Marnus Labuschagne Super Delivery Shocks Cameron Green: షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ అద్భుత బంతితో మెరిశాడు. స్వతహాగా బ్యాట్స్‌మన్ అయిన లబుషేన్‌లో ఇలాంటి వైవిధ్యమైన బౌలింగ్ ఉందా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. విషయంలోకి వెళితే.. షెఫీల్డ్ టోర్నీలో క్వీన్స్‌లాండ్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. కాగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 16వ ఓవర్‌ను లబుషేన్ వేశాడు. క్రీజులో ఉన్న కామెరాన్ గ్రీన్.. లబుషేన్ వేసిన ఓవర్ మూడో బంతి పక్కకు పోతుందని భావించాడు. అయితే బంతి అనూహ్యంగా ఇన్‌స్వింగ్ అయి వికెట్లను గిరాటేసింది. దీంతో గ్రీన్‌కు దెబ్బకు మైండ్‌బ్లాక్ అయింది. లబుషేన్ అద్బుత బౌలింగ్‌పై క్వీన్స్ లాండ్ కెప్టెన్ ఉస్మాన్ ఖవాజా స్పందించాడు.
చదవండి: T20 World Cup 2021: అదరగొడుతున్న ఆడం జంపా.. అయినా గానీ...
''లబుషేన్ బౌలింగ్‌లో వైవిధ్యత ఏంటనేది ఏడేళ్ల క్రితమే చూశా. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ సమయంలో లబుషేన్ నాకు బంతులు విసిరాడు. అతను వేసిన ప్రతీ బంతి వికెట్ల మీదకు వస్తుండడంతో ఆడడం కష్టమైంది. కానీ ఆ తర్వాత లబుషేన్ బ్యాటింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టడంతో బౌలింగ్‌ను లైట్ తీసుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు అతనికి బౌలింగ్ చేసే అవకాశం లభించింది. ఈరోజు మ్యాచ్‌లో అతను అద్భుతంగా బౌలింగ్ వేశాడు. ఇది ఇలాగే కొనసాగితే లబుషేన్ మంచి బౌలర్‌గాను చూడొచ్చు. రానున్న ఇంగ్లండ్ సిరీస్‌కు లబుషేన్‌ను సరిగ్గా వినియోగిస్తే మాత్రం ఆసీస్‌కు తిరుగుండదు. నా వరకు అతని ఆటతీరును ఎంజాయ్ చేశా.. ఎంజాయ్ చేస్తూనే ఉంటా అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే మ్యాచ్‌లో క్వీన్‌లాండ్స్ ఓటమి పాలవడం విశేషం. క్వీన్స్‌లాండ్ విధించిన 95 పరుగుల లక్ష్యాన్ని వెస్ట్రన్ ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇక మార్నస్ లబుషేన్ ఆస్ట్రేలియా తరపున 18 టెస్టుల్లో 1885 పరుగులు.. 13 వన్డేల్లో 473 పరుగులు చేశాడు.
చదవండి: T20 WC 2021: పాపం కివీస్.. టి20 ప్రపంచకప్ కొట్టినా నెంబర్‌వన్ కాకపోవచ్చు
Get the feeling Cameron Green is going to be hearing absolutely heaps from Marnus about this one all summer long #SheffieldShield pic.twitter.com/6BHAg7MVmF
— cricket.com.au (@cricketcomau) November 13, 2021
Comments
Please login to add a commentAdd a comment