యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో ఇవాళ (జూన్ 28) ప్రారంభంకానున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయోన్‌కు చిరకాలం గుర్తుండిపోతుంది. కేవలం ఈ మ్యాచ్‌లో ఆడటం ద్వారానే అతను చరిత్ర సృష్టించనున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో వరుసగా 100 మ్యాచ్‌లు ఆడిన తొలి బౌలర్‌గా అరుదైన ఘనత సాధించనున్నాడు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ ఇతర బౌలర్‌కు ఈ ఫీట్‌ను సాధించలేదు. ఓవరాల్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సర్ అలిస్టర్ కుక్ వరుసగా 159 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అతని తర్వాత ఆసీస్ ఆల్‌రౌండర్ అలెన్ బోర్డర్ (153), ఆసీస్ మార్క్ వా (107), ఇండియా సునీల్ గవాస్కర్ (106), కివీస్ బ్రెండన్ మెక్‌కల్లమ్ (101) ఉన్నారు.
ఓవరాల్‌గా చూస్తే.. లయోన్ తన కెరీర్ మొత్తంలో 121 టెస్ట్‌లు ఆడాడు. ఇందులో 23 ఐదు వికెట్ల ఘనతలు, 4 పది వికెట్ల ఘనతల సాయంతో 495 వికెట్లు పడగొట్టాడు. తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయే లార్డ్స్ టెస్ట్‌లో లయోన్ మరో 5 వికెట్లు పడగొడితే.. 500 వికెట్ల మైలురాయిని కూడా చేరుకుంటాడు.
ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బజ్‌బాల్ అప్రోచ్ అంటూ బొక్కబోర్లా పడింది. స్వయంకృతాపరాధంగానే ఆ జట్టు ఓడింది. తొలి ఇన్నింగ్స్‌లో మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉన్నా ఆ జట్టు ఓవరాక్షన్ చేసి చేతులు కాల్చుకుంది. మరి ఈ మ్యాచ్‌లో అయిన ఇంగ్లండ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడుతుందో లేక మరోసారి బజ్‌బాల్ అంటూ హడావుడి చేస్తుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment