యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆటలో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయోన్ గాయపడ్డ విషయం తెలిసిందే. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో అతను డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు. అయితే నాలుగో రోజు ఆటలో ఆసీస్‌కు లయోన్ అవసరం పడటంతో అతను ఏమాత్రం సంకోచించకుండా ప్యాడ్లు కట్టుకుని బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగి అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. లయోన్ కమిట్‌మెంట్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
👏 @NathLyon421.#LoveLords | #Ashes pic.twitter.com/yx5l8w2Vu1
— Lord's Cricket Ground (@HomeOfCricket) July 1, 2023
అతను నొప్పిని భరిస్తూ కుంటుతూ మైదానంలోకి వస్తుంటే, స్టేడియంలో ఉన్న ప్రేక్షకులంతా లేచి నిలబడి చప్పట్లతో ప్రశంసించారు. లయోన్ ఔటై పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలోనూ ప్రేక్షకులు చప్పట్లతో స్టేడియాన్ని మార్మోగించారు. ఆట పట్ల లయోన్‌కు ఉన్న డెడికేషన్, తాను చేయగలిగే కొన్ని పరుగులైన జట్టుకు ఉపయోగపడతాయన్న అతని కమిట్‌మెంట్‌కు నెటిజన్లు నీరాజనాలు పలుకుతున్నారు. లయోన్ కుంటుతూ మైదానంలోకి వస్తున్న వీడియో నెట్టింట వైరలవుతుంది.
Here he comes! #Ashes pic.twitter.com/2t954CNI7g
— cricket.com.au (@cricketcomau) July 1, 2023
కాగా, ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 11వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన లయోన్.. బౌండరీ సాయంతో 4 పరుగులు చేసి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం ఆసీస్ నిర్ధేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసి విజయానికి 257 పరుగుల దూరంలో ఉంది. అదే ఆసీస్ గెలవాలంటే 6 వికెట్లు అవసరం. క్రీజ్‌లో డకెట్ (50), స్టోక్స్ (29) ఉన్నారు.
స్కోర్ వివరాలు..
ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ (స్టీవ్ స్మిత్ 110, ట్రవిస్ హెడ్ 77, డేవిడ్ వార్నర్ 66; రాబిన్సన్ 3/100, టంగ్ 3/98)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 325 ఆలౌట్ (డకెట్ 98, బ్రూక్ 50; స్టార్క్ 3/88, హెడ్ 2/17)
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 279 ఆలౌట్ (ఖ్వాజా 77; బ్రాడ్ 4/65)
ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్: 114/4 (డకెట్ 50 నాటౌట్; కమిన్స్ 2/20) (నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి)
Comments
Please login to add a commentAdd a comment