌షేన్... న్యూజిలాండ్‌తో శుక్రవారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆరంభమైన మూడో టెస్టులో అజేయ సెంచరీతో (210 బంతుల్లో 130 బ్యాటింగ్; 12 ఫోర్లు, సిక్స్) చెలరేగాడు. ఇప్పటి వరకు కెరీర్లో 14 టెస్టులు ఆడిన లబ్‌షేన్ ఖాతాలో ఇది నాలుగో శతకం కాగా... ఈ నాలుగు గత ఐదు టెస్టుల్లోనే రావడం విశేషం. అతనికి మాజీ సారథి స్టీవ్ స్మిత్ (182 బంతుల్లో 63; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ కూడా తోడవ్వటంతో ఆసీస్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 283 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఆ్రస్టేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. బర్న్స్ (18) త్వరగా అవుట్ ఆయ్యాడు. ఈ దశలో వార్నర్ (45; 3 ఫోర్లు)కు జత కలిసిన లబ్‌షేన్ ఇన్నింగ్స్‌ను నిరి్మంచే పనిలో పడ్డాడు. వార్నర్ వెనుదిరిగాక క్రీజులోకొచ్చిన స్మిత్ ఖాతా తెరవడానికి ఏకంగా 39 బంతులు తీసుకున్నాడు. ఖాతా తెరిచాక స్మిత్ తన బ్యాట్‌కు పని చెప్పాడు. ఇదే క్రమంలో కెరీర్లో 28వ అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. లబ్õÙన్, స్మిత్ మూడో వికెట్‌కు 156 పరుగులు జోడించారు. ప్రస్తుతం లబ్షేన్తో పాటు వేడ్ (22 బ్యాటింగ్; 2 ఫోర్లు, సిక్స్) క్రీజులో ఉన్నాడు. ఇప్పటికే ఆసీస్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. -
2020లో తొలి సెంచరీ..
సిడ్నీ: గతేడాది హ్యాట్రిక్ టెస్టు సెంచరీల ఘనత.. అదే క్యాలెండర్ ఇయర్లో వెయ్యి టెస్టు పరుగులు సాధించిన రికార్డు సైతం ఆసీస్ క్రికెటర్ మార్కస్ లబూషేన్‌దే. 2019లో 1,104 టెస్టు పరుగులు సాధించిన లబూషేన్.. ఆ ఏడాది వెయ్యి పరుగులు చేరిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అయితే ఈ ఏడాదిని కూడా ఘనంగా ఆరంభించాడు లబూషేన్. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భాగంగా తొలి రోజు ఆటలో లబూషేన్ శతకంతో మెరిశాడు. ఫలితంగా 2020లో తొలి టెస్టు సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా తన కెరీర్లో 13 టెస్టులు ఆడిన లబూషేన్ 4 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 60కి పైగా యావరేజ్‌తో 56కు పైగా స్టైక్‌రేట్‌తో తనదైన ముద్రతో చెలరేగిపోతూ ఆసీస్ జట్టుకు వెన్నుముకగా నిలుస్తున్నాడు. గత ఐదు టెస్టుల్లో నాలుగు సెంచరీలు సాధించడం అతడిలోనే నిలకడకు అద్దం పడుతోంది.(ఇక్కడ చదవండి: భారీ హ్యాట్రిక్ శతకాలు.. డబుల్ సెంచరీ ఎప్పుడో?) న్యూజిలాండ్‌తో ఆఖరిదైన మూడో టెస్టులో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దాంతో ఆసీస్ బ్యాటింగ్‌ను డేవిడ్ వార్నర్- జో బర్న్స్‌లు ఆరంభించారు. బర్న్స్(18) నిరాశపరచగా, వార్నర్ మాత్రం 45 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో లబూషేన్-స్టీవ్ స్మిత్‌ల జోడి ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఒకవైపు స్మిత్ హాఫ్ సెంచరీ సాధించగా, ఫస్ట్ డౌన్లో వచ్చిన లబూషేన్ సెంచరీ సాధించాడు. గ్రాండ్ హోమ్ వేసిన ఇన్నింగ్స్ 72 ఓవర్ మూడో బంతికి ఫోర్ కొట్టడంతో ద్వారా లబూషేన్ సెంచరీ పూర్తయ్యింది. ఈ టెస్టులో ఆసీస్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 77 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది.(ఇక్కడ చదవండి: లబూషేన్ @ 1000 నాటౌట్) -
భారీ మార్పులతో భారత పర్యటనకు ఆసీస్
సిడ్నీ: ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా జట్టు వరుసగా భారీ విజయాలు నమోదు చేయడంలో లబూషేన్ పాత్రనే కీలకంగా చెప్పాలి. గతేడాది పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన లబూషేన్.. ఈ ఏడాది విశేషంగా రాణించి ఆసీస్ జట్టుకు వెన్నుముకగా మారిపోయాడు. ఇప్పుడు ఆసీస్ అత్యంత పటిష్టంగా మారిందంటే అందుకు లబూషేన్ ఆట కారణం. టెస్టుల్లో 58.05 సగటుతో పాటు హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన అరుదైన ఘనతను కూడా లబూషేన్ సొంతం చేసుకున్నాడు. దాంతో అతని వన్డే అరంగేట్రం షురూ అయ్యింది. వచ్చే నెలలో భారత పర్యటనలో భాగంగా ఆసీస్ వన్డే జట్టులో లబూషేన్ చోటు దక్కించుకున్నాడు. జనవరి 14వ తేదీ నుంచి భారత్‌తో ఆరంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌లో లబూషేన్‌కు అవకాశం కల్పించారు ఆసీస్ సెలక్టర్లు. ఈ మేరకు 14 మందితో కూడిన జట్టులో లబూషేన్ సునాయసంగా చోటు దక్కించుకున్నాడు. కాగా, మానసిక సమస్యలతో కొన్ని వారాలు క్రికెట్‌కు దూరమై తిరిగి తాను సిద్ధమంటూ ప్రకటించిన ఆసీస్ హార్డ్ హిట్టర్ మ్యాక్స్‌వెల్‌కు చోటు దక్కలేదు. అంతేకాకుండా ఆసీస్ భారీ మార్పులతో భారత పర్యటనకు సిద్ధమైంది. టీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో తమ జట్టును పూర్తిగా పరీక్షించడానికి భారత్‌తో ఆడే వన్డే సిరీస్ కీలకంగా భావిస్తోంది సీఏ మేనేజ్మెంట్. దాంతో వన్డే వరల్డ్‌కప్‌లో ఆడిన ఏడుగురు ఆటగాళ్లు.. భారత్‌తో వన్డే సిరీస్‌లో అవకాశం దక్కించుకోలేకపోయారు. వీరిలో మ్యాక్స్‌వెల్‌తో పాటు మార్కస్ స్టోయినిస్, నాథన్ లయన్, ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, కౌల్టర్ నైల్, బెహ్రెన్డ్రాఫ్లను పక్కన పెట్టింది. అయితే బెహ్రెన్‌డార్ఫ్‌కు గాయం కూడా కావడంతో అతన్ని అసలు పరిశీలించలేదు. కాగా, ఆసీస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ సైతం భారత పర్యటనకు రావడం లేదు. అతని స్థానంలో సీనియర్ అసిస్టెంట్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ జట్టుతో పాటు భారత్‌కు రానున్నాడు. ఆసీస్ వన్డే జట్టు ఇదే.. అరోన్ ఫించ్(కెప్టెన్), సీన్ అబాట్, అస్టన్ ఆగర్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమ్మిన్స్, హ్యాండ్స్కాంబ్, హజిల్‌వుడ్, లబూషేన్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, అస్టన్ టర్నర్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా -
లబూషేన్ @ 1000 నాటౌట్
పెర్త్: లబూషేన్.. ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు గుండె చప్పుడు. పరుగుల మోత మోగిస్తూ దిగ్గజ క్రికెటర్లనే మైమరిపిస్తున్నాడు. గతేడాది అక్టోబర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసినా, అతని లైఫ్ వచ్చింది మాత్రం ఈ ఏడాది జరిగిన యాషెస్ సిరీస్ అనే చెప్పాలి. యాషెస్ సిరీస్ రెండో టెస్టులో స్టీవ్ స్మిత్ గాయపడటంతో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి ఆకట్టుకున్నాడు. తొలి కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా రికార్డు పుటల్లోకెక్కిన లబూషేన్.. అప్పట్నుంచి ఇప్పటివరకూ వెనుదిరిగి చూడలేదు. వరుస పెట్టి సెంచరీలు సాధిస్తూ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. లబూషేన్ తన కెరీర్లో ఇప్పటివరకూ మూడు టెస్టు సెంచరీలు సాధించగా ఆ మూడు వరుసగా వచ్చినవే కావడం అతని బ్యాటింగ్‌లో పరిణితికి అద్దం పడుతోంది. తనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడం సూపర్ సక్సెస్ చేసుకున్న క్రికెటర్ లబూషేన్. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో లబూషేన్(143) భారీ సెంచరీ సాధించాడు. అంతకుముందు పాకిస్తాన్‌తో జరిగిన వరుస రెండు టెస్టుల్లో భారీ శతకాలనే నమోదు చేశాడు. పాక్‌తో తొలి టెస్టులో 162 పరుగులు, రెండో టెస్టులో 185 పరుగులు చేసి ఇన్నింగ్స్ విజయాల్లో పాలు పంచుకున్నాడు. అయితే ఈ ఏడాది వెయ్యి టెస్టు పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా లబూషేన్ మరో రికార్డు సాధించాడు.న్యూజిలాండ్‌తో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో లబూషేన్ ఈ మార్కును చేరాడు. కివీస్‌తో రెండో ఇన్నింగ్స్‌కు ముందు లబూషేన్ 972 పరుగుల్ని ఈ ఏడాదే సాధించి తొలి స్థానంలో ఉండగా, మరో 28 పరుగుల్ని పూర్తి చేసుకుని సహస్ర ధీరుడుగా నిలిచాడు. దాంతో ఒక క్యాలెండర్ ఇయర్లో వెయ్యి టెస్టు పరుగులు పూర్తి చేసుకున్న ఆసీస్ క్రికెటర్ల జాబితాలో లబూషేన్ కూడా స్థానం సంపాదించాడు. 2014 నుంచి చూస్తే వెయి పరుగుల్ని ఒక క్యాలెండర్ ఇయర్లో వార్నర్ రెండు సార్లు సాధిస్తే, స్మిత్ నాలుగు సార్లు ఆ ఫీట్ సాధించాడు. వోగ్స్ ఒకసారి ఒక క్యాలెండర్ ఇయర్లో వెయ్యి పరుగులు సాధించిన మరో క్రికెటర్. ఇప్పుడు వారి సరసన లబూషేన్ కూడా చేరిపోయాడు. ఈ ఏడాది అత్యధిక టెస్టు పరుగులు సాధించిన జాబితాలో లబూషేన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆ తర్వాత స్థానంలో ఆసీస్‌కే చెందిన స్టీవ్ స్టిత్(857) ఉన్నాడు. -
భారీ హ్యాట్రిక్ శతకాలు.. డబుల్ సెంచరీ ఎప్పుడో?
పెర్త్: అంతర్జాతీయ క్రికెట్లో కాంకషన్ సబ్‌స్టిట్యూట్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత అలా ఆడిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందిన ఆసీస్ క్రికెటర్ లబూషేన్ ఇప్పుడు ఆ జట్టుకు వెన్నుముకగా మారిపోయాడు. లార్డ్స్ మైదానంలో యాషెస్ రెండో టెస్టులో స్టీవ్ స్మిత్ గాయపడటంతో లబూషేన్ కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్ సెంచరీతో మెరిసి ఆసీస్‌ను ఆదుకున్నాడు. దాంతో స్మిత్ జట్టులో ఉన్నప్పటికీ లబూషేన్ రెగ్యులర్ ఆటగాడు అయిపోయాడు. తనకు ఇచ్చిన వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు లబూషేన్. ఇటీవల పాకిస్తాన్‌తో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల్లో భారీ శతకాలు సాధించి ఆసీస్ ఇన్నింగ్స్ విజయాలు సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు. అదే జోరును కొనసాగిస్తూ న్యూజలాండ్తో పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లోనూ భారీ శతకం నమోదు చేశాడు. 240 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు, 1 సిక్స్‌తో 143 పరుగులు చేసి ఆసీస్ భారీ స్కోరు దిశగా సాగడానికి చక్కటి పునాది వేశాడు. 110 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు తన ఇన్నింగ్స్‌ను కొనసాగించిన లబూషేన్ మరో 33 పరుగులు జత చేసి పెవిలియన్ చేరాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా డబుల్ సెంచరీ చేస్తాడని భావించిన ఆసీస్ అభిమానులకు కాస్త నిరాశను మిగిలిచ్చాడు. పాకిస్తాన్ జరిగిన రెండు వరుస టెస్టుల్లో లబూషేన్ 162, 185 పరుగులు చేశాడు. దాంతో హ్యాట్రిక్ భారీ శతకాల్ని సునాయాసంగా చేస్తున్న లబూషేన్.. డబుల్ సెంచరీ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ 12 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన లబూషేన్ హ్యాట్రిక్ శతకాల్ని ఖాతాలో వేసుకోవడం విశేషం. ఓవరాల్‌గా తన టెస్టు కెరీర్లో రెండు సిక్సర్లు మాత్రమే సాధించడం అతని బ్యాటింగ్‌లో నిలకడకు అద్దం పడుతోంది. న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరిగేది మూడు టెస్టుల సిరీస్ కాబట్టి కచ్చితంగా లబూషేన్ ఖాతాలో డబుల్ సెంచరీ ఉంటుందని ఆశిస్తున్నారు. కివీస్‌తో తొలి టెస్టులో భాగంగా రెండో రోజు లంచ్ విరామానికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది.