ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా నిన్న (జూన్ 28) మొదలైన యాషెస్ సిరీస్ రెండో టెస్ట్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. ఇందులో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ సాధించింది ప్రధానమైనది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 పరుగులతో అజేయంగా నిలిచిన స్మిత్.. అంతర్జాతీయ క్రికెట్‌లో 15000 పరుగుల మైలురాయిని దాటాడు. టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటివరకు 41 మంది మాత్రమే ఈ మైల్‌స్టోన్‌ను చేరుకున్నారు. వీరిలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (53.44) ఒక్కడే స్మిత్ (49.67) కంటే మెరుగైన యావరేజ్ కలిగి ఉన్నాడు. ఇదే మ్యాచ్‌లో స్మిత్ టెస్ట్‌ల్లో 9000 పరుగుల మార్కును కూడా అధిగమించాడు. 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్మిత్ ఈ ఫీట్‌ను సాధించాడు.
2000 పరుగులు, 20 వికెట్లు..
ఇక ఈ మ్యాచ్‌లో మరో రెండు సాధారణమైన రికార్డులు కూడా నమోదయ్యాయి. తొలి రోజు 2 వికెట్లు పడగొట్టిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్.. యాషెస్ సిరీస్‌లో 2000 పరుగులు, 20 వికెట్లు పడగొట్టిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అతనికి ముందు వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ (2172, 74), వాలీ హామ్మండ్ (2852, 36) ఈ ఘనత సాధించారు.
ఆరో ఇంగ్లండ్ వికెట్‌కీపర్..
తొలి రోజు ఆటలో ట్రవిస్ హెడ్‌ను స్టంపౌట్ చేయడం ద్వారా జానీ బెయిర్‌స్టో ఓ రికార్డు నెలకొల్పాడు. యాషెస్ సిరీస్‌లో 50 డిస్మిసల్స్ చేసిన ఆరో ఇంగ్లండ్ వికెట్‌కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బెయిర్‌స్టోకు (50) ముందు అలెన్ నాట్ (101), డిక్ లిల్లీ (84), అలెక్ స్టివర్ట్ (78), గార్‌ఫ్రే ఈవాన్స్ (76), మ్యాట్ ప్రయర్ (63) ఈ ఘనత సాధించారు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆటలో ఆసీస్ ఆధిపత్యం చలాయించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (66), ట్రవిస్ హెడ్ (77), స్టీవ్ స్మిత్ (85 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించగా.. లబూషేన్ (47) పర్వాలేదనిపించాడు. తొలి టెస్ట్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖ్వాజా (17), కెమారూన్ గ్రీన్ (0) నిరాశపరిచారు. స్మిత్‌తో పాటు అలెక్స్ క్యారీ (11) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, జో రూట్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఓలీ రాబిన్సన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment