Ashes Second Test
-
బెన్ స్టోక్స్ వీరోచిత పోరాటం.. ప్రత్యర్ధి సైతం దాసోహం..!
యాషెస్ సిరీస్ రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వీరోచిత పోరాటం చేశాడు. భారీ శతకంతో చెలరేగాడు. పట్టుసడలని పోరాటంతో ప్రత్యర్ధిని గడగడలాడించాడు. అదే ప్రత్యర్ధి చేతనే శభాష్ అనిపించుకున్నాడు. 2019లో హెడింగ్లీ మైదానంలో జరిగిన మ్యాచ్ తరహాలో ఒంటి చేత్తో జట్టును గెలిపించేలా కనిపించాడు. అయితే గెలుపుకు మరో 70 పరుగులు చేయాల్సిన తరుణంలో హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటై, నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఆతర్వాత ఇంగ్లండ్ 26 పరుగుల వ్యవధిలో మిగిలిన 3 వికెట్లు కోల్పోవడంతో ఓటమిపాలైంది. స్టోక్స్ వీరోచిత పోరాటానికి ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లండ్ కెప్టెన్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ వృధా అయ్యింది. ఏ స్థితిలోనైనా ‘బజ్‌బాల్’ను కొనసాగిస్తానంటూ పట్టుదలగా నిలిచి సిక్సర్లతో చెలరేగిన స్టోక్స్, చివరకు జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఫలితంగా ఆసీస్ లార్డ్స్‌లో గెలుపు జెండా ఎగరేసి 5 టెస్ట్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. లండన్: ఆ్రస్టేలియా జట్టు యాషెస్ సిరీస్‌పై తమ ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంది. లార్డ్స్ మైదానంలో ఆదివారం ముగిసిన రెండో టెస్టులో ఆసీస్ 43 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. 371 పరుగులను ఛేదించే ప్రయత్నంలో ఓవర్‌నైట్ స్కోరు 114/4తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) చెలరేగగా... బెన్ డకెట్ (112 బంతుల్లో 83; 9 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్ తలా 3 వికెట్లు పడగొట్టారు. గాయంతో ఉన్న స్పిన్నర్ లయన్ బౌలింగ్ చేయకుండానే ఆసీస్ ఈ విజయాన్ని అందుకోగలిగింది. స్టీవ్ స్మిత్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా, మూడో టెస్టు గురువారంనుంచి లీడ్స్‌లో జరుగుతుంది. విజయం కోసం చివరి రోజు చేతిలో 6 వికెట్లతో 257 పరుగులు సాధించాల్సిన స్థితిలో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. డకెట్, స్టోక్స్ భారీ భాగస్వామ్యంతో జట్టును ముందుకు నడిపించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 132 పరుగులు జోడించారు. డకెట్‌తో పాటు బెయిర్‌స్టో (10) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. విజయం కోసం మరో 178 పరుగులు చేయాల్సిన ఈ స్థితిలో స్టోక్స్ బాధ్యత తీసుకొని భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. గ్రీన్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన అతను...గ్రీన్ తర్వాతి ఓవర్లో ఒక ఫోర్ కొట్టి 82 పరుగులకు చేరుకున్నాడు. అదే ఓవర్లో వరుస బంతుల్లో 6, 6, 6 బాది అతను సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం. హాజల్‌వుడ్ ఓవర్లోనూ మరో 2 సిక్సర్లు బాదిన స్టోక్స్... స్టార్క్ ఓవర్లోనూ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి 150కు చేరుకున్నాడు. ఏడో వికెట్‌కు బ్రాడ్ (11)తో కలిసి స్టోక్స్ 20.2 ఓవర్లలోనే 108 పరుగులు జోడించాడు. ఆసీస్ మూడు క్యాచ్‌లు వదిలేయడం కూడా స్టోక్స్‌కు కలిసొచ్చింది. ఇంగ్లండ్ గెలుపు దిశగా వెళుతున్నట్లు అనిపించింది. అయితే హాజల్‌వుడ్ బౌలింగ్‌లో స్టోక్స్ మరో భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అంచనా తప్పడంతో ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేవగా బ్యాక్వర్డ్ పాయింట్ వరకు పరుగెత్తుతూ వెళ్లి కీపర్ క్యారీ అందుకోవడంతో అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత మిగిలిన 3 వికెట్లు తీసేందుకు ఆసీస్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. -
బెన్ స్టోక్స్ పోరాటం వృథా.. యాషెస్ రెండో టెస్టులో ఆసీస్ విజయం
లార్డ్స్ వేదికగా జరిగిన యాషెస్ రెండో టెస్టులో 43 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 అధిక్యంలోకి ఆసీస్ దూసుకెళ్లింది. 371 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 327 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(155) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. తన జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. 114/4 వద్ద ఐదో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లడ్ జట్టు అదనంగా మరో 213 పరుగులు చేసి ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో స్టోక్స్‌తో పాటు బెన్ డకెట్(83) రాణించాడు. ఇక ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్, హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ తలా 3 వికెట్లు సాధించగా.. గ్రీన్ ఒక్క వికెట్ పడగొట్టాడు. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకి ఆలౌట్ కాగా ఇంగ్లండ్ 325 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న ఆస్ట్రేలియా, రెండో ఇన్నింగ్స్‌లో 279 పరుగులకి ఆలౌట్ అయ్యింది. దీంతో ఇంగ్లండ్ ముందు 371 లక్ష్యాన్ని ఆసీస్ ఉంచింది. ఇక ఇరు జట్లు మధ్య మూడో టెస్టు జూలై 6 నుంచి లీడ్స్ వేదికగా జరగనుంది. చదవండి: Ashes 2023: నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం.. వాళ్లు ఛీటర్స్! ఆస్ట్రేలియాకు ఇది అలవాటే -
Ashes Series 2nd Test: టాప్-5లోకి చేరిన మిచెల్ స్టార్క్
స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా టాప్-5 బౌలర్ల జాబితాలో చేరాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టడం ద్వారా టెస్ట్‌ల్లో ఆసీస్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానానికి (79 టెస్ట్‌ల్లో 315 వికెట్లు) ఎగబాకాడు. ఈ క్రమంలో మాజీ స్పీడ్‌స్టర్ మిచెల్ జాన్సన్‌ను (73 టెస్ట్‌ల్లో 313 వికెట్లు) అధిగమించాడు. ఈ జాబితాలో దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ తొలి స్థానంలో (145 టెస్ట్‌ల్లో 708 వికెట్లు) ఉండగా.. గ్లెన్ మెక్‌గ్రాత్ (124 టెస్ట్‌ల్లో 563 వికెట్లు), నాథన్ లయోన్ (122 టెస్ట్‌ల్లో 496 వికెట్లు), డెన్నిస్ లిల్లీ (70 టెస్ట్‌ల్లో 355 వికెట్లు) వరుసగా 2,3,4 స్థానాల్లో నిలిచారు. ఇదిలా ఉంటే, ఆసీస్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. బెన్ డకెట్ (50), బెన్ స్టోక్స్ (29) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ గెలవాలంటే ఆఖరి రోజు 257 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆసీస్ గెలుపుకు 6 వికెట్లు అవసరమున్నాయి. స్కోర్ వివరాలు.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ (స్టీవ్ స్మిత్ 110, ట్రవిస్ హెడ్ 77, డేవిడ్ వార్నర్ 66; రాబిన్సన్ 3/100, టంగ్ 3/98) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 325 ఆలౌట్ (డకెట్ 98, బ్రూక్ 50; స్టార్క్ 3/88, హెడ్ 2/17) ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 279 ఆలౌట్ (ఖ్వాజా 77; బ్రాడ్ 4/65) ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్: 114/4 (డకెట్ 50 నాటౌట్; కమిన్స్ 2/20) (నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి) -
అరుదైన మైలురాయిని దాటిన స్టీవ్ స్మిత్.. ఇతని కంటే కోహ్లి ఒక్కడే బెటర్
ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా నిన్న (జూన్ 28) మొదలైన యాషెస్ సిరీస్ రెండో టెస్ట్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. ఇందులో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ సాధించింది ప్రధానమైనది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 పరుగులతో అజేయంగా నిలిచిన స్మిత్.. అంతర్జాతీయ క్రికెట్లో 15000 పరుగుల మైలురాయిని దాటాడు. టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు 41 మంది మాత్రమే ఈ మైల్‌స్టోన్‌ను చేరుకున్నారు. వీరిలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (53.44) ఒక్కడే స్మిత్ (49.67) కంటే మెరుగైన యావరేజ్ కలిగి ఉన్నాడు. ఇదే మ్యాచ్‌లో స్మిత్ టెస్ట్‌ల్లో 9000 పరుగుల మార్కును కూడా అధిగమించాడు. 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్మిత్ ఈ ఫీట్‌ను సాధించాడు. 2000 పరుగులు, 20 వికెట్లు.. ఇక ఈ మ్యాచ్‌లో మరో రెండు సాధారణమైన రికార్డులు కూడా నమోదయ్యాయి. తొలి రోజు 2 వికెట్లు పడగొట్టిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్.. యాషెస్ సిరీస్‌లో 2000 పరుగులు, 20 వికెట్లు పడగొట్టిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అతనికి ముందు వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ (2172, 74), వాలీ హామ్మండ్ (2852, 36) ఈ ఘనత సాధించారు. ఆరో ఇంగ్లండ్ వికెట్‌కీపర్.. తొలి రోజు ఆటలో ట్రవిస్ హెడ్‌ను స్టంపౌట్ చేయడం ద్వారా జానీ బెయిర్‌స్టో ఓ రికార్డు నెలకొల్పాడు. యాషెస్ సిరీస్‌లో 50 డిస్మిసల్స్ చేసిన ఆరో ఇంగ్లండ్ వికెట్‌కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బెయిర్‌స్టోకు (50) ముందు అలెన్ నాట్ (101), డిక్ లిల్లీ (84), అలెక్ స్టివర్ట్ (78), గార్ఫ్రే ఈవాన్స్ (76), మ్యాట్ ప్రయర్ (63) ఈ ఘనత సాధించారు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆటలో ఆసీస్ ఆధిపత్యం చలాయించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (66), ట్రవిస్ హెడ్ (77), స్టీవ్ స్మిత్ (85 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించగా.. లబూషేన్ (47) పర్వాలేదనిపించాడు. తొలి టెస్ట్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖ్వాజా (17), కెమారూన్ గ్రీన్ (0) నిరాశపరిచారు. స్మిత్‌తో పాటు అలెక్స్ క్యారీ (11) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, జో రూట్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఓలీ రాబిన్సన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
Ashes 2nd Test: తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. అనుకున్న విధంగానే ఓ మార్పు
ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఇవాల్టి నుంచి (జూన్ 28) ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. ముందుగా అనుకున్న విధంగానే మేనేజ్మెంట్ స్పిన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీని తప్పించింది. అతని స్థానంలో యువ పేసర్ జోష్ టంగ్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ ఒక్క మార్పు మినహాయించి తొలి టెస్ట్ ఆడిన జట్టునే ఇంగ్లీష్ మేనేజ్మెంట్ యధాతథంగా కొనసాగించింది. ఆసీస్.. తమ తుది జట్టును ప్రకటించాల్సి ఉంది. భారతకాలమానం ప్రకారం మ్యాచ్ 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా, మొయిన్ అలీ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన టంగ్.. ఇటీవలే టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. యాషెస్ సిరీస్‌కు ముందు ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్ ద్వారా టంగ్ టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టంగ్ 5 వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్ట్ ఓటమి నేపథ్యంలో ఇంగ్లండ్ పూర్తిగా పేస్ అటాక్‌తోనే బరిలోకి దిగనుంది. ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బజ్‌బాల్ అప్రోచ్ అంటూ బొక్కబోర్లా పడింది. స్వయంకృతాపరాధంగానే ఆ జట్టు ఓడింది. తొలి ఇన్నింగ్స్‌లో మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉన్నా ఆ జట్టు ఓవరాక్షన్ చేసి చేతులుకాల్చుకుంది. మరి ఈ మ్యాచ్‌లో అయిన ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడుతుందో లేక మరోసారి బజ్‌బాల్ అంటూ హడావుడి చేస్తుందో వేచి చూడాలి. England have announced their playing XI for the second men’s Ashes Test at Lord’s 🏏 More 👉 https://t.co/ctbQmFfLDt pic.twitter.com/zvlpdaLzYq — ICC (@ICC) June 28, 2023 -
చరిత్ర సృష్టించనున్న నాథన్ లయోన్.. తొలి బౌలర్‌గా అరుదైన ఘనత
యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో ఇవాళ (జూన్ 28) ప్రారంభంకానున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయోన్‌కు చిరకాలం గుర్తుండిపోతుంది. కేవలం ఈ మ్యాచ్‌లో ఆడటం ద్వారానే అతను చరిత్ర సృష్టించనున్నాడు. టెస్ట్ క్రికెట్లో వరుసగా 100 మ్యాచ్‌లు ఆడిన తొలి బౌలర్‌గా అరుదైన ఘనత సాధించనున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ ఇతర బౌలర్‌కు ఈ ఫీట్‌ను సాధించలేదు. ఓవరాల్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సర్ అలిస్టర్ కుక్ వరుసగా 159 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అతని తర్వాత ఆసీస్ ఆల్‌రౌండర్ అలెన్ బోర్డర్ (153), ఆసీస్ మార్క్ వా (107), ఇండియా సునీల్ గవాస్కర్ (106), కివీస్ బ్రెండన్ మెక్కల్లమ్ (101) ఉన్నారు. ఓవరాల్‌గా చూస్తే.. లయోన్ తన కెరీర్ మొత్తంలో 121 టెస్ట్‌లు ఆడాడు. ఇందులో 23 ఐదు వికెట్ల ఘనతలు, 4 పది వికెట్ల ఘనతల సాయంతో 495 వికెట్లు పడగొట్టాడు. తన కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయే లార్డ్స్ టెస్ట్‌లో లయోన్ మరో 5 వికెట్లు పడగొడితే.. 500 వికెట్ల మైలురాయిని కూడా చేరుకుంటాడు. ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బజ్‌బాల్ అప్రోచ్ అంటూ బొక్కబోర్లా పడింది. స్వయంకృతాపరాధంగానే ఆ జట్టు ఓడింది. తొలి ఇన్నింగ్స్‌లో మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉన్నా ఆ జట్టు ఓవరాక్షన్ చేసి చేతులు కాల్చుకుంది. మరి ఈ మ్యాచ్‌లో అయిన ఇంగ్లండ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడుతుందో లేక మరోసారి బజ్‌బాల్ అంటూ హడావుడి చేస్తుందో వేచి చూడాలి. -
ఇంతటి విషాదమా! పాపం.. పిల్లల ముద్దూముచ్చట్లు చూడకుండానే.. మళ్లీ..
Andrew Strauss Recalls Wif Words After Learning Devastating Cancer Diagnosis: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ వ్యక్తిగత జీవితంలో తీరని విషాదం దాగుంది. అతడి భార్య రూత్ లంగ్ క్యాన్సర్‌తో అర్ధంతరంగా తనువు చాలించింది. ఇద్దరు చిన్నారుల ఆలనాపాలనా, వారి ముద్దుముచ్చట్లు పూర్తిగా చూడకుండానే ఈ లోకాన్ని వీడింది. భార్య పేరిట ఫౌండేషన్ భార్య జ్ఞాపకాలను మర్చిపోలేని స్ట్రాస్.. ఆమె పేరిట రూత్ స్ట్రాస్ పేరిట ఫౌండేషన్ స్థాపించి క్యాన్సర్ బాధితులకు అండగా నిలుస్తున్నాడు. స్మోకింగ్‌కు వ్యతిరేకంగా ప్రచారం కల్పించడం, క్యాన్సర్ బాధితుల్లో అవగాహన పెంచడం సహా వ్యాధి తీవ్రతరమైన వారి కుటుంబాలకు ఎమోషనల్ సపోర్టునివ్వడంలో తోడ్పడటం ఈ ఫౌండేషన్ ధ్యేయం. కాగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నేపథ్యంలో జూన్ 29న మొదలు కానున్న రెండో టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా రూత్‌కు నివాళిగా రెడ్ ఫర్ రూత్ డే జరుపనున్నారు. ప్రేక్షకులు, వాలంటీర్లు తదితరులు ఎరుపు రంగు దుస్తులు ధరించి ట్రిబ్యూట్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్ బాధిత కుటుంబాలను ఆదుకునే నిమిత్తం నిధులు సేకరించనున్నారు. ఇంతటి విషాదమా! ‘‘నేను ఎప్పుడైతే ఆ చేదువార్త విన్నానో అప్పుడు నా హృదయం ముక్కలైంది. నా మానసిక వ్యథను మాటల్లో వర్ణించలేను. మా జీవితాల్లో కోలుకోలేని షాక్ అది. అసలు మాకే ఎందుకిలా జరిగింది? ఇదసలు నిజమేనా? అంటూ నా మనసు పరిపరివిధాలుగా ఆలోచించింది. కానీ రూత్ మాత్రం ఆది నుంచి ధైర్యంగానే ఉంది. నాకే ఎందుకిలా? అని తను బాధపడుతూ కూర్చోలేదు. ప్రతిరోజూ ఇలాగే ఎంతోమంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. వాళ్ల పరిస్థితి ఎలా ఉందో అని ఆలోచిస్తూ ఉండేది. మహమ్మారి బారిన పడ్డా తను అలా ఎలా ఉండగలిగిందో నాకైతే అర్థం కాలేదు. క్యాన్సర్ సోకిందన్న వార్త వినగానే తను కూల్‌గా స్పందించింది. టీ తాగుతారా? అని అడిగింది. చావుకు సిద్ధపడే నిజంగా.. దురదృష్టం తనను వెంటాడింది. చావుకు మానసికంగా సిద్ధమైనా.. పిల్లల విషయంలో మాత్రం చాలా బాధపడేది. వాళ్ల ఎదుగుదల చూడలేకపోతున్నానే అని వేదన చెందేది. జీవితంలో తను చాలా సాధించాలనుకుంది. కానీ అర్ధంతరంగా జీవితం ముగించాల్సి వస్తుందని తెలిసి.. ముందుగానే అందుకు సిద్ధమైంది. ఈ భూమ్మీద తనకు మిగిలిన రోజులను కుటుంబంతో సంతోషంగా గడపాలని నిశ్చయించుకుంది. తను మమ్మల్ని శాశ్వతంగా వీడి వెళ్లిపోవడానికి ముందే మాకేం కావాలో అన్నీ అమర్చి పెట్టింది’’ అంటూ ఆండ్రూ స్ట్రాస్ తమ జీవితంలో చోటు చేసుకున్న విషాదం గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ మేరకు టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన దివంగత భార్య రూత్ ఎంతో ధైర్యవంతురాలని, ఆమెను చాలా మిస్ అవుతున్నామని ఉద్వేగానికి గురయ్యాడు. కాగా 2017లో తనకు క్యాన్సర్ సోకిందన్న విషయం తెలుసుకున్న రూత్.. ఆ మరుసటి ఏడాది తుదిశ్వాస విడిచింది. ఇక 2003లో ఆండ్రూ- రూత్ పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు కుమారులు సామ్(2005), లుకా (2008) జన్మించారు. కాగా రూత్ చనిపోయిన తర్వాత ఆండ్రూ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. చదవండి: లేటు వయస్సులో రీ ఎంట్రీ ఇస్తానంటున్న ఆటగాడు.. ఏకంగా కోహ్లి స్ధానానికే! జింబాబ్వే చేతిలో ఓటమి ఎఫెక్ట్.. వైస్ కెప్టెన్‌నే తప్పించిన విండీస్ -
Ashes 2nd Test: రిచర్డ్సన్ పాంచ్ పటాకా.. ఇంగ్లండ్ ఘోర పరాజయం
Jhye Richardson Maiden Five Wicket Haul: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2021-22లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిధ్య ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆసీస్ పేసర్ జై రిచర్డ్సన్(5/42) కెరీర్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శనతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయిన రిచర్డ్సన్ రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయి బర్న్స్(34), హమీద్(0), బట్లర్(26), క్రిస్ వోక్స్(44), ఆండర్సన్(2) వికెట్లు సాధించాడు. ఫలితంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకే కుప్పకూలింది. 82/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్.. రిచర్డ్సన్, మిచెల్ స్కార్క్(2/43), నాథన్ లయన్(2/55), మైఖేల్ నెసర్(1/28) ధాటికి 192 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ(103), రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ(51) సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మార్నస్ లబుషేన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను 473/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేయగా, ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను 230/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసి 468 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచింది. ఛేదనలో ఇంగ్లండ్192 పరుగులకే కుప్పకూలి చిత్తుగా ఓడింది. చదవండి: పిచ్‌ను చూసి షాక్‌కు గురైన శ్రేయాస్.. ప్రాక్టీస్‌లో నిమగ్నం కావాలన్న ద్రవిడ్ -
రోజర్స్ బతికిపోయాడు..
లార్డ్స్: ఆస్ట్రేలియా ఓపెనర్ క్రిస్ రోజర్స్ అదృష్టం బాగుంది. ఇంగ్లండ్‌తో యాషెస్ రెండో టెస్టు రెండో రోజు ఆటలోని తొలి బంతికే తన మెడ వెనుక భాగంలో పేసర్ అండర్సన్ వేసిన బంతి గట్టిగా తగిలింది. ఈ బంతిని తప్పించుకునే క్రమంలో తల పక్కకి తిప్పుకున్నా హెల్మెట్ వెనుక కింది భాగంలో తగిలింది. అయితే సరికొత్త రీతిలో తయారైన ఈ హెల్మెట్ పూర్తి రక్షణాత్మకంగా ఉండడంతో దెబ్బ నుంచి తప్పించుకున్నాడు. సరిగ్గా ఇదే తరహాలో బంతి తగిలి ఆసీస్ ఆటగాడు ఫిల్ హ్యూస్ మైదానంలో ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. -
కంగారూల చేతిలో కుక్ సేన కుదేలు
అడిలైడ్: యాషెస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లండ్ ఘోర పరాజయం పాలయింది. 218 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 531 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి కుక్‌సేన రెండో ఇన్నింగ్స్‌లో 101.4 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటయింది. రూట్(87), ప్రయర్(69), పీటర్సన్(53) అర్థ సెంచరీలు చేసినా మిగతా ఆటగాళ్లు విఫలమవడంతో ఇంగ్లండ్ ఓటమిపాలయింది. ఆసీస్ బౌలర్లలో సిడిల్ 4, హరీస్ 3 వికెట్లు పడగొట్టారు. జాన్సన్, లియన్, స్మిత్ తలో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స్కోరు 570/9 డిక్లేర్డ్ కాగా, ఇంగ్లండ్ 172 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టు132/3 వద్దనే రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మొత్తం 8 వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్ జాన్సన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. తొలి టెస్టులోనూ ఆస్ట్రేలియా గెల్చిన సంగతి తెలిసింది. తాజా విషయంలో ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో ఆసీస్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. -
క్లార్క్, హాడిన్ సెంచరీలు
అడిలైడ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. కెప్టెన్ క్లార్క్ (245 బంతుల్లో 148; 17 ఫోర్లు), హాడిన్ (177 బంతుల్లో 118; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగడంతో శుక్రవారం రెండో రోజు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ను 158 ఓవర్లలో 9 వికెట్లకు 570 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. హారిస్ (55 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 21 ఓవర్లలో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. కార్‌బెరీ (20 బ్యాటింగ్), రూట్ (9) క్రీజులో ఉన్నారు. కుక్ (3)ను జాన్సన్ దెబ్బతీశాడు. అంతకుముందు 273/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన క్లార్క్, హాడిన్‌లు నిలకడగా ఆడారు. ఇంగ్లండ్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించారు. క్లార్క్ భారీ షాట్లు ఆడకపోయినా.. హాడిన్ మాత్రం స్పిన్నర్ల బౌలింగ్‌లో సిక్సర్ల మోత మోగించాడు. 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షార్ట్ లెగ్‌లో బెల్ క్యాచ్ మిస్ చేయడంతో ఊపిరి పీల్చుకున్న క్లార్క్... క్రమంగా కెరీర్లో 26వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు స్టోక్ బౌలింగ్‌లో అండర్సన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఆరో వికెట్‌కు నెలకొన్న 200 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత జాన్సన్ (5), సిడిల్ (2) వెంటవెంటనే అవుటైనా... హారిస్ సమయోచితంగా ఆడాడు. హాడిన్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 46 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో హాడిన్ 4వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత వచ్చిన లియోన్ (17 నాటౌట్) నెమ్మదిగా ఆడుతూ పదో వికెట్‌కు హారిస్‌తో కలిసి అజేయంగా 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. బ్రాడ్ 3, స్వాన్, స్టోక్స్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ ఇన్నింగ్స్‌లో కొట్టిన 12 సిక్సర్లు యాషెస్‌లో ఆసీస్ తరఫున రికార్డు. 2005 ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌పై 10 సిక్సర్లు కొట్టారు. మండేలాకు నివాళి: శుక్రవారం తెల్లవారుజామున మరణించిన దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు ఇరుజట్లు నివాళులు అర్పించాయి. మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు నిమిషం పాటు మౌనం పాటించి నల్ల బ్యాండ్లను ధరించి బరిలోకి దిగారు. -
ఆస్ట్రేలియా 273/5
అడిలైడ్: బ్యాట్స్‌మెన్ బాధ్యతా యుతంగా ఆడటంతో ఇంగ్లండ్ తో గురువారం మొదలైన యాషెస్ సిరీస్ రెండో టెస్టు తొలి రోజు ఆస్ట్రేలియా గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 91 ఓవర్లలో 5 వికెట్లకు 273 పరుగులు చేసింది. క్లార్క్ (48 బ్యాటింగ్), హాడిన్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు రోజర్స్ (167 బంతుల్లో 11 ఫోర్లతో 72), వాట్సన్ (119 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 51) నిలకడగా ఆడి రెండో వికెట్‌కు 121 పరుగులు జోడించారు. చివరి సెషన్లో బెయిలీ (93 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53) దూకుడుగా ఆడాడు. 10 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను పనేసర్ వదిలేయడంతో బయటపడిన బెయిలీ ఆ తర్వాత బ్యాట్ ఝుళిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్ 2, అండర్సన్, స్వాన్, పనేసర్ తలా ఓ వికెట్ తీశారు.