
యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో యాషెస్ సిరీస్‌ను 3–0తో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 68 పరుగులకే ఆలౌట్ చేసిన ఆసీస్.. ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో గెలిపొందింది. 31-4 పరుగలు వద్ద మూడో రోజు ఆట మొదలు పెట్టిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా బౌలర్లు ధాటికి 68 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోరూట్(28), బెన్ స్టోక్స్(11) పరుగులు చేసి టాప్ స్కోరర్‌లుగా నిలిచారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ 6 వికెట్లు, స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. ఆరంగ్రేట మ్యాచ్‌లోనే ఆసీస్ బౌలర్ స్కాట్ బోలాండ్ 7 వికెట్లు పడగొట్టి ఆద్బుతమైన ప్రదర్శన చేశాడు. కాగా కేవలం రెండున్నర రోజుల్లోనే ఆస్ట్రేలియా మ్యాచ్‌ను ముగించింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 185 పరుగులుకు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 267 పరుగులు సాధించింది. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా స్కాట్ బోలాండ్ ఎంపికయ్యాడు. ఇక ఇరు జట్లు మధ్య నాలుగో టెస్ట్ సిడ్నీ వేదికగా జనవవరి 5న ప్రారంభంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment