స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా టాప్-5 బౌలర్ల జాబితాలో చేరాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టడం ద్వారా టెస్ట్‌ల్లో ఆసీస్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానానికి (79 టెస్ట్‌ల్లో 315 వికెట్లు) ఎగబాకాడు. ఈ క్రమంలో మాజీ స్పీడ్‌స్టర్ మిచెల్ జాన్సన్‌ను (73 టెస్ట్‌ల్లో 313 వికెట్లు) అధిగమించాడు.
ఈ జాబితాలో దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ తొలి స్థానంలో (145 టెస్ట్‌ల్లో 708 వికెట్లు) ఉండగా.. గ్లెన్ మెక్‌గ్రాత్ (124 టెస్ట్‌ల్లో 563 వికెట్లు), నాథన్ లయోన్ (122 టెస్ట్‌ల్లో 496 వికెట్లు), డెన్నిస్ లిల్లీ (70 టెస్ట్‌ల్లో 355 వికెట్లు) వరుసగా 2,3,4 స్థానాల్లో నిలిచారు.
ఇదిలా ఉంటే, ఆసీస్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. బెన్ డకెట్ (50), బెన్ స్టోక్స్ (29) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ గెలవాలంటే ఆఖరి రోజు 257 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆసీస్ గెలుపుకు 6 వికెట్లు అవసరమున్నాయి.
స్కోర్ వివరాలు..
ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ (స్టీవ్ స్మిత్ 110, ట్రవిస్ హెడ్ 77, డేవిడ్ వార్నర్ 66; రాబిన్సన్ 3/100, టంగ్ 3/98)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 325 ఆలౌట్ (డకెట్ 98, బ్రూక్ 50; స్టార్క్ 3/88, హెడ్ 2/17)
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 279 ఆలౌట్ (ఖ్వాజా 77; బ్రాడ్ 4/65)
ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్: 114/4 (డకెట్ 50 నాటౌట్; కమిన్స్ 2/20) (నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి)
Comments
Please login to add a commentAdd a comment