యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆడిలైడ్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నెష్ లబూషేన్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. రెండో రోజు మ్యాచ్ అనంతరం విలేకరల సమావేశంలో మాట్లాడిన లబూషేన్ పలు విషయాలను వెల్లడించాడు. పింక్‌బాల్‌తో ఆడడం చాలా కష్టమని, అంత సులభంగా పరుగులు రాబట్టలేమని లబూషేన్ తెలిపాడు. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఆడడం చాలా భిన్నమైనదని, ఒక్కో పిచ్‌పై ఒక్కోలా పింక్ బాల్ ప్రవర్తిస్తుందని అతడు చెప్పాడు.
"పింక్ బాల్‌తో ఆడడం చాలా కష్టం. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్.. సాధరణ టెస్ట్ మ్యాచ్ కంటే భిన్నంగా ఉంటుంది. మేము గతంలో ఇదే వేదికలో పాకిస్తాన్‌తో ఆడాము. అప్పుడు వికెట్‌పై కొంచెం గ్రాస్ ఉండడంతో పిచ్ చదునుగా ఉండేది. దీంతో బంతి అంత బౌన్స్‌గా కాలేదు. కానీ ప్రస్తుతం పిచ్‌పై ఎక్కువగా గ్రాస్ ఉండడంతో బంతి ఎక్కువగా బౌన్స్ అవుతోంది.
దీంతో ఆడడం చాలా కష్టం అవుతోంది. రెండో రోజు ఆట ప్రారంభించినప్పుడు పరుగులు ఎలా సాధించాలో నాకు అర్ధం కాలేదు" అని లబూషేన్ పేర్కొన్నాడు. ఇక ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 473 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటరల్లో లబూషేన్(103), వార్నర్(95), స్మిత్(93) టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకే ఆలౌటైంది. ప్రస్తుతం మ్యాచ్ జరుగుతోంది.
చదవండి: IPL 2022: ‘‘అవును.. అతడిని తీసుకున్నాం’’.. కొత్త ఫ్రాంఛైజీ మెంటార్‌గా గౌతీ
Comments
Please login to add a commentAdd a comment