Mitchell Johnson
-
వాళ్లు కూడా స్లెడ్జ్ చేశారు.. ఈసారి గనుక ఛాన్స్ ఇస్తే: ఆసీస్ మాజీ క్రికెటర్ వార్నింగ్
ప్యాట్ కమిన్స్ బృందంపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ విమర్శల వర్షం కురిపించాడు. పెర్త్ టెస్టులో టీమిండియా యువ ఆటగాళ్ల చేతిలోనూ మానసికంగా ఓడిపోయారంటూ ఎద్దేవా చేశాడు. జట్టులో ఏ ఒక్కరిలోనూ పోరాటపటిమ కనబడలేదని.. ఇకనైనా కాస్త ఆటపై దృష్టి పెట్టి విజయాల బాటపట్టాలని సూచించాడు. భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.యాషెస్ సిరీస్ మాదిరేఇంగ్లండ్తో యాషెస్ సిరీస్ మాదిరే కంగారూ జట్టుకు ఈ సిరీస్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైంది. ఇక టీమిండియాతో టెస్టు అంటే కేవలం ఆటకే పరిమితం కాకుండా ప్లేయర్లు స్లెడ్జింగ్ చేయడంలోనూ ముందే ఉంటారు. అందుకు తగ్గట్లుగా భారత ఆటగాళ్లూ బదులిచ్చిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి.స్లోగా బౌల్ చేస్తున్నాడుఇదిలా ఉంటే.. పెర్త్ టెస్టులోనూ ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకున్నా.. వాటి తీవ్రత మాత్రం తక్కువగానే ఉంది. అయితే, ఈ టీజింగ్ మూమెంట్లలో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను ఉద్దేశించి చాలా స్లోగా బౌల్ చేస్తున్నాడంటూ వ్యాఖ్యానించడం హైలైట్‌గా నిలిచింది.295 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిమరోవైపు.. స్టార్క్.. భారత అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణాను ఉద్దేశించి.. ‘‘నీకంటే నేనే ఫాస్ట్‌గా బౌల్ చేస్తాను’’ అని వ్యాఖ్యానించాడు. అయితే, రాణా చిరునవ్వుతోనే స్టార్క్‌కు బదులిచ్చాడు. అయితే, అతడిని అవుట్ చేసి తన సత్తా చాటడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఆసీస్ 295 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే.ఆప్టస్ స్టేడియంలో మీరేం చేశారు?ఈ నేపథ్యంలో మిచెల్ జాన్సన్ స్పందిస్తూ.. ‘‘బయటి నుంచి ప్రేక్షకుడిగా మ్యాచ్ చూస్తున్న నాకు.. ఆస్ట్రేలియా జట్టు నుంచి ఏమాత్రం పోరాటపటిమ కనిపించలేదు. ముఖ్యంగా ఓ అరంగేట్ర ఆటగాడు.. యువ ఓపెనర్.. మన సొంతగడ్డ మీద.. మిచెల్ స్టార్క్‌ను స్లెడ్జ్ చేస్తూ.. స్లోగా బౌలింగ్ చేస్తున్నావనడం.. అయినా మనలో చలనం లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది.బ్యాట్‌తోనూ.. బాల్‌తోనూ మనం సమాధానం ఇవ్వలేకపోయాం. అసలు ఆప్టస్ స్టేడియంలో మీరేం చేశారు?’’ అని ది వెస్టర్న్ ఆస్ట్రేలియన్‌కు రాసిన కాలమ్‌లో ఆసీస్ జట్టును విమర్శించాడు. ఇక టీమిండియాకు భయపడితే పనులు జరగవని.. అడిలైడ్‌లో మాత్రం తప్పక విజృంభించాలని కమిన్స్ బృందానికి మిచెల్ జాన్సన్ సూచించాడు.ఈసారి గనుక ఛాన్స్ ఇస్తేలేనిపక్షంలో వాళ్లను ఎదుర్కోవడం మరింత కష్టమవుతుందని టీమిండియా గురించి ఆసీస్‌కు మిచెల్ జాన్సన్ వార్నింగ్ ఇచ్చాడు. కాగా ఇరుజట్ల మధ్య డిసెంబరు 6- 10 వరకు రెండో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. పింక్ బాల్‌తో జరిగే ఈ టెస్టులోనూ గెలుపొందాలని పట్టుదలగా ఉన్న టీమిండియా.. అందుకు తగ్గట్లుగా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో గులాబీ బంతితో సాధన చేసింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో పీఎం ఎలెవన్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది.ఇక తొలి టెస్టుకు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, గాయం నుంచి కోలుకున్న శుబ్‌మన్ గిల్ రెండో టెస్టు కోసం భారత జట్టుతో చేరారు. మరోవైపు.. జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ మార్ష్ గాయాల రూపంలో ఆసీస్‌కు షాక్ తగిలింది. కాగా ఆసీస్- భారత్ మధ్య మొత్తం ఐదు టెస్టులు జరుగనున్నాయి.చదవండి: వెళ్లు వెళ్లు.. వెనక్కి వెళ్లు: రాకాసి బౌన్సర్ వేసిన ఆసీస్ బౌలర్.. ఇచ్చిపడేసిన జైస్వాల్! -
భారత్‌తో రెండో టెస్టు.. అతడిపై వేటు వేయండి: ఆసీస్ మాజీ క్రికెటర్
టీమిండియాతో రెండో టెస్టు నేపథ్యంలో ఆస్ట్రేలియా తుదిజట్టు గురించి మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పింక్ బాల్ మ్యాచ్‌లో మార్నస్ లబుషేన్‌ను ఆడించవద్దని క్రికెట్ ఆస్ట్రేలియాకు విజ్ఞప్తి చేశాడు. అతడిని జట్టు నుంచి తప్పించాల్సిన సమయం వచ్చిందంటూ ఘాటు విమర్శలు చేశాడు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆసీస్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. సమిష్టి కృషితో ఆసీస్‌ను సొంతగడ్డపై చిత్తు చేసింది.రెండుసార్లూ విఫలంఇక ఈ మ్యాచ్‌లో మార్నస్ లబుషేన్ పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 52 బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులే చేశాడు. భారత పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు.ఇక రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన లబుషేన్ ఐదు బంతుల్లో మూడు పరుగులకే వెనుదిరిగాడు. ఈసారి మరో పేసర్ జస్ప్రీత్ బుమ్రా అతడికి వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఎనిమిది సింగిల్ డిజిట్ స్కోర్లుఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడిన లబుషేన్ 245 పరుగులే చేశాడు. ఇందులో మూడు అర్ధ శతకాలు ఉండగా.. ఎనిమిది సింగిల్ డిజిట్ స్కోర్లు ఉన్నాయి.ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ స్పందిస్తూ.. ‘‘బ్యాటింగ్‌లో వరుస వైఫల్యాలతో డీలా పడిన మార్నస్ లబుషేన్‌ను కచ్చితంగా జట్టు నుంచి తప్పించాల్సిందే. అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టులో అతడి స్థానంలో వేరొకరిని ఆడించాలి. అతడిపై వేటు వేయండిలేదంటే.. పెర్త్ టెస్టు మాదిరి ఇక్కడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అతడు షెఫీల్డ్ షీల్డ్, క్లబ్ క్రికెట్లో తిరిగి ఆడాల్సిన సమయం వచ్చింది. జాతీయ జట్టుకు ఆడినపుడు ఉండేంత ఒత్తిడి అక్కడ ఉండదు. కాస్త స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది. అది అతడికే ప్రయోజనకరంగా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. ది నైట్లీకి రాసిన కాలమ్‌లో మిచెల్ జాన్సన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డిసెంబరు 6 నుంచి అడిలైడ్‌లో రెండో టెస్టు(పింక్ బాల్) మొదలుకానుంది.చదవండి: మొదలుకాకుండానే ముగిసిపోయింది.. టీమిండియా ‘పింక్ బాల్’ టెస్టు సన్నాహకాలపై నీళ్లు! -
అతడి దెబ్బకు కన్ను వాచింది.. అలా ప్రతీకారం తీర్చుకున్నా: కోహ్లి
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లికి టెస్టుల్లో ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉంది. ఆసీస్ పోరంటే ఈ రన్‌మెషీన్ మరింత జోరుగా బ్యాట్ ఝులిపిస్తాడు. ఇక 2014- 15లో తొలిసారిగా కంగారూ గడ్డ మీద భారత కెప్టెన్ హోదాలో ఆడిన కింగ్ కోహ్లి.. 692 పరుగులతో అదరగొట్టాడు. ఆ సిరీస్‌లో టీమిండియా బ్యాటర్లలో టాప్ స్కోరర్‌గా నిలిచి సత్తా చాటాడు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో వరుస సెంచరీలతో అదరగొట్టిన కోహ్లి.. తదుపరి బ్రిస్బేన్‌లో మాత్రం విఫలమయ్యాడు. అనంతరం మెల్బోర్న్, సిడ్నీ టెస్టుల్లో మళ్లీ కమ్‌బ్యాక్ ఇచ్చి తానేంటో నిరూపించుకున్నాడు. అయితే, ఆ సిరీస్‌లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. తొలి రెండింటిలో గెలిచిన ఆస్ట్రేలియా.. ఆఖరి రెండు టెస్టులను డ్రా చేసుకుని ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇక ఈ సిరీస్ సందర్భంగా జరిగిన ఆసక్తికర ఘటన గురించి ప్రస్తావిస్తూ విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆనాటి సంగతులు గుర్తు చేసుకుంటూ.. ‘‘ఆ టూర్లో మొదటి మ్యాచ్‌లో తమ మొదటి బంతినే మిచెల్ జాన్సెన్ విసురుగా విసరడంతో.. నా తలకు దెబ్బ తగిలింది. అసలేం జరిగిందో కాసేపటి వరకు నాకేం అర్థం కాలేదు. దాదాపు 60 రోజుల పాటు.. అలా ఆడాలా.. ఇలా ఆడాలా అంటూ షాట్ల విషయంలో తికమకపడ్డా. దెబ్బ అంత గట్టిగా తగిలింది మరి! నా ఎడమ కన్ను వాపు వచ్చేది. కంటిచూపు కూడా కాస్త మందగించింది. అయితే, చాలా రోజుల వరకు నేను ఈ విషయాన్ని గమనించలేకపోయాను. ఇక ఆరోజు లంచ్ సమయంలో.. నా ముందు రెండే ఆప్షన్లు మిగిలి ఉన్నాయని ఫిక్సయ్యాను. ఒకటి ఫైట్.. రెండోది ఫ్లైట్. పట్టుదలగా నిలబడి ఆడాలి లేదంటే వెళ్లిపోవాలి.. బాగా ఆలోచించి పోరాడాలనే నిర్ణయించుకున్నా. ఇంతలో ఒకరు.. నిన్ను తల మీద కొట్టడానికి అతడికి ఎంత ధైర్యం అని నాతో అన్నారు. అందుకు బదులుగా..‘అతడి(బౌలింగ్)ని ఈ సిరీస్‌లో ఎంతలా చితక్కొడతానో చూడు’ అని చెప్పాను. అన్నట్లుగా అతడి బౌలింగ్‌ను తుత్తునియలు చేశాను’’ అని కోహ్లి పేర్కొన్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా 2014 -15లో ఆసీస్‌తో సిరీస్‌లో తొలి టెస్టుకు నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దూరం కాగా.. కోహ్లి సారథ్యం వహించాడు. ఇక రెండు, మూడో టెస్టులకు అందుబాటులోకి వచ్చిన ధోని.. ఆ తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటించగా.. నాలుగో మ్యాచ్ నుంచి కోహ్లి అధికారికంగా టీమిండియా కెప్టెన్ అయ్యాడు. ప్రస్తుతం ఈ దిగ్గజాలు ఇద్దరూ ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నారు. “Isko mein itna maarunga naa, and that’s exactly what I did” Kohli saab talking about the 2014 Australia tour and his battle against Mitchell Johnson 👑💪🏻 pic.twitter.com/geP35IUz08 — Aani⁷ ★彡 (@wigglyywhoops) April 11, 2024 చదవండి: అంపైర్‌తో గొడవపడ్డ పంత్.. తప్పెవరిది?.. మండిపడ్డ ఆసీస్ దిగ్గజం -
వార్నర్ ఏమి హీరో కాదు.. ఘన వీడ్కోలు ఎందుకు?
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరగనున్న టెస్టు సిరీస్ అనంతరం టెస్టు క్రికెట్‌కు ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ఇదివరకే తన నిర్ణయాన్ని వార్నర్ వెల్లడించాడు. పెర్త్ వేదికగా తొలి టెస్టుకు తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో వార్నర్‌కు చోటు దక్కింది. ఈ క్రమంలో వార్నర్ ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఘనంగా విడ్కోలు పలకడానికి వార్నర్ అర్హడు కాదని జాన్సన్ అభిప్రాయపడ్డాడు. కాగా 2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా బాల్ టాంపరింగ్ వివాదంలో డేవిడ్ వార్నర్ చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతడిపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించింది. ఇదే విషయాన్ని మరోసారి టార్గెట్ చేస్తూ వార్నర్‌పై జాన్సన్ విమర్శలు గుప్పించాడు. "డేవిడ్ వార్నర్‌కు వీడ్కోలు పలికేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సిద్దమవుతోంది. టెస్టు క్రికెట్లో ఓపెనర్‌గా దారుణంగా విఫలమవుతున్న అతడికి తన రిటైర్మెంట్ తేదీని తనే నామినేట్ చేసే అవకాశమెందుకు ఇచ్చారు..? ఆస్ట్రేలియన్ క్రికెట్ చరిత్రలో అతిపెద్ద కుంభకోణంలో నిలిచిన ఒక ఆటగాడిని హీరోగా విడ్కోలు పలకడానికి ఎందుకు సిద్దమవుతున్నారు అంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై జాన్సన్ ప్రశ్నల వర్షం కురిపించాడు. తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియాన్, మిచ్ మార్ష్, లాన్స్ మోరిస్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్ చదవండి: పాకిస్తాన్ క్రికెట్లో మరో కీలక పరిణామం.. సల్మాన్ భట్‌పై వేటు -
Ashes Series 2nd Test: టాప్-5లోకి చేరిన మిచెల్ స్టార్క్
స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా టాప్-5 బౌలర్ల జాబితాలో చేరాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టడం ద్వారా టెస్ట్‌ల్లో ఆసీస్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానానికి (79 టెస్ట్‌ల్లో 315 వికెట్లు) ఎగబాకాడు. ఈ క్రమంలో మాజీ స్పీడ్‌స్టర్ మిచెల్ జాన్సన్‌ను (73 టెస్ట్‌ల్లో 313 వికెట్లు) అధిగమించాడు. ఈ జాబితాలో దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ తొలి స్థానంలో (145 టెస్ట్‌ల్లో 708 వికెట్లు) ఉండగా.. గ్లెన్ మెక్‌గ్రాత్ (124 టెస్ట్‌ల్లో 563 వికెట్లు), నాథన్ లయోన్ (122 టెస్ట్‌ల్లో 496 వికెట్లు), డెన్నిస్ లిల్లీ (70 టెస్ట్‌ల్లో 355 వికెట్లు) వరుసగా 2,3,4 స్థానాల్లో నిలిచారు. ఇదిలా ఉంటే, ఆసీస్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. బెన్ డకెట్ (50), బెన్ స్టోక్స్ (29) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ గెలవాలంటే ఆఖరి రోజు 257 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆసీస్ గెలుపుకు 6 వికెట్లు అవసరమున్నాయి. స్కోర్ వివరాలు.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ (స్టీవ్ స్మిత్ 110, ట్రవిస్ హెడ్ 77, డేవిడ్ వార్నర్ 66; రాబిన్సన్ 3/100, టంగ్ 3/98) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 325 ఆలౌట్ (డకెట్ 98, బ్రూక్ 50; స్టార్క్ 3/88, హెడ్ 2/17) ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 279 ఆలౌట్ (ఖ్వాజా 77; బ్రాడ్ 4/65) ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్: 114/4 (డకెట్ 50 నాటౌట్; కమిన్స్ 2/20) (నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి) -
మహిళా అంపైర్‌తో దురుసు ప్రవర్తన.. అందుకే గొడవ
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఆదివారం బిల్వారా కింగ్స్, ఇండియా క్యాపిటల్స్ మధ్య మ్యాచ్‌లో యూసఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్‌ల గొడవ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మైదానంలోనే గొడవకు దిగిన ఈ ఇద్దరు దాదాపు కొట్టుకున్నంత పని చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మ్యాచ్ అనంతరం యూసఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్‌లు ఒకరినొకరు క్షమాపణ చెప్పుకున్నారు. అయితే గొడవకు ప్రధాన కారణం యూసఫ్ పఠాన్ మహిళా అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించడమేనని ఫాక్స్ క్రికెట్ ఆస్ట్రేలియా తమ ట్విటర్లో పేర్కొంది. బిల్వారా కింగ్స్, ఇండియా క్యాపిటల్స్ మ్యాచ్‌కు కిమ్ కాటన్ అంపైరింగ్ విధులు నిర్వహించింది. కాగా మ్యాచ్ సందర్భంగా మిచెల్ జాన్సన్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఒక బంతిని కిమ్ కాటన్ వైడ్ కాల్ ఇవ్వలేదు. దీంతో కాటన్‌ను ఉద్దేశించి యూసఫ్ పఠాన్ అభ్యంతకర వ్యాఖ్యలు చేసినట్లు ఫాక్స్ క్రికెట్ వెల్లడించింది. ఇదే విషయమై ఓవర్ తర్వాత ఇద్దరి మధ్య గొడవకు దారి తీసిందని పేర్కొంది. ''మిచెల్‌ది ఏం తప్పు లేదు.. పఠాన్ మహిళా అంపైర్ కిమ్ కాటన్‌తో దురుసుగా ప్రవర్తించాడు.. అందుకే గొడవ జరిగింది'' అంటూ తెలిపింది. యూసఫ్‌ను తోసేసిన కారణంగా మిచెల్ జాన్సన్‌కు క్రమశిక్షణ చర్యల కింద లెజెండ్స్ లీగ్ క్రికెట్ కమిషనర్ రవిశాస్త్రి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించాడు. ఇక యూసఫ్ పఠాన్ మాత్రం జరిమానా నుంచి తప్పించుకున్నాడు. ఇదే విషయాన్ని లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీఈవో రామన్ రహేజా స్పందించాడు. ''లెజెండ్స్ లీగ్ ద్వారా ఒక సీరియస్, కాంపిటీటివ్ క్రికెట్‌ను మాత్రమే ప్రోత్సహించాలనుకుంటున్నాం. ఆదివారం మ్యాచ్ సందర్భంగా జరిగిన గొడవ బాధాకరం. అయితే గొడవకు సంబంధించి ఎవరిది తప్పు ఉందో తెలుసుకోవడానికి వీడియోను చాలాసార్లు పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చాం. తప్పెవరిదనేది పక్కనబెడితే మిచెల్ జాన్సన్.. పఠాన్‌ను తోసేసినట్లు క్లియర్‌గా కనిపించడంతో అతనికి జరిమానా విధించాం. ఇలాంటివి మళ్లీ జరగకూడదని ఆశిస్తున్నాం. మళ్లీ రిపీట్ అయితే ఉపేక్షించేది లేదు. సీరియస్ యాక్షన్ కచ్చితంగా ఉంటుంది'' అని పేర్కొన్నాడు. #ICYMI: Things got really heated in @llct20 between Yusuf Pathan and Mitchell Johnson. 🔥 pic.twitter.com/4EnwxlOg5P — Nikhil 🏏 (@CricCrazyNIKS) October 2, 2022 చదవండి: యూసఫ్ పఠాన్,మిచెల్ జాన్సన్‌ల గొడవ.. అంపైర్ తలదూర్చినా! -
యూసఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్‌ల గొడవ.. అంపైర్ తలదూర్చినా!
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా ఆదివారం బిల్వారా కింగ్స్, ఇండియా క్యాపిటల్స్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో యూసఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్ గొడవ తారాస్థాయిలో జరిగింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగి కొట్టుకునేదాకా వెళ్లిపోయారు. అంపైర్‌తో పాటు మిగతా ఆటగాళ్లు తలదూర్చి వారిని విడదీయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. బిల్వారా కింగ్స్ ఇన్నింగ్స్ సమయంలో జట్టు బ్యాటర్ యూసఫ్ పఠాన్ బ్యాటింగ్ చేస్తున్నాడు.ఇండియా క్యాపిటల్స్ బౌలర్ మిచెన్ జాన్సన్ బౌలింగ్ పఠాన్ బౌండరీలు బాదాడు. అయితే ఓవర్ ముగిసిన తర్వాత మిచెల్ జాన్సన్ పఠాన్‌పై నోరు పారేసుకున్నాడు. తాను ఏం తక్కువ తినలేదంటూ యూసఫ్ పఠాన్ కూడా జాన్సన్‌ను తిట్టాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దీంతో కోపంతో యూసఫ్ పఠాన్ జాన్సన్ వైపు దూసుకొచ్చాడు. అయితే జాన్సన్ పఠాన్‌ను తోసేశాడు. ఇక గొడవ తారాస్థాయికి చేరిందన్న క్రమంలో అంపైర్ తలదూర్చి జాన్సన్‌ను పక్కకి తీసుకెళ్లారు. ఆ తర్వాత కూడా ఇద్దరు ఎక్కడా తగ్గలేదు. ఇరుజట్ల కెప్టెన్లు, అంపైర్ల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అయితే 48 పరుగులు చేసిన యూసఫ్ పఠాన్ మిచెల్ జాన్సన్ బౌలింగ్‌లో వెనుదిరగడం గమనార్హం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇండియా క్యాపిటల్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన బిల్వారా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ 65 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. విలియం పోర్టర్‌ఫీల్డ్ 59, యూసఫ్ పఠాన్ 48, రాజేష్ బిష్ణోయి 36 నాటౌట్ రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. రాస్ టేలర్ 39 బంతుల్లో 84 పరుగులు చేయగా.. చివర్లో ఆష్లే నర్స్ 28 బంతుల్లో 60 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. ఇక క్వాలిఫయర్ 1లో ఓడినప్పటికి బిల్వారా కింగ్స్‌కు మరో అవకాశం ఉంది. క్వాలిఫయర్-2లో గుజరాత్ జెయింట్స్‌తో బిల్వారా కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు అక్టోబర్ 5న ఇండియా క్యాపిటల్స్‌తో ఫైనల్ ఆడనుంది. #ICYMI: Things got really heated in @llct20 between Yusuf Pathan and Mitchell Johnson. 🔥 pic.twitter.com/4EnwxlOg5P — Nikhil 🏏 (@CricCrazyNIKS) October 2, 2022 చదవండి: ఓయ్ చహల్.. ఏంటా పని? 'బౌలింగ్ లోపాలు సరిదిద్దుకుంటాం.. సూర్య నేరుగా అక్టోబర్ 23నే' -
మిచెల్ జాన్సన్‌కు వింత అనుభవం.. హోటల్ గదిలో పాము!
భారత్ వేదికగా జరుగుతోన్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ సెకెండ్ సీజన్ ఉత్కంఠ భరితంగా జరుగుతోంది. ఈ టోర్నీలో మొత్తం నాలుగు జట్లు పాల్గొంటున్నాయి. అదే విధంగా ఈ లీగ్‌లో వివిధ దేశాలకు చెందిన క్రికెట్ దిగ్గజాలు భాగమై ఉన్నారు. కాగా ఈ లీగ్‌లో ఆడుతున్న ఆస్ట్రేలియా మాజీ బౌలర్ మిచెల్ జాన్సన్‌కు ఓ వింత అనుభవం ఎదురైంది. ఈ ఈవెంట్లో జాన్సన్ ఇండియా క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో కోల్‌కతాలో తన బస చేస్తున్న హోటల్ గదిలో పాము ప్రత్యక్షమైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను జాన్సన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఆ ఫోటోకు " ఇది ఏ జాతికి చెందిన పాము..ఎవరికైనా తెలుసా? నా గది తలుపుకు వేలాడుతున్నాను" అని క్యాప్షన్‌గా అతడు పెట్టాడు. ఇక ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఆడిన జాన్సన్ ఒక్క వికెట్ పడగొట్టాడు. గుజరాత్ జైయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ వికెట్‌ను జాన్సన్ తన ఖాతాలో వేసుకున్నాడు. View this post on Instagram A post shared by Mitchell Johnson (@mitchjohnson398) చదవండి: T20 World Cup 2022: ప్రపంచకప్‌లో షాహీన్ అఫ్రిది ఆడకూడదు: పాక్ మాజీ ఆటగాడు -
కోహ్లి ఫామ్‌లోకి రావడం భారత్‌కు కలిసి వస్తుంది: మిచెల్ జాన్సన్
టీ20 ప్రపంచకప్-2022కు ముందు స్వదేశంలో టీమిండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే ఈ సిరీస్‌లో అందరి కళ్లు భారత స్టార్ విరాట్ కోహ్లిపైనే ఉన్నాయి. అసియాకప్-2022లో అదరగొట్టిన కోహ్లి.. ఇప్పడు ఆసీస్ సిరీస్‌లో ఎలా రాణిస్తాడో అని అభిమానులు అతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మాజీ బౌలర్ మిచెల్ జాన్సన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు విరాట్ కోహ్లి ఫామ్‌లోకి రావడం భారత జట్టుకు సానుకూల అంశమని జాన్సన్ అభిప్రాయపడ్డాడు. కాగా భారత్ వేదికగా జరుగుతోన్న లెజెండ్స్ లీగ్ క్రికెట్లో మిచెల్ జాన్సన్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఏఎన్ఐతో జాన్సన్ మాట్లాడుతూ.. "సరైన సమయంలో విరాట్ కోహ్లి తిరిగి తన రిథమ్‌ను పొందాడు. ఇది భారత జట్టుకు కలిసొచ్చే అంశం. కోహ్లి వంటి అత్యుత్తమ ఆటగాడు పామ్‌లో ఉంటే.. మిగితా ఆటగాళ్లలో కాన్ఫిడెన్స్ మరింత రెట్టింపు అవుతుంది. ఇక టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక విరాట్ కోహ్లి.. భారత జట్టు వైపు అందరి దృష్టిని మళ్లించాడు. ఇక ప్రపంచకప్‌కు ముందు కీలక సిరీస్‌లో ఆస్ట్రేలియా, భారత జట్లు తలపడనున్నాయి. ఈ సిరీస్‌లో ఏ జట్టు విజయం సాధించినా.. పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రపంచకప్‌లో అడుగుపెడుతోంది" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: Suryakumar Yadav: 'నాలుగో నెంబర్ ఇక నాదే.. ఎవరికి ఇవ్వను' -
'కెరీర్ మొత్తం మానసిక క్షోభకు గురయ్యా'
మెల్బోర్న్ : అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తాను మానసిక క్షోభతో యుద్ధం చేస్తున్నట్లు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాకు చానెల్ 7కు ఇంటర్య్వూ ఇచ్చిన జాన్సన్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ' రిటైర్మెంట్ తర్వాత జీవితంలో చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నా. కానీ ఇలాంటి పరిస్థితులను చిన్న వయసులోనే ఎదుర్కొన్నా.. ఆట ముగిసిన తర్వాత రూమ్‌కు వెళ్లాకా ఎన్నోసార్లు ఒంటరితనంగా ఫీలయ్యేవాడిని. కుటుంబానికి దూరంగా నివసించడం లాంటివి నన్ను నిరాశకు గురిచేసేవి. క్రికెట్లో భాగంగా అవన్నీ పట్టించుకునేవాడిని కాను. అలా కెరీర్ మొత్తం మానసికక్షోభకు గురయ్యేవాడిని. (చదవండి : డబుల్ ధమాకా.. సన్‌రైజర్స్ సంబరాలు) అయితే ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత మాత్రం జీవితంలో కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నా. ఎందుకో తెలియదు గానీ ఆటకు దూరమైన తర్వాత కుటుంబానికి దగ్గరగా ఉంటున్నా ఏదో తెలియని ఒంటరితనం నన్ను నిరాశకు గురిచేస్తుంది. వీటన్నింటి నుంచి బయటపడడానికి.. నా మెదుడును యాక్టివ్‌గా ఉంచుకోవడానికి కొన్ని పనులను అలవాటు చేసుకున్నా. క్రికెట్ ఆడేటప్పుడు ఇలాంటి ఒంటరితనాన్ని ఎన్నోసార్లు అనుభవించా... మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్.. 2011లో జరిగిన యాషెస్ సిరీస్‌లో క్రికెట్‌ను అంతగా ఎంజాయ్ చేయలేకపోయా.' అంటూ జాన్సన్ తెలిపాడు. ప్రపంచ అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలరల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న మిచెల్ జాన్సన్ ఆసీస్ తరపున 73 టెస్టుల్లో 313 వికెట్లు, 153 వన్డేల్లో 239 వికెట్లు,30 టీ20ల్లో 38 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు 2015లో ఆసీస్ వన్డే వరల్డ్‌కప్ గెలవడంలో మిచెల్ జాన్సన్ ప్రధాన పాత్ర పోషించాడు. 2013-14 యాషెస్ సిరీస్ జాన్సన్ కెరీర్లో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. మిచెల్ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 13.97 సగటుతో మొత్తం 37 వికెట్లు తీశాడు. ఇండియన్ ప్రీమియర్‌లీగ్‌లో కింగ్స్ పంజాబ్, ముంబై ఇండియన్స్, కేకేఆర్ జట్లకు మిచెల్ జాన్సన్ ప్రాతినిధ్యం వహించాడు. -
'కోహ్లిని చూస్తే నవ్వొస్తుంది'
సిడ్నీ : ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలకు ఒకరంటే ఒకరు పడదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే 2014 పర్యటనలో ఈ ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదమే నడిచింది. కవ్వింపులకు దిగిన జాన్సన్‌కు విరాట్ బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. కివీస్ పర్యటనలో పూర్తిగా తేలిపోయిన కోహ్లీపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కోహ్లి ఆటతీరు, మైదానంలో అతను ప్రవర్తించిన తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. (కోహ్లికి సూచనలివ్వడానికి మీరెవరు ?) అయితే ఇదే అదునుగా భావించిన జాన్సన్ విరాట్ కోహ్లీని మరోసారి టార్గెట్ చేశాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో మ్యాచ్ ముగుస్తుందనగా.. భారత్‌కు వచ్చినప్పుడు తానేంటో చూపిస్తానని కోహ్లీ సహచర ఆటగాళ్లతో అంటూ ప్రత్యర్థులను హెచ్చరించాడు. అయితే కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలు తనకు నవ్వును తెప్పించాయని జాన్సన్ కామెంట్ చేశాడు. కోహ్లీ చేసిన( 'భారత్‌కు వచ్చినప్పుడు నేనేంటో చూపిస్తా')వ్యాఖ్యల స్క్రీన్ షాట్స్‌ను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. ఈ మాటలు వింటే నవ్వొస్తొందని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే జాన్సన్ తీరుపై కోహ్లీ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఒక ఆటగాడిని ఇలా వెకిలి చేయడం ఏం బాలేదు..భారత్‌కు వచ్చినప్పుడు కోహ్లీ తానేంటో నీకు చూపిస్తాడులే అంటూ కామెంట్ చేస్తున్నారు. (మళ్లీ టాప్‌టెన్‌లోకి వచ్చాడు) -
‘వారు క్రికెట్ లవర్సే కాదు’
సిడ్నీ: బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి ఏడాది నిషేధం ఎదుర్కొన్న ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్.. యాషెస్ సిరీస్ ద్వారా తన టెస్టు పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. తొలి టెస్టులో రెండు భారీ సెంచరీలు చేసిన స్మిత్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అయితే స్మిత్‌కు నిరసనల సెగ తప్పడం లేదు. ఆ బాల్ ట్యాంపరింగ్ ఉదంతాన్ని గుర్తు చేస్తూ ఇంగ్లండ్ అభిమానులు పదే పదే ‘చీటర్-చీటర్’ ఎగతాళి చేస్తూనే ఉన్నారు. స్మిత గాయపడి పెవిలియన్‌కు తీసుకెళుతున్న సమయంలో కూడా ఈ తరహా నిరసన సెగలు వినిపించడంపై ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ స్పందించాడు క్రికెట్ గేమ్‌లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని చెడగొట్టడానికి కొంతమంది పూనుకుంటారని, వారే స్మిత్‌ను చీటర్ అంటూ ఎగతాళి చేస్తున్నారని అన్నాడు. ఇది చాలా జుగుప్సాకరమైన చర్యగా జాన్సన్ పేర్కొన్నాడు. ఎప్పుడో ముగిసిపోయిన కథను మళ్లీ మళ్లీ గుర్తు చేయడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించాడు. ఇలా ఎవరైతే చేస్తోరో వారు తన దృష్టిలో క్రికెట్ లవర్సే కాదని కాస్త ఘాటుగా మాట్లాడాడు. మ్యాచ్‌ను చూడటానికి వచ్చిన మొత్తం అభిమానులను ఉద్దేశించి తాను ఇలా అనడం లేదని, ఎవరైతే ఒకర్ని ఏడిపించాలని చేస్తారో వారి గురించి మాత్రమే మాట్లాడుతున్నానని జాన్సన్ అన్నాడు. ఆర్చర్ బౌలింగ్‌లో గాయపడి పెవిలియన్‌కు స్మిత్ చేరుతున్న క్రమంలో కూడా చీటర్ అంటూ ఎగతాళికి దిగడం వినిపించిందని, ఇది తనను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నాడు. -
కోహ్లిపై ఆసీస్ బౌలర్ పరుష వ్యాఖ్యలు!
పెర్త్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో టెస్ట్‌లో వ్యవహరించిన తీరుపై ఆస్ట్రేలియా మాజీ బౌలర్ మిచెల్ జాన్సన్ మండిపడ్డాడు. కోహ్లి ఓ అమర్యాదస్తుడని, వెర్రివాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ టెస్ట్‌లో ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్, కోహ్లిల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరడం.. భారత్ 146 పరుగుల తేడాతో ఓడిపోవడం తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం ఇరు జట్ల కెప్టెన్ షేక్‌హ్యాండ్ ఇచ్చుకునే సందర్భంలో కోహ్లి అమర్యాదకంగా ప్రవర్తించాడని ఫాక్స్ స్పోర్ట్స్‌కు రాసిన కథనంలో జాన్స్‌న్ అభిప్రాయపడ్డాడు. ‘కోహ్లి టీమ్ పైన్ పట్ల అలా వ్యవహరించాల్సింది కాదు. అతనితో షేక్ హ్యాండ్ ఇచ్చాడు.. కానీ అతనివైపు చూడలేదు. ఇది అగౌరవపడచడమే. కోహ్లి చాలా మంది క్రికెటర్లకు దూరంగా వెళ్తుంటాడు. తాను విరాట్ కోహ్లిననే అహాన్ని ప్రదర్శిస్తాడు. అతనో వెర్రివాడు. నాకు తెలిసి అతనేం మారలేదు.’ అని పేర్కొన్నాడు. ఇక టీమ్ పైన్ వ్యవహారంలో కోహ్లి తప్పేం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. కోహ్లిపై వస్తున్న విమర్శలను ఖండిస్తూ అతనికి మద్దతుగా నిలిచింది. 2014 మెల్బోర్న్ టెస్ట్ సందర్భంగా కోహ్లి-జాన్సన్‌ల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. -
క్రికెట్‌కు జాన్సన్ గుడ్‌బై
సిడ్నీ: అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్ ప్రకటించాడు. మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ ఆసీస్ ప్లేయర్ ఇప్పటి వరకు కొన్ని దేశవాళి టీ20 లీగ్‌ల్లో ఆడాడు. ఇక నుంచి టీ20 లీగ్‌ల్లో సైతం ఆడనని ఆదివారం స్పష్టం చేశాడు. ‘ఇక నా క్రికెట్ కెరీర్ అయిపోయింది. నేను నా చివరి బంతి వేసాను. చివరి వికెట్‌ను కూడా తీసుకున్నాను. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ఈ రోజు ప్రకటిస్తున్నా. నేనింకా కొన్ని రోజులు ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌ల్లో ఆడుతానని భావించాను. కానీ నాశరీరం అందుకు సహకరించడం లేదు. పూర్తిగా అలసిపోయాను. ఈ ఏడాది ఐపీఎల్లో నాకు కలిగిన వెన్ను నొప్పి ఆటను ముగించాలని నన్ను హెచ్చిరించింది. దీంతో నా క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నాను. మిగిలిన నా జీవితాన్ని ఆస్వాదిస్తాను.’ అని చెప్పుకొచ్చాడు. ఈ ఆసీస్ ప్లేయర్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. కెరీర్లో 73 టెస్టుల్లో 313, వన్డేల్లో 153 మ్యాచుల్లో 239, టీ20ల్లో 38 వికెట్లను జాన్సన్ పడగొట్టాడు. ఆసీస్ తరఫున 2007లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన జాన్సన్ 2015లో తన చివరి టెస్టు, వన్డేను ఆడాడు. -
మిచెల్ జాన్సన్ తలకు 16 కుట్లు
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ స్పీడ్ స్టార్ మిచెల్ జాన్సన్ తలకు తీవ్ర గాయమైంది. జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో మిచెల్ జాన్సన్ గాయపడ్డాడు. చిన్-అప్ బార్ వ్యాయామం చేస్తుండగా.. అది జాన్సన్ తలకు బలంగా తగిలింది. దాంతో అతని తలపై సుమారు రెండు అంగుళాల వెడల్పుగా కట్ అయ్యింది. దాంతో అతని తలపై16 కుట్లు పడ్డాయి. ఈ గాయం కారణంగా ఐపీఎల్లో మిచెల్ ఆడేది అనుమానంగా మారింది. జాన్సన్‌ను రూ. 2 కోట్లకు కోల్‌కతా ఖరీదు చేసిన సంగతి తెలిసిందే. -
పాక్ క్రికెటర్‌ను ఆడేసుకుంటున్నారు
సాక్షి, ఇస్లామాబాద్ : సోషల్ మీడియాలో చేసే పోస్టుల విషయంలో ముఖ్యంగా సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక్కోసారి అవి వికటించే ప్రమాదం ఉంటుంది. తాజాగా పాక్ క్రికెటర్ ఒకరు ‘కొత్త లుక్కు’ పేరిట చేసిన ప్రయోగం అతన్ని ట్రోల్ చేసి పడేస్తోంది. పాకిస్థాన్ బౌలర్ వాహబ్ రియాజ్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ టీం తరపున ఆడుతున్నాడు. దుబాయ్‌లో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం తొలి మ్యాచ్ సందర్భంగా వాహబ్ తన మీసాలను కట్ చేయించుకుని కొత్త లుక్కుతో దర్శనమిచ్చాడు. గతంలో ఆస్ట్రేలియన్ బౌలర్ మిచెల్ జాన్సన్ ఇదే తరహా లుక్కుతో కనిపించటంతో.. ఇక క్షణం గ్యాప్ కూడా తీసుకోకుండా వాహబ్ ఫోటోలపై ఫన్నీ కామెంట్లు చేసేస్తున్నారు. ఇందులో పాకిస్థాన్ ఫ్యాన్సే ఎక్కువగా ఉండటం గమనార్హం. మ్యాచ్‌కు ముందు కెప్టెన్ మహ్మద్ హఫీజ్.. వాహబ్తో ఓ సెల్ఫీ దిగి.. ‘తొలి మ్యాచ్‌కు సిద్ధమైపోయాం. వాహబ్ కొత్త లుక్కు సరిగ్గా లేదనే అనుకుంటున్నా!’ అంటూ ట్వీట్ చేశాడు. ‘అతని కొత్త లుక్కు మీకేలా నచ్చింది’ అంటూ పీఎస్ఎల్ అఫీషియల్ ట్విట్టర్ ఓ సందేశం ఉంచింది.. ‘మీసాలు పెంచినంత మాత్రానా నువ్వు(వాహబ్) మిచ్చెల్ జాన్సన్వి కాలేవు’ అని కొందరు.. ‘పేద మిచ్చెల్ జాన్సన్’ ‘పాపం మిచ్చెల్ జాన్సన్’ అంటూ మరికొందరు.. జాన్సన్-వాహబ్ ఫోటోలను పక్కపక్కన పెట్టి ఆన్ లైన్ ఆర్డర్ జోక్ తో మరొకరు.. చివరకు సింగం సినిమాలో సూర్య పోస్టర్‌తో ఇంకొకరు... ఇలా హిల్లేరియస్ పోస్టులతో వాహబ్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ ట్రోలింగ్ పై వాహబ్ స్పందించాడు. అనుకోకుండా ఆ స్టైల్ మార్చానని.. ఒకవేళ అందరికీ తాను జాన్సన్‌ను అనుకరించినట్లు అనిపిస్తే, అది గౌరవంగానే భావిస్తానని చెబుతున్నాడు. పాక్ తరపున 79 వన్డేలు, 26 టెస్టులు ఆడిన వాహబ్ తిరిగి జట్టులో స్థానం కోసం కృషి చేస్తున్నాడు. Ready to go for the opening ceremony & our 1st game of PSL#3 , not sure about @WahabViki new look 😷👌👍🏼😂 pic.twitter.com/eAtbNn1W37 — Mohammad Hafeez (@MHafeez22) 22 February 2018 How do you like @WahabViki's new look? The left-armer claims to have grown the mustache to 'motivate' himself!#HBLPSL #DilSeJaanLagaDe pic.twitter.com/xMMCnXTlGF — PakistanSuperLeague (@thePSLt20) 22 February 2018 Mooch rakhnay se koe johnson no ban jata — Riz (@riziop) 23 February 2018 Pic 1: What you order online Pic 2: What u get 😂😂😂#Wahabriaz #HBLPSL pic.twitter.com/sqU54h5xrr — Quetta Gladiators🇵🇰 (@raja_musa96) 22 February 2018 poor man's mitchel johnson — Muhammad Umair Rana (@Mohd_Umair_Rana) 22 February 2018 Remember when @WahabViki featured in clash of clans? #PSL2018 pic.twitter.com/RgVy7vjRfT — Fariha (@Fay_Alif) 22 February 2018 #PSL2018 Johnson reaction after watching Wahab Riaz new Style. :) pic.twitter.com/NXvYvCHjpP — FAROOQ (@Mirza00987) 22 February 2018 -
బౌండరీ లైన్ నుంచి రాకెట్ త్రో!
పెర్త్: మిచెల్ జాన్సన్.. 2013-14 యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను బెంబేలెత్తించిన జాన్సన్ మూడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులతో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఇంగ్లండ్ జట్టు అంటేనే పూనకం వచ్చే జాన్సన్.. తాజాగా మరోసారి ఇంగ్లిష్ జట్టుకు షాకిచ్చాడు. ఈసారి వరుస వికెట్లతో కాదు.. ఓ అద్బుతమైన రనౌట్‌తో ఇంగ్లండ్ జట్టును ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అయితే జాన్సన్ ఇలా మెరిసింది యాషెస్ సిరీస్‌లో కాదు.. దేశవాళీ టోర్నమెంట్లో. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు దూరంగా ఉంటున్న జాన్సన్.. ఆసీస్ దేశవాళీ లీగ్‌ల్లో ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో జాన్సన్ బౌండరీ లైన్ వద్ద నుంచే త్రో విసిరి వికెట్లను పడగొట్టాడు. తొలుత బౌండరీకి వెళ్లకుండా బంతిని ఆపిన జాన్సన్..ఆపై నేరుగా ఆ బంతిని నాన్ స్టైకర్ వైపు విసిరాడు. అది కాస్త వికెట్లను తాకడంతో డామ్ బెస్ రనౌట్‌గా నిష్క్రమించాడు. ప్రస్తుతం జాన్సన్ విసిరిన త్రో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. -
బౌండరీ లైన్ నుంచి రాకెట్ త్రో!
-
ఆసీస్ కు 'స్ట్రోక్' ఇచ్చిన జాన్సన్
మెల్ బోర్న్:త్వరలో ఆరంభం కానున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కు సంబంధించి ఆసీస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ లేకుండా కూడా ఇంగ్లండ్ జట్టు యాషెస్ సిరీస్ ను గెలిచే సత్తా ఉందంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. బెన్ స్టోక్స్ లేకుండా యాషెస్ సిరీస్ ను ఇంగ్లండ్ జట్టు గెలవలేదని ఇయాన్ చాపెల్, స్టీవ్ వా లాంటి ఆసీస్ దిగ్గజ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తుంటే మరొకవైపు ఆ దేశానికే చెందిన మిచెల్ జాన్సన్ మాత్రం వారితో విభేదించడం ఇక్కడ గమనార్హం. 'స్టోక్స్ లేకుండా ఇంగ్లండ్ లేదు అనే వ్యాఖ్యలు అర్థరహితం. అటువంటి మితిమీరిన అంచనాలు కూడా తప్పు. స్టోక్స్ లేకుండా ఇంగ్లండ్ యాషెస్ ను గెలవగలదు. ఇంగ్లండ్ జట్టులో స్టోక్స్ లేడు మనకే అవకాశాలు ఎక్కువ అనే ఆలోచన కట్టిపెట్టండి. నేను ఇంకా యాషెస్ ను ఆసీస్ గెలుస్తుందనే నమ్మకంతోనే ఉన్నా. కానీ మా జట్టు ప్రదర్శన ఇటీవల కాలంలో చెప్పుకోదగిన విధంగా లేదు. అలా అని ఇంగ్లండ్ కూడా అద్భుతమైన విజయాల్ని ఏమీ సాధించలేదు. ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయం.ముఖ్యంగా ఇంగ్లండ్ జట్టు మొత్తం ప్రదర్శనపై మా ఆటగాళ్లు దృష్టి పెడితే మంచిది. స్టోక్స్ విషయాన్ని పక్కకుపెట్టి సిరీస్ గెలవడం గురించి ఆలోచించండి'అని జాన్సన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. -
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా అతనే కరెక్ట్!
కీలకమైన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాను ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ మట్టికరిపించి.. సిరీస్‌ను చేజిక్కించుకోవడంతో.. ఈ టెస్టులో టీమిండియాకు సారథ్యం వహించిన అజింక్యా రహానేపై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమిండియా టెస్టు కెప్టెన్సీ పగ్గాలను రహానేకు అప్పగిస్తే బాగుంటుందని ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్ అభిప్రాయపడ్డారు. 'కెప్టెన్‌గా రహానేను కొనసాగించాలి. ఇది చాలా కఠినమైన సిరీస్. అయినా ఈ సిరీస్ ఆటగాళ్ల ప్రతిభతో బాగా సాగింది' అని జాన్సన్ ట్విట్టర్లో అభిప్రాయపడ్డారు. కెప్టెన్ విరాట్ కోహ్లికి రాంచీ టెస్టులో భుజానికి గాయం కావడంతో అతను నాలుగో టెస్టు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్మశాల టెస్టుకు నాయకత్వం వహించిన రహానే మైదానంలో తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించాడు. రెండో ఇన్నింగ్స్‌లో శరవేగంగా 38 పరుగులు చేశాడు. ఓపెనర్ లోకేశ్ రాహుల్ కూడా ఈ సిరీస్‌లో ఆరో అర్ధ సెంచరీ సాధించడంతో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయాన్ని సాధించి బోర్డర్-గవస్కర్ ట్రోఫీని 2-1తో సొంతం చేసుకుంది. అయితే, వాడీవేడిగా జరిగిన ఈ సిరీస్ నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లను తాను స్నేహితులుగా పరిగణించబోనంటూ కెప్టెన్ కోహ్లి కామెంట్ చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లికి కౌంటర్ ఇచ్చేందుకు జాన్సన్ ఈ వ్యాఖ్యలు చేశాడా? అని పరిశీలకులు భావిస్తున్నారు. -
‘ధర్మశాల’ ఆసీస్‌కే అనుకూలం!
మాజీ పేసర్ జాన్సన్ వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన నాలుగో టెస్టుకు ముందు ఆసీస్ మాజీ ఆటగాడు మిషెల్ జాన్సన్ తన మాటలతో వేడి పెంచే ప్రయత్నం చేశాడు. ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న ధర్మశాల స్టేడియంలోని పిచ్ భారత్‌నే ఒత్తిడిలో పడేస్తుందని అతను వ్యాఖ్యానించాడు. ఇది ఆసీస్‌కు అనుకూలించే మైదానమని అతను అన్నాడు. ‘ధర్మశాల స్టేడియం చాలా బాగుం టుంది. ఇక్కడి పిచ్‌పై సాధారణంగా పచ్చిక ఎక్కువగా కనిపిస్తుంది. సరిగ్గా చెప్పాలంటే ఇది ఆస్ట్రేలియాలో ఉండే మైదానంలా కనిపిస్తోంది. దీనిని చూస్తే ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగితే, భారత్ మాత్రం ఒత్తిడిలో పడటం ఖాయం. నిజానికి భారత్ ఈ సిరీస్‌లో అతి విశ్వాసంతో ఆడింది. 1–1తో ప్రస్తుతం సమంగా ఉండటమే అందుకు నిదర్శనం’ అని జాన్సన్ అభిప్రాయ పడ్డాడు. -
ఆ పిచ్ చూస్తే.. వణికిపోతారు
భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మధ్య జరిగే చిట్టచివరి, నాలుగో టెస్టు గురించి ఆస్ట్రేలియా చాలా ఆశాభావంతో ఉంది. ఇప్పటి వరకు జరిగిన మూడింటిలో రెండు జట్లు తలో విజయం సాధించగా, మూడో టెస్టు డ్రా అయింది. ఇప్పుడు నాలుగో టెస్టు వేదిక అయిన ధర్మశాల పిచ్ గురించి ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ మంచి ఆశాభావంతో ఉన్నాడు. ఇక్కడ పేస్‌బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌ను చూస్తే భారత జట్టు వణికిపోతుందని వ్యాఖ్యానించాడు. ''ధర్మశాల చాలా అద్భుతమైన గ్రౌండ్. చాలా తక్కువసార్లు మాత్రమే పిచ్ మీద గడ్డి కనిపిస్తుంది. అందువల్ల ఆస్ట్రేలియన్లు మంచి విశ్వాసంతో ఉంటే, టీమిండియా మాత్రం వణుకుతోంది. ఈ సిరీస్‌లో వాళ్లు అతి విశ్వాసంతో ఉన్నట్లున్నారు. వాళ్ల స్కోర్‌లైన్ దాన్ని చూపిస్తోంది'' అని జాన్సన్ అన్నాడు. జాక్సన్ బర్డ్‌కు బదులు ఇలాంటి పిచ్ మీద పుణె టెస్టు హీరో స్టీవ్ ఓకీఫ్‌ను తీసుకొచ్చే అవకాశం ఉందని తెలిపాడు. నాలుగో టెస్టు శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ మొత్తమ్మీద స్పిన్నర్లు మంచి పెర్ఫామెన్స్ చూపించారని, ఇంతకుముందు వాళ్లను జట్టులో ఉంచుతారా లేదా అన్న పరిస్థితి ఉండగా.. ఇప్పుడు తమ ప్రదర్శనతో ఎలాంటి పిచ్‌ల మీదైనా ఫలితాలు సాధించగలమని చూపించుకున్నారని జాన్సన్ చెప్పాడు. నాథన్ లయన్‌కు ఈసారి మంచి బౌన్స్ వస్తుందని, అతడు బాల్‌ను చాలా బాగా టర్న్ చేస్తున్నాడని అన్నాడు. అయితే.. రైట్, లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త పడాల్సిందేనని తెలిపాడు. ధర్మశాల లాంటి పిచ్‌ల మీద బర్డ్ బాగా ఉపయోగపడతాడని చెప్పాడు. -
విరాట్ పై మిచెల్ అక్కసు..
సిడ్నీ: ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ వివాదానికి ఆజ్యం పోసేందుకు ఆ దేశ మాజీ క్రికెటర్లు, అక్కడి మీడియా యత్నిస్తునే ఉన్నాయి. ఈ వివాదాన్ని మరింత సాగదీయకుండా ముగింపు పలకాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) పెద్దలు భావించినా, దానిపై ఆసీస్ క్రికెటర్ల మాటల దాడి మాత్రం ఆగలేదు. తాజాగా ఆసీస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ ఓ క్రికెట్ బ్లాగుకు రాసిన కాలమ్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లిపై విషం కక్కాడు. తమతో జరిగిన రెండో టెస్టులో విరాట్ కోహ్లి దూకుడుగా ప్రవర్తించి ఫిర్యాదు వరకూ వెళ్లడానికి ప్రధాన కారణం అతనిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లడమేనని ఈ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ విమర్శించాడు. ఇప్పటివరకూ జరిగిన తొలి రెండు టెస్టుల్లో విరాట్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో అతను ఒత్తిడికి లోనవుతున్నాడన్నాడు. దాంతోనే తనలోని భావోద్వాగాల్ని కంట్రోల్ చేసుకోవడంలో విఫలమయ్యాడని జాన్సన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 'మాతో రెండు టెస్టుల్లో విరాట్ రాణించలేక భంగపడ్డాడు. పరుగుల వేటలో విఫలం కావడమే అతనిలో ఒత్తిడిలో కారణం. ఇది విరాట్ కు కొత్తమే కాదు. గతంలో ఈ తరహా ఎమోషన్స్ ను అతను బయటపెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ తరహా రియాక్షన్స్ విరాట్ నుంచి వస్తాయని కెమెరా మ్యాన్లకు తెలుసు కాబట్టే ఏమి జరిగినా కెమెరాలు అతనిపై వైపు వేగంగా కదులుతాయి. విరాటే రియాక్షన్స్ ను క్యాచ్ చేయడమే లక్ష్యంగా కెమెరాలు పని చేస్తాయి. ఆ క్రమంలోనే విరాట్ కోహ్లి స్పందనను వేగంగా రికార్డు చేశాయి 'అంటూ జాన్సన్ తన అక్కసు వెళ్లగక్కాడు. ఈ సందర్భంగా 2014లో భారత్ పర్యటనలో విరాట్ తో జరిగిన మాటల యుద్ధాన్ని జాన్సన్ ప్రస్తావించాడు. ఆ సమయంలో కూడా ఈనాటి పరిస్థితులే విరాట్ నుంచి చూశామంటూ తమ ఆటగాళ్ల ప్రవర్తనను సమర్ధించుకున్నాడు. -
పీటర్సన్‌ను కొట్టబోయా : మిచెల్ జాన్సన్
-
పీటర్సన్‌ను కొట్టబోయా!
పెర్త్:దాదాపు ఏడు సంవత్సరాల కిందటి ఘటన. అది కూడా యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్లు వార్మప్ చేస్తున్న సమయం. అప్పుడు ఇంగ్లండ్ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌ను ఆస్ట్రేలియా మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ కొట్టేంత పనిచేశాడట. అందుకు కారణం పీటర్సన్ పదే పదే ఆసీస్ ఆటగాళ్లను ఏడిపించాడట. దాంతో కోపం తట్టుకోలేని తాను పీటర్సన్ పైకి దూసుకెళ్లి అతనితో మాటల యుద్ధానికి దిగినట్టు మిచెల్ పేర్కొన్నాడు. '2009లో ఇంగ్లండ్‌తో మొదటి యాషెస్ మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న సమయంలో మాతో పాటు ఇంగ్లండ్ కూడా ప్రాక్టీస్ చేస్తుంది. దానిలో భాగంలో తమ ఆటగాళ్ల ప్రాక్టీస్ చేసే చోటకు పీటర్సన్ బంతిని హిట్ చేస్తున్నాడు. ఒకసారి మా వైపుకు వచ్చిన బంతిని ఇచ్చి పీటర్సన్‌ను ఇక ఇటువైపు కొట్టవద్దని చెప్పా. అయినప్పటికీ అతను వినలేదు. మళ్లీ మళ్లీ కొడుతూనే ఉన్నాడు. ఇక కోపం తట్టుకోలేక ఒక్కసారిగా పీటర్సన్పైకి దూసుకెళ్లాను. ఇక ఆ తరువాత మా ఇద్దరి మధ్య వాడివేడిగా మాటల యుద్ధం జరిగింది. ఆ క్రమంలోనే పీటర్సన్ నోరు జారాడు. ఇక కొట్టకోవడం ఒకటే తరువాయి. ఆ తరుణంలో తన సహచర ఆటగాడు స్టువర్ట్ క్లార్క్ ఇద్దరి మధ్యకు దూకి గొడవను సద్దుమణిగేలా చేశాడు' అని మిచెల్ జాన్సన్ తన తాజా ఆటో బయోగ్రపీ 'రీసైలెంట్'లో పేర్కొన్నాడు. -
బీబీఎల్ లో మిచెల్ అరంగేట్రం!
పెర్త్: ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ తొలిసారి బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో అరంగేట్రానికి రంగం సిద్దం చేసుకున్నాడు. ఈ మేరకు 2016-17 సీజన్ లో భాగంగా పెర్త్ స్కార్చర్స్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పటివరకూ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడిన జాన్సన్.. వచ్చే బిగ్ బాష్ లీగ్ లో తొలిసారి రంగ ప్రవేశం చేయబోతున్నాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న అనంతరం బిగ్ బాష్ లో ఆడే అవకాశాన్ని వదులుకున్నాడు. ఆ సమయంలో కుటుంబానికి చేరువుగా ఉండాలని భావించిన మిచెల్.. బిగ్ బాష్ లో ఆడేందుకు నిరాకరించాడు. తాను ఎప్పుడూ క్రికెట్ కు మరింత చేరువగా ఉండటానికే ఇష్టపడతానని తెలిపిన జాన్సన్.. ఈ లీగ్ ఆడటానికి ఆతృతగా ఉన్నట్లు పేర్కొన్నాడు. స్వదేశంలో జరిగే బిగ్ బాష్ లీగ్ కు విశేష ఆదరణ తో దూసుకుపోతుందన్నాడు. కొంతమంది ప్రేరణతోనే బీబీఎల్ ఆడటానికి సిద్దమైనట్లు మిచెల్ తెలిపాడు. తాను జట్టుతో పాటు ఉంటూ యువ క్రికెటర్లకు బౌలింగ్ విభాగంలో మెంటర్ గా సేవలందించడానికి సిద్ధమైనట్లు మిచెల్ తెలిపాడు. తాను బౌలింగ్ కోచింగ్ బాధ్యతలు కూడా తీసుకోవడంతో ఆటపై ఎక్కువ దృష్టి నిలిపాల్సిన అవసరం ఉందన్నాడు. -
మ్యాక్స్ వెల్, జాన్సన్ ఫైర్
న్యూఢిల్లీ: ఐపీఎల్-9 ఆరంభం నుంచి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వార్తల్లో ఉంటూ వస్తోంది. సరిగా రాణించడం లేదని మిల్లర్ ను తప్పించి సిరీస్ మధ్యలో మురళీ విజయ్ ను జట్టు కెప్టెన్ గా నియమించింది. బెంగళూరు చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడంతో కోచ్ సంజయ్ బంగర్ ను జట్టు సహయజమాని ప్రీతి జింతా దూషిచింనట్టు వార్తలు వచ్చాయి. ఇదిలావుండగా షాన్ మార్ష్ ను స్వదేశానికి తిప్పి పంపడంపై ఓ ఆంగ్ల దినపత్రిక ఆసక్తికర కథనం ప్రచురించింది. గాయం కారణంగా అతడిని స్వదేశానికి పంపలేదని, సహచర ఆటగాడితో గొడవ పడినందుకే మార్ష్ ను తొలగించారని పేర్కొంది. డ్రెస్సింగ్ రూములో తోటి ఆటగాడిని అతడు కొట్టాడని వెల్లడించింది. దీనిపై 'కింగ్స్' ఆటగాళ్లు మ్యాక్స్ వెల్, మిచెల్ జాన్సన్ ఘాటుగా స్పందించారు. ఇవన్నీ చెత్త వార్తలు అంటూ మ్యాక్స్ వెల్ కొట్టిపారేశాడు. 'టీమ్మేట్ ను కొట్టినందుకే మార్ష్ ను స్వేదేశానికి పంపారంట. గాయపడినందుకు కాదంటా. ఇంతకన్నా జోక్ మరోటి ఉండదంటూ' ట్వీట్ చేశాడు. ఇలాంటి కథనం రాసినందుకు దీపాంకర్ లాహిరిని ఫిక్షన్ స్టోరీ రైటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వాలని జాన్సన్ ట్విటర్ లో పేర్కొన్నాడు. -
మిచెల్ చూడూ.. కోహ్లి ఎంత కసిగా కొట్టాడో!
న్యూఢిల్లీ: కీలక సమయాల్లో విరాట్ కోహ్లి ఆడలేడు. అందుకు ఉదాహరణ 2015 వరల్డ్ కప్ సెమిస్ మ్యాచే. ఆస్ట్రేలియా విసిరిన 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేక్రమంలో విరాట్ ఒక్క పరుగు మాత్రమే చేశాడు. భారత్ ఓడిపోయింది... అంటూ ఎద్దేవాపూరిత వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్‌కు డాషింగ్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి తన బ్యాటుతో దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు. ఒత్తిడిలో కోహ్లి ఆడలేడన్న మిచెల్ విమర్శలను తుత్తునియలు చేస్తూ.. అత్యంత ఒత్తిడిలో ఎంతో స్థిరచిత్తంతో ఆస్ట్రేలియాపై విరాట్ మెరుపులు మెరిపించాడు. చివరి ఓవర్లలో అతడు ఆడుతుంటే.. ఆస్ట్రేలియా బౌలర్లు, ఫీల్డర్లు బిత్తరపోయారు. అతని ధాటికి బంతులు ఎక్కడ వేయాలో తెలియక కంగారులు కంగారెత్తారు. బౌలర్లు చక్కటి బంతులు వేసినా కళాత్మక విధ్వంసంతో ఆసిస్‌ను చిత్తు చేశాడు కోహ్లి. కోహ్లి ఆటతీరుపై ఇప్పుడు భారత్‌లోనే కాదు.. క్రికెట్ ప్రపంచంలోనే ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రికెట్ దిగ్గజాలు, తాజా మాజీ ఆటగాళ్లు కోహ్లి మాస్టర్ ఇన్నింగ్స్‌ను కీర్తిస్తున్నారు. ఇదే సమయంలో కోహ్లి అభిమానులు మిచెల్‌కు సోషల్ మీడియాలో చురకలు వేస్తున్నారు. మీ జట్టుకు కోహ్లి ఎలా చుక్కులు చూపాడో చూశావా? మిచెల్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. సవాల్నే సవాలుగా తీసుకొని ఆడే కోహ్లి ముందు నీ కుప్పిగంతుల విమర్శలు పనిచేయబోవని మిచెల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య కీలక మ్యాచ్ నేపథ్యంలో విరాట్ కోహ్లి ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా జాన్సన్ ఆదివారం ట్విట్టర్లో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కంగారులు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి స్లెడ్జింగ్‌లాంటి దానికి పాల్పడితే.. దానిని పాజిటివ్ తీసుకొని మరింత స్ఫూర్తి పొందుతానని చెప్పాడు. కోహ్లి వ్యాఖ్యలను మిచేల్ ట్విట్టర్లో ఎద్దేవా చేశాడు. గత ఏడాది జరిగిన వరల్డ్ కప్ సెమిస్ మ్యాచ్‌లో ఎందుకు విఫలమయ్యావంటూ ప్రశ్నించాడు. నిజంగా ఆడాల్సిన ఆ సమయంలో ఒక్క పరుగుకే ఔటైన విషయాన్ని పరోక్షంగా గుర్తుచేసిన సంగతి తెలిసిందే. -
కోహ్లిపై ఆస్ట్రేలియా క్రికెటర్ మాటల దాడి!
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచేల్ జాన్సన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొన్నప్పటకీ.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను డామినేట్ చేసే తీరు మాత్రం మార్చుకోలేదు. టీ20 వరల్డ్ కప్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య కీలక మ్యాచ్ నేపథ్యంలో విరాట్ కోహ్లి ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా జాన్సన్ ట్విట్టర్లో దాడికి దిగాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనగానే సహజంగానే ఆటగాళ్ల మధ్య మాటల పోరు, స్లెడ్జింగ్ గుర్తుకొస్తాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భారత డాషింగ్ బ్యాట్స్‌మెన్ కోహ్లి స్లెడ్జింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధమేనని పేర్కొన్నాడు. కంగారులు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి స్లెడ్జింగ్‌లాంటి దానికి పాల్పడితే.. దానిని పాజిటివ్ తీసుకొని మరింత స్ఫూర్తి పొందుతానని చెప్పాడు. తానొక దృక్ఫథం తీసుకొని మైదానంలోకి ఎంటరైతే.. ఎవరు ఎలాంటి దానికి పాల్పడినా లెక్కచేయబోనని, తన ప్లాన్స్‌కు అనుగుణంగా ముందుకెళుతానని చెప్పాడు. కోహ్లి వ్యాఖ్యలను మిచేల్ ట్విట్టర్లో ఎద్దేవా చేశాడు. గత ఏడాది జరిగిన వరల్డ్ కప్ సెమిస్ మ్యాచ్‌లో ఎందుకు విఫలమయ్యావంటూ ప్రశ్నించాడు. నిజంగా ఆడాల్సిన ఆ సమయంలో ఒక్క పరుగుకే ఔటైన విషయాన్ని పరోక్షంగా గుర్తుచేశాడు. 2015 వరల్డ్ కప్ సెమిస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విసిరిన 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా టాప్ -5 బ్యాట్స్‌మెన్ లిస్ట్ పేరిట ధోనీ, డివిలీయర్స్, స్మిత్, రూట్, విలియమ్సన్ పేర్లు ప్రకటించిన మిచేల్ ఉద్దేశపూరితంగానే కోహ్లి పేరు మిస్ చేశాడు. దీనిపై మిచేల్‌తో కోహ్లి అభిమానులు ట్విట్టర్లో పంచాయతీ పెట్టుకున్నారు. అయినా టాప్ 5 లిస్ట్‌లో ఆమ్లా పేరును చేర్చాడు కానీ కోహ్లి పేరు చేర్చలేదు అతను. Love it!! Went missing in WC semi last yr when it really counts -
మిచెల్.. మళ్లీ క్రికెట్ ఆడాలి!
అడిలైడ్: ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలుకుతూ ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ జాన్సన్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టు అనంతరం మిచెల్ ఆకస్మికంగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్నిప్రకటించాడు. అయితే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్ డారెన్ లీమన్, కెప్టెన్ స్టీవ్ స్మిత్ లు మిచెల్ మళ్లీ ఆడితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఆ క్రమంలోనే రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని కూడా మిచెల్ కు విన్నవించినట్లు వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసీస్ జట్టులో పేస్ బౌలింగ్ లేమి కనబడుతోందని దాన్నిభర్తీ చేయడానికైనా తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలని తాజాగా జాన్సన్ ను లీమన్, స్మిత్ లు కోరారు. కనీసం వన్డేల్లోనైనా ఆడాలని మిచెల్ కు విజ్ఞప్తి చేసినట్లు వారు పేర్కొన్నారు. 'మిచెల్ తిరిగి ఆడితే బాగుంటుంది. రిటైర్మెంట్ నిర్ణయంపై పునరాలోచించుకుని జట్టులో కొనసాగితే మంచిదనేది మిచెల్ ను కోరాం. కానీ అతను అందుకు సుముఖంగా లేడు.కేవలం ఇంటి దగ్గర కూర్చుని ఆసీస్ మ్యాచ్ లను చూడాలని అనుకుంటున్నాడు' అని లీమన్, స్మిత్ లు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. -
క్రికెట్‌కు జాన్సన్ గుడ్‌బై
అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగిన పేసర్ ఆసీస్ ఆల్‌టైమ్ టెస్టు వికెట్ల జాబితాలో నాలుగో స్థానం పెర్త్: ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. న్యూజిలాండ్‌తో మంగళవారం ముగిసిన రెండో టెస్టు తర్వాత అతను రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించాడు. ఐదో రోజు ఆటకు ముందే రిటైర్మెంట్ అంశం గురించి ఓ ప్రకటన విడుదల చేసిన పేసర్... క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడానికి ఇదే మంచి సమయని పేర్కొన్నాడు. ‘ఇదో అద్భుతమైన ప్రయాణం. కానీ ఏ ప్రయాణమైనా ఏదో ఓ దగ్గర ముగియాల్సిందే. వాకా మైదానం నాకు చాలా ప్రత్యేకమైంది. రిటైర్మెంట్ నిర్ణయం తీసుకునేందుకు చాలా ఆలోచనలు చేశా. ఈ మ్యాచ్ తర్వాత పోటీ క్రికెట్లో నిలకడగా రాణిస్తానో లేదో తెలియదు. బ్యాగీ గ్రీన్ క్యాప్‌ను ధరించే సత్తా నాలో ఉందో లేదోనన్న సందేహం కలుగుతోంది. అందుకే వీడ్కోలు వైపు మొగ్గాను’ అని మ్యాచ్ అనంతరం 34 ఏళ్ల జాన్సన్ ఉద్వేగంగా వ్యాఖ్యానించాడు. 2001లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో మొదలు: క్వీన్స్లాండ్ తరఫున 2001లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడిన జాన్సన్... 2007లో ఆసీస్ తరఫున తొలి టెస్టు ఆడాడు. వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు మారిన తర్వాత పేసర్ బౌలింగ్‌లో సంచలనాలు సృష్టించాడు. 2008లో వాకా మైదానంలోనే దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (8/61) నమోదు చేశాడు.73 టెస్టుల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన జాన్సన్ 28.40 సగటుతో 313 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ తరఫున ‘ఆల్‌టైమ్ టెస్టు వికెట్ల జాబితా’ లో నాలుగో స్థానం దక్కించుకున్నాడు. లిల్లీ (355), మెక్‌గ్రాత్ (563), వార్న్ (708) ఇతనికంటే ముందున్నారు. గాయాలతో దెబ్బ: కెరీర్ ఆరంభంలో ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన జాన్సన్... తర్వాత పూర్తిస్థాయిలో ప్రధాన పేసర్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. డెన్నిస్ లిల్లీని మెంటార్‌గా భావించే అతను లెఫ్టార్మ్ పేసర్‌గా కంగారూలకు ఎన్నో విజయాలు అందించాడు. తన దూకుడైన బౌలింగ్‌తో ఆరంభంలో లేదంటే చివర్లో వికెట్లు తీయడంలో జాన్సన్ సిద్ధహస్తుడు. ఎలాంటి ప్రత్యర్థి అయినా తనదైన ముద్ర కచ్చితంగా చూపే జాన్సన్.. భారత బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేసేందుకు కాస్త ఇబ్బందులుపడేవాడు. అయితే గత రెండేళ్లుగా అతను గాయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. 2013-14 సీజన్లో యాషెస్ సిరీస్‌ను ఆసీస్‌కు 5-0తో అందించిన జాన్సన్ ఆ తర్వాతి నుంచి ప్రాభవం కోల్పోయాడు. అదే సమయంలో జట్టులోకి వచ్చిన కుర్రాళ్లు కుదురుకోవడంతో భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. స్టార్క్ బౌలింగ్ శైలి జాన్సన్‌ను పోలి ఉండటం, పేస్‌లో అతను నిలకడను చూపడంతో కివీస్‌తో ముగిసిన రెండో టెస్టు తర్వాత జట్టులో చోటు దక్కడం కష్టమైంది. దీంతో వారం రోజులుగా రిటైర్మెంట్ గురించి యోచిస్తున్న జాన్సన్ దాన్ని కార్యాచరణలో పెట్టేశాడు. ‘జాన్సన్ ప్రత్యేకమైన బౌలర్. ముంబై ఇండియన్స్ తరఫున దీన్ని చూశా. అతని బౌలింగ్ దూకుడును బాగా అస్వాదించా. జాన్సన్ భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నా’. -సచిన్ -
అంతర్జాతీయ క్రికెట్‌కు జాన్సన్ గుడ్ బై
పెర్త్: ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్టు ప్రకటించాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల పెర్త్ టెస్టే జాన్సన్‌కు ఆఖరి మ్యాచ్. టెస్టుల్లో అత్యిధిక వికెట్లు తీసిన నాలుగో ఆస్ట్రేలియా క్రికెటర్‌గా జాన్సన్ ఘనత సాధించాడు. టెస్టుల్లో 311 వికెట్లు పడగొట్టాడు. 153 వన్డేలాడి 239 వికెట్లు తీశాడు. కాగా, రిటైర్మెంట్ ప్రకటించిన జాన్సన్‌కు సచిన్ టెండూల్కర్ తన శుభాభినందనలు తెలిపాడు. అతడు ఎప్పుడూ చాలా స్పెషల్ బౌలర్ అని ప్రశంసించాడు. Good luck to @MitchJohnson398 who has always been a special bowler. Got to know him well at @mipaltan and enjoyed his aggressive approach! — sachin tendulkar (@sachin_rt) November 17, 2015 -
భయపెట్టే బౌలర్లు..
400 టెస్టు వికెట్ల మైలురాయిని అందుకున్న స్టెయిన్, అండర్సన్.. 300 టెస్టు వికెట్ల క్లబ్లో మిచెల్ జాన్సన్ క్రికెట్లో బ్యాట్స్‌మెన్ హవా పెరిగిపోయిన ఈ రోజుల్లో తమ ఉనికి చాటుకుంటున్న బౌలర్లను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. వేగంగా దూసుకొచ్చే బంతులతో, తమ దూకుడు స్వభావంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ బయపెట్టే పేసర్లు ప్రస్తుతం పది మంది కూడా లేరంటే అతిశయోక్తి కాదు. అలాంటి వాళ్లలో ముందువరుసలో ఉన్నారు డేల్ స్టెయిన్, మిచెల్ జాన్సన్. వీరిద్దరూ ఒకేరోజు తమ కెరీర్లలో మరచిపోలేని మైలురాళ్లను అందుకున్నారు. స్టెయిన్ 400 వికెట్లు, జాన్సన్ 300 వికెట్ల క్లబ్లో చేరి తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఆసీస్ వెన్నెముక.. 2007లోనే ఆసీస్ తరఫున టెస్టులో అడుగుపెట్టాడు మిచెల్ జాన్సన్. బ్రెట్‌లీ, స్టువర్ట్ క్లార్క్ లాంటి స్టార్ బౌలర్లు ఉన్నా వేగంతో అందర్నీ ఆకర్షించాడు. సొంతగడ్డపై అయితే చెప్పనక్కర్లేదు. బౌన్సర్లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించడంలో దిట్ట. 2011 వరకు కెరీర్ బాగానే సాగినా గాయం కారణంగా జట్టుకు దూరమై మళ్లీ పునరాగమనం కోసం కష్టపడ్డాడు. జట్టులో చోటు దొరికినా పాత ఫామ్ దొరకబుచ్చుకోవడానికి సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత వెనుదిరగలేదు. ఆసీస్ పేస్ విభాగానికి నాయకుడిగా ఎదిగాడు. స్టెయిన్‌కు పోటీగా తయారయ్యాడు. యాషెస్ మూడో టెస్టులో గురువారం ఇంగ్లండ్‌పై తన 300వ వికెట్‌ను పూర్తి చేసుకొని ఈ ఘనత సాధించిన ఐదో ఆస్ట్రేలియన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. కేవలం 62 టెస్టుల్లోనే 300 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. అలాగే బ్యాటింగ్‌లోనూ ఒక చేయి వేశాడు. ఆస్ట్రేలియా జట్లు తరఫున 2000 పరుగులు చేసి, 300 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. తొలిస్థానంలో దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్ ఉన్నాడు. నిఖార్సయిన ఫాస్ట్ బౌలర్.. ప్రస్తుత తరంలో అసలు సిసలైన పేస్ బౌలర్ ఎవరని మాజీ ఆటగాళ్లను, ఆడుతున్న ప్లేయర్లను, అభిమానులను సైతం ప్రశ్నిస్తే వచ్చే ఏకైక జవాబు డేల్ స్టెయిన్. దక్షిణాఫ్రికా పేస్ విభాగానికి గత దశాబ్ద కాలంగా వెన్నెముకగా నిలిచిన స్టెయిన్.. బంగ్లాదేశ్‌తో గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో 400 వికెట్ల మైలురాయిని దాటాడు. దిగ్గజ బౌలర్ షాన్ పొలాక్ కెరీర్ ముగిసే దశలో జట్టులోకి వచ్చిన స్టెయిన్.. అతని తర్వాత 400 వికెట్లు తీసిన రెండో దక్షిణాఫ్రికా బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. స్టెయిన్ కంటే ముందే మరో 12 మంది ఆ క్లబ్లో చే రినా అతను మాత్రం తన ఉనికిని ఘనంగా చాటుకున్నాడు. అతి తక్కువ బంతుల్లో (16,634) ఆ మైలురాయిని చేరుకున్నాడు. తక్కువ టెస్టుల్లో (80) దాన్ని అందుకున్న బౌలర్ల జాబితాలో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. 2004లో ఇంగ్లండ్‌పై సొంతగడ్డపై టెస్టు కెరీర్ మొదలుపెట్టిన స్టెయిన్.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి ఫాస్ట్ పిచ్‌లపైనే కాకుండా ఉపఖండపు పిచ్‌లపై కూడా బౌలింగ్‌లో అదరగొట్టి అందరిని ఔరా అనిపించాడు. 200కు పైగా వికెట్లు తీసిన బౌలర్లలో స్ట్రైక్ రేట్ ఉత్తమంగా ఉన్నది కూడా స్టెయిన్దే (41.5). అతని తర్వాతే దిగ్గజాలు వకార్ యూనిస్ (43.4), మాల్కమ్ మార్షల్ (46.7), అలన్ డొనాల్డ్ (47) ఉన్నారు. స్టెయిన్ ఇప్పటివరకు 79 టెస్టులు ఆడగా 61 మ్యాచ్‌ల్లో సఫారీలు ఓడిపోలేదు. ముగ్గురి మధ్యే పోటీ.. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో స్టెయిన్ కంటే ముందున్నది ఇంగ్లండ్ స్టార్ అండర్సన్ (413 వికెట్లు) మాత్రమే. అండర్సన్‌కు స్టెయిన్‌కు ఎటువంటి పోలిక లేదు. కేవలం సొంతగడ్డపై తప్ప విదేశాల్లో అండర్సన్ రాణించలేదు. అండర్సన్ ను దాటే అవకాశం 32 ఏళ్ల స్టెయిన్‌కు ఉన్నా అది సులభం కాదు. ఎందుకంటే గత ఏడాదిన్నరగా స్టెయిన్ ఫామ్ అంతంతమాత్రమే. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో మాతమే సత్తా చాటాడు. 33 ఏళ్ల అండర్సన్ విషయానికొస్తే 2003 నుంచే జట్టులో ఉన్నా 2008 తర్వాతనే స్టార్‌గా ఎదిగాడు. ఆ తర్వాతే వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. 33 ఏళ్ల మిచెల్ జాన్సన్ కూడా 2011 తర్వాత చెలరేగుతున్నాడు. అంత కు ముందు అతని సగటు 29.43 ఉండగా స్ట్రైక్ రేట్ 53.5, అదే 2011 తర్వాత సగటు 25.12, స్ట్రైక్ రేట్ 46.3గా నమోదైంది. స్టార్క్ రాకతో అతని ప్రాభవం కాస్త తగ్గింది. ప్రస్తుత యాషెస్‌లో పెద్దగా రాణించలేదు. ఈ ముగ్గురు బౌలర్ల వయసు కూడా ఇంచుమించు సమానమే. గణాంకాలను, ప్రస్తుతం ఫామ్‌ను ఆధారంగా అండర్సన్‌ను దాటడానికి స్టెయిన్‌కు మరేంత కాలం పట్టేలా లేదు. స్టెయిన్ అండర్సన్ జాన్సన్ 100 వికెట్లకు ఆడిన మ్యాచ్‌లు 20 29 23 200 వికెట్లకు ఆడిన మ్యాచ్‌లు 39 55 49 300 వికెట్లకు ఆడిన మ్యాచ్‌లు 60 81 69 400 వికెట్లకు ఆడిన మ్యాచ్‌లు 80 104 - బౌలింగ్ సగటు 22.4 29.4 27.7 స్ట్రైక్ రేట్ 41.5 57.7 50.6 ఎకానమీ రేట్ 3.24 3.05 3.28 ఉత్తమ గణాంకాలు 7/51 7/43 8/61 ఉత్తమ స్ట్రైక్ రేట్ (ఒక్కో వికెట్‌కు అవసరమైన బంతులు) ఆటగాడు దేశం స్ట్రైక్ రేట్ డేల్ స్టెయిన్ దక్షిణాఫ్రికా 41.5 రిచర్డ్ హ్యాడ్లీ న్యూజిలాండ్ 50.8 గ్లెన్ మెక్‌గ్రాత్ ఆస్ట్రేలియా 51.9 కర్ట్లీ అంబ్రోస్ వెస్టిండీస్ 54.5 -
300 వికెట్ల క్లబ్ లో మిచెల్ జాన్సన్
బర్మింగ్ హామ్: ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ టెస్టులో 300 వికెట్ల క్లబ్ లో చేరాడు. యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో అతడు ఈ ఘనత సాధించాడు. బారిస్టో వికెట్ పడగొట్టి టెస్టుల్లో 300 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన ఐదో ఆస్ట్రేలియా బౌలర్ గా గుర్తింపు పొందాడు. మిచెల్ జాన్సన్ కంటే ముందు డెన్నీస్ లిల్లీ, షేన్ వార్న్, గ్లెన్ మెక్ గ్రాత్, బ్రెట్ లీ 300 వికెట్లు పడగొట్టిన ఘనత సాధించారు. టెస్టుల్లో 2 వేల పరుగులు, 300 వికెట్లు పడగొట్టిన రెండో ఆస్ట్రేలియన్ ప్లేయర్ జాన్సన్. అంతకుముందు షేన్ వార్న్ ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ జాన్సన్ కు 69వది. -
మిచెల్ జాన్సన్ కు కుక్ సవాల్
కార్డిఫ్: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ క్రికెట్ జట్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ కు ఒకరోజు ముందు మాటల యుద్ధానికి తెరలేచింది. బుధవారం ఇరు జట్లు కార్డిఫ్ లో తొలి టెస్ట్ కు సన్నద్ధమవుతున్న తరుణంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ కు ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ సవాల్ విసిరాడు. 2013-14 లో మిచెల్ జాన్సన్ చూపించిన హీరోయిజాన్ని మరోసారి చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడా?అంటూ సవాల్ విసిరాడు. ఆ సిరీస్ లో ఇంగ్లండ్ ను వైట్ వాష్ చేయడంలో కీలకపాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్న మిచెల్.. అందుకు మరోసారి సన్నద్ధమైయ్యాడా? అంటూ కుక్ ఛాలెంజ్ చేశాడు. ఆ సిరీస్ ను పునరావృతం చేయడానికి ఆసీస్ సర్వశక్తులు పెట్టి పోరాడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని.. 2010-11 యాషెస్ సిరీస్ లో ఏమైందో ఒకసారి గుర్తుకు తెచ్చకోవాలంటూ కుక్ ఎద్దేవా చేశాడు. గత సిరీస్ లో మిచెల్ జాన్సన్ 37 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. -
నేను తిడతా... కాచుకోండి!
భారత్‌పై స్లెడ్జింగ్ చేస్తానంటున్న జాన్సన్ సిడ్నీ: భారత్‌తో జరిగే ప్రపంచకప్ సెమీస్‌లో కచ్చితంగా స్లెడ్జింగ్‌కు దిగుతానని ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ తేల్చి చెప్పాడు. ఇదంతా ఆటలో భాగమేనని సమర్థించుకున్నాడు. ‘వార్నర్ ఈసారి అలాంటి చేష్టలకు దిగనని చెప్పినట్టు విన్నాను. ఈసారి ఆ బాధ్యతను నేను తీసుకుంటాను. ఇదంతా ఆటలో భాగమే. పాక్‌తో క్వార్టర్స్‌లో వాట్సన్, వహాబ్ మధ్య మాటల యుద్ధం నిజంగా అసాధారణం. ఇద్దరూ ఏ స్థాయిలో ఆడారో చూశాం కదా’ అని జాన్సన్ గుర్తుచేశాడు. మరోవైపు ప్రపంచకప్‌లో పదే పదే ఆటగాళ్లతో ఘర్షణలకు దిగే వారిపై మ్యాచ్ నిషేధం విధిస్తామని గతంలోనే ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ హెచ్చరించారు. ‘స్నేహితులు’ ఒక్కటయ్యారు... ఆసీస్, పాక్ మధ్య జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో మాటల యుద్ధానికి దిగిన పేసర్ వహాబ్ రియాజ్, బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ ట్విట్టర్ సాక్షిగా ఒక్కటయ్యారు. పాక్ బ్యాటింగ్ సమయంలో వహాబ్‌ను వాట్సన్ మాటలతో రెచ్చగొట్టాడు. ఆ తర్వాత బౌలింగ్‌కు దిగిన వహాబ్.. తన పదునైన బౌన్సర్లతో వాట్సన్ వెన్నులో వణుకుపుట్టిస్తూ రెచ్చగొట్టాడు. ఇద్దరిపై ఐసీసీ జరిమానా కూడా విధించింది. ‘ఆ మ్యాచ్ అద్భుతంగా సాగింది. నీవు చాలా బాగా ఆడావు. సెమీస్‌లో ఇలాగే మెరుగ్గా ఆడాలని కోరుకుంటున్నాను’ అని వాట్సన్‌కు పాక్ పేసర్ ట్వీట్ చేశాడు. ‘వహాబ్ నుంచి ప్రత్యేక స్పెల్ వచ్చింది. నాకెలాంటి గాయాలు కానందుకు అదృష్టవంతుణ్ణి. నీపై నాకెలాంటి దురుద్దేశం లేదు’ అని వాట్సన్ స్పందించాడు. -
నాలుగో టెస్టుకు జాన్సన్ దూరం
సిడ్నీ: తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ జాన్సన్ భారత్‌తో జరిగే నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. గత వారం జరిగిన మూడో టెస్టులో 33 ఏళ్ల జాన్సన్ గాయపడ్డాడు. ఇదే కారణంతో శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లోనూ పాల్గొనలేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈనెల 6 నుంచి సిడ్నీలో జరిగే చివరి టెస్టులో తను పాల్గొనడం లేదని జట్టు ఫిజియోథెరపిస్ట్ అలెక్స్ కౌంటౌరిస్ తెలిపారు. అయితే 16 నుంచి జరిగే ముక్కోణపు సిరీస్‌కు ఫిట్‌గా ఉండే అవకాశం ఉందని చెప్పారు. ప్రపంచకప్‌కు ముందు జాన్సన్ విషయంలో తాము ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదని, అందుకే అతడికి విశ్రాంతినిస్తున్నట్టు కోచ్ లీమన్ స్పష్టం చేశారు. స్టార్క్, సిడిల్లలో ఒకరికి చాన్స్: జాన్సన్ స్థానంలో ఎడమచేతి పేసర్ మిషెల్ స్టార్క్ లేదా పీటర్ సిడిల్లలో ఒకరు జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిద్దరి ఫిట్నెస్ ఆధారంగా ఓ నిర్ణయం తీసుకోనున్నారు. బరిలోకి దిగేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు స్టార్క్ చెప్పాడు. 2011లో తొలి టెస్టు ఆడిన స్టార్క్ జట్టులో చోటును నిలబెట్టుకోలేకపోతున్నాడు. -
సిడ్నీ టెస్టుకు జాన్సన్ దూరం
సిడ్నీ: భారత్‌తో జరిగే చివరి, నాలుగో టెస్టుకు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ దూరమయ్యాడు. గాయం కారణంగా జాన్సన్ ఈ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఈ మ్యాచ్ ఈ నెల 6 నుంచి సిడ్నీలో జరగనుంది. నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆసీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ధోనీ రిటైరవడంతో విరాట్ కోహ్లీ భారత్‌కు సారథ్యం వహించనున్నాడు. -
సిడ్నీ టెస్టుకు జాన్సన్ అనుమానం!
ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టిన పేసర్ సిడ్నీ: తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ జాన్సన్ శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు డుమ్మా కొట్టాడు. దీంతో సిడ్నీలో భారత్‌తో ఈనెల 6న మొదలయ్యే నాలుగో టెస్టులో అతను ఆడటంపై అనుమానం నెలకొంది. నొప్పి ఎక్కువగా ఉండటంతో జట్టుతో పాటు నెట్ ప్రాక్టీస్‌కు వెళ్లొద్దని పేసర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. టెస్టు సమయానికి జాన్సన్ కోలుకోకపోతే అతని స్థానంలో స్టార్క్, సిడిల్లలో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. ‘జాన్సన్ ఫిట్‌నెస్‌పైనే నేను బరిలోకి దిగడం ఆధారపడి ఉంది. ఆడటానికి మాత్రం నేను సిద్ధంగా ఉన్నా. బిగ్‌బాష్‌లో నేను బాగానే బౌలింగ్ చేయగలిగా. అవకాశం వస్తే నాలుగో టెస్టులోనూ అదే విధంగా రాణించాలని కోరుకుంటున్నా. ఏ ఫార్మాట్లోనైనా నా సత్తా మేరకు రాణించేందుకు ప్రయత్నిస్తా’ అని స్టార్క్ పేర్కొన్నాడు. పిచ్‌లు మరీ నెమ్మదిగా ఉన్నాయి: హారిస్ గత యాషెస్ సిరీస్‌తో పోలిస్తే... భారత్‌తో సిరీస్‌కు నెమ్మదైన పిచ్‌లను రూపొందించారని పేసర్ హారిస్ అన్నాడు. బంతులు తక్కువ ఎత్తులో వస్తుండటంతో బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసేందుకు చాలా శ్రమించాల్సి వస్తోందన్నాడు. ‘పిచ్‌లపై బౌన్స్, వేగం లేదు. అయినప్పటికీ తొలి రెండు టెస్టుల్లో ఫలితాలను రాబట్టాం. ఇప్పటికీ మేం కోరుకుంటున్నది ఒక్కటే... పిచ్‌పై కొంత పచ్చిక, బౌన్స్ ఉండాలి’ అని హారిస్ తెలిపాడు. ఆసీస్ అటాక్ అద్భుతంగా ఉన్నప్పటికీ జట్టులో సిడిల్ ఉంటే మరింత బాగుంటుందన్నాడు. ‘సిడిల్‌ను తీసుకోవడమనేది సెలక్టర్ల ఇష్టం. హాజెల్‌వుడ్ బాగా రాణిస్తున్నాడు. మెల్బోర్న్లో మంచి పేస్‌తో ఆకట్టుకున్నాడు. అయితే సిడిల్ అనుభవాన్ని మేం కోల్పోతున్నాం’ అని హారిస్ అన్నాడు. -
భారత్‌కు దూకుడు నేర్పిస్తాడు!
కోహ్లిపై జాన్సన్ ప్రశంస సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా సిరీస్ తొలి మూడు టెస్టుల్లో విరాట్ కోహ్లి తన ఆటతో పాటు గొడవతో కూడా అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా మిషెల్ జాన్సన్‌ను అతను మాటలతో ఎదుర్కొన్న తీరు అందరికీ ఆశ్చర్యం కలిగించింది. మైదానంలో ఎలా స్పందించినా ఇప్పుడు స్వయంగా జాన్సన్‌కు కూడా కోహ్లి శైలి నచ్చినట్లుంది. ఇకపై అతని కెప్టెన్సీలో భారత జట్టు మరింత దూకుడుగా ఉండగలదని జాన్సన్ అభిప్రాయపడ్డాడు. ‘సాధారణంగా భారత జట్టు దూకుడుగా ఆడదు. అయితే ఇప్పుడు కోహ్లి కెప్టెన్సీలో అది మారవచ్చని అనుకుంటున్నాం. ఎందుకంటే నేను కోహ్లిని చూస్తున్న నాటినుంచి అతను ఎప్పుడూ ఇంతే దుడుకుగా వ్యవహరిస్తాడు. ఫీల్డింగ్ పెట్టడం మొదలు చాలా అంశాల్లో ధోనితో పోలిస్తే మీకు ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అతను ఎక్కడా తగ్గడాన్ని ఇష్టపడడు. ప్రత్యర్థి జట్టు ఎవరైనా కోహ్లి తీరులో మార్పు కనిపించదు’ అని జాన్సన్ వ్యాఖ్యానించాడు. వేగం తగ్గించాను... ఏడాది క్రితం యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించిన జాన్సన్ ఈసారి మాత్రం భారత్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అతని బౌలింగ్ వేగం కూడా తగ్గింది. జట్టు అవసరాల కారణంగా సుదీర్ఘ స్పెల్‌లు వేయాల్సి రావడంతో ఇలా జరిగిందని జాన్సన్ చెప్పాడు. ‘చిన్న చిన్న స్పెల్‌లతో నేను ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాను. 150 కిలోమీటర్ల వేగాన్ని ఎక్కువ సేపు కొనసాగించడం అంత సులువు కాదు. అందుకే ఇప్పుడు వేగం తగ్గింది. అయితే సిడ్నీలోనైనా నా తరహాలో చెలరేగేందుకు చిన్న స్పెల్‌లు ఇమ్మని కెప్టెన్, కోచ్‌లను కోరతాను’ అని జాన్సన్ చెప్పాడు. -
ప్రత్యర్థిని భయపెట్టడం అవసరం!
* మాటల యుద్ధం ఎప్పటికీ ఆగదు * మిషెల్ జాన్సన్ వ్యాఖ్య మెల్బోర్న్: బ్రిస్బేన్ టెస్టులో భారత ఓటమిని శాసించిన ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ జాన్సన్ ఏడాది క్రితం ఇంతకంటే ప్రమాదకర ఆటగాడిగా కనిపించాడు. అతని ధాటికి బతుకు జీవుడా... అంటూ ఆడిన ఇంగ్లండ్ 0-5తో యాషెస్ సిరీస్‌ను సమర్పించుకుంది. ప్రత్యర్థిని భయపెడుతూ వికెట్లు తీసే తనదైన శైలి గురించి జాన్సన్ తన మనసులో మాటను వెల్లడించాడు. ‘మిషెల్ జాన్సన్: బౌన్సింగ్ బ్యాక్’ పేరుతో రూపొందిన డీవీడీ విడుదల సందర్భంగా అతను ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ శరీరాలను లక్ష్యంగా చేసుకొని బౌలింగ్ చేయడం కూడా మా యాషెస్ విజయానికి ఒక కారణం. ఆటగాళ్లపైకి దాడి చేసినట్లుగా బౌలింగ్ ఉండాలి. యాషెస్ ఆఖరి టెస్టులో అవుటైన క్షణం ఒక్కసారి గుర్తు చేసుకోండి. ‘హమ్మయ్య... ఇక అయిపోయింది’ అనే ఉపశమనం అతని మొహంలో కనిపించింది. ముఖ్యంపై లోయర్ ఆర్డర్లో భయం పుట్టించాలి’ అని జాన్సన్ చెప్పాడు. మైదానంలో జరిగే మాటల యుద్ధానికి ముగింపు ఎప్పటికీ ఉండదని అతను అన్నాడు. ఏదో ఒక మాటతో ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించాలని అంతా ప్రయత్నిస్తారని, కొన్నిసార్లు అది పని చేస్తే మరికొన్ని సార్లు వ్యతిరేక ఫలితం ఇస్తుందని వ్యాఖ్యానించాడు. ‘కొన్ని సార్లు మేం అర్థంపర్థం లేని మాటలు అంటాం. కానీ కొన్ని సార్లు అవి నేరుగా బ్యాట్స్‌మెన్ మనసుపై ప్రభావం చూపిస్తాయి. నీ పాదాల కదలిక బాగా లేదనో, షార్ట్ బంతి వేస్తున్నామనే చెబితే అతను ఎంత వద్దనుకున్నా దానిపై దృష్టి మళ్లుతుంది. అది బౌలర్‌కు అనుకూలంగా మారుతుంది. ఇది నాకు ఇష్టం. నాకు తెలిసి ఇలాంటి మాటల యుద్ధం ఎప్పటికీ ఆగదు’ అని లెఫ్టార్మ్ పేసర్ అభిప్రాయపడ్డాడు. -
సవాల్‌కు సిద్ధం
అడిలైడ్: ఆస్ట్రేలియా పర్యటనలో ఎదురయ్యే అన్ని సవాళ్లకు సిద్ధంగా ఉన్నామని భారత టెస్టు జట్టు తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. ‘డేంజర్ మ్యాన్’ మిచెల్ జాన్సన్‌ను సమర్థంగా ఎదుర్కొనే సత్తా తమకు ఉందన్నాడు. తాము బాగా సన్నద్ధమయ్యామని, జట్టు మొత్తం సరైన దృక్పథంతో ఉందని చెప్పాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవన్‌తో సోమవారం మొదలయ్యే రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు ముందు కోహ్లి మీడియా సమావేశంలో వెల్లడించిన అంశాలు అతని మాటల్లోనే... పేస్, బౌన్స్: ఇక్కడి వాతావరణ పరిస్థితులను సరైన విధంగా ఉపయోగించుకోవడం కంటే ఆటగాళ్లు సరైన మైండ్‌సెట్ కలిగి ఉండటం ముఖ్యం. ఎందుకంటే పేస్, బౌన్స్ ఎప్పుడూ ఉండేవే. కాబట్టి మనం మానసికంగా దృఢంగా ఉంటే ఎలాంటి ప్రాక్టీస్ అవసరం లేదు. వాస్తవానికి జాన్సన్ బౌలింగ్ అద్భుతంగా ఉంటుంది. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే బౌన్సీ, పేస్ వికెట్లపై అతన్ని ఎదుర్కొనే సత్తా మాకు ఉంది. మేం కూడా గట్టిపోటీ ఇస్తాం. పోటీ ఇవ్వలేమనడానికి ఎలాంటి కారణాలు లేవు. మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాం. మా ప్రణాళికలను సమర్థంగా అమలు చేస్తాం. జట్టుకు నాయకత్వంపై: కెప్టెన్‌గా ఉండటం, జట్టును నడిపించడమంటే నాకు చాలా ఇష్టం. ఈ మ్యాచ్‌లో శుభారంభం చేయాలనుకుంటున్నా. నా ఆలోచలను మ్యాచ్‌లో చూపిస్తా. సవాళ్లను స్వీకరించే సత్తా నాలో ఉంది. జట్టు మొత్తం నాకు మద్దతుగా ఉంది. కాబట్టి మేం కోరుకున్నట్లుగా రాణిస్తాం. ఓవరాల్‌గా మ్యాచ్ చివరి రోజు మంచి ఫలితాన్ని చూస్తాం. క్లార్క్ గాయంపై: కెప్టెన్ కాలిపిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడని తెలిసింది. అయితే గాయం తీవ్రత తెలియకుండా మాట్లాడడం సరైంది కాదు. ఇలాంటి టెస్టు సిరీస్‌కు ముందు గాయపడటం దురదృష్టకరమే. సిడిల్ కూడా బాగా పోటీ ఇస్తాడని తెలుసు. ఈ సిరీస్‌లో మాటల యుద్ధం ఉంటుంది. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రాక్టీస్ మ్యాచ్‌లపై: 2011-12 సిరీస్‌లో ఐదు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరిగినా.... ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రాక్టీస్ మ్యాచ్‌లను సరైన రీతిలో ఉపయోగించుకుంటాం. ఇవి సరిపోతాయి. వికెట్‌పై పేస్, బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తుది జట్టును ఎంపిక చేసుకోవడం చాలా ప్రధానమైంది. గతంతో పోలిస్తే ఈసారి మరింత ఓపికగా ఆడాల్సిన అవసరం ఉంది. సరైన బంతిని, సరైన దిశలో పంపించాలి. బ్యాట్స్‌మెన్ బలం, బలహీనతలకు అనుగుణంగా ఫీల్డింగ్ ఉండాలి. ఓ బ్యాట్స్‌మన్‌గా ఇక్కడ ఆడటం ఆస్వాదిస్తా. గత టూర్లో మాదిరిగా ఈసారి కూడా అభ్యంతకర సంజ్ఞలు ఉంటాయనుకుంటున్నా. మొత్తానికి మేం దూకుడైన క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాం. వాళ్లు కోరుకున్న విధంగా గట్టిపోటీ ఇస్తాం. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో నెగ్గితే మా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. -
పట్టు బిగించిన ఆసీస్
కేప్‌టౌన్: నిర్ణయాత్మక మూడో టెస్టులో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఓవర్‌నైట్ స్కోరు 494/7 వద్దే తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా... మూడో రోజు సోమవారం... దక్షిణాఫ్రికాను 287 పరుగులకే ఆలౌట్ చేసింది. అల్విరో పీటర్సన్ (53), డుప్లెసిస్ (67) అర్ధసెంచరీలు చేసినా... మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో... సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 207 పరుగుల ఆధిక్యాన్ని సమర్పించుకున్నారు. ఆసీస్ పేసర్లలో మిచెల్ జాన్సన్ (4/42), హారిస్ (3/63) అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్యాటిన్సన్ రెండు, వాట్సన్ ఒక వికెట్ పడగొట్టారు. ఆతిథ్య దక్షిణాఫ్రికాను ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా... ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి... వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. వార్నర్ (25 బ్యాటింగ్), రోజర్స్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఆసీస్ ప్రస్తుతం 234 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
దక్షిణాఫ్రికా 140/6
ఆసీస్‌తో తొలి టెస్టు సెంచూరియన్: ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ జాన్సన్ (4/51) చెలరేగడంతో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా తడబడింది. దీంతో సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో... గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 43.3 ఓవర్లలో 6 వికెట్లకు 140 పరుగులు చేసింది. డివిలియర్స్ (52 బ్యాటింగ్), రాబిన్ పీటర్సన్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 297/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 122 ఓవర్లలో 397 పరుగులు చేసి ఆలౌటైంది. స్మిత్ (213 బంతుల్లో 100; 13 ఫోర్లు) సెంచరీ చేశాడు. స్టెయిన్‌కు 4 వికెట్లు దక్కాయి. -
‘మిస్సైల్’ జాన్సన్
అడిలైడ్: కనీసం రెండో టెస్టులోనైనా రాణించి యాషెస్ సిరీస్‌ను సమం చేయాలనుకున్న ఇంగ్లండ్ ఆశలపై ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ (7/40) నీళ్లు చల్లాడు. నిప్పులు చెరిగే బంతులతో కుక్ సేనను వణికించాడు. దీంతో అడిలైడ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌పై క్లార్క్ సేన పట్టు బిగించింది. జాన్సన్ దెబ్బకు శనివారం మూడో రోజు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. దీంతో కంగారూలకు 398 పరుగుల ఆధిక్యం లభించింది. బెల్ (72 నాటౌట్), కార్‌బెరీ (60) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఇంగ్లండ్‌ను ఫాలోఆన్ ఆడించే అవకాశం వచ్చినప్పటికీ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడానికే మొగ్గుచూపింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 39 ఓవర్లలో 3 వికెట్లకు 132 పరుగులు చేసింది. ఓవరాల్‌గా ఆస్ట్రేలియా 530 పరుగుల ఆధిక్యంలో ఉంది. వార్నర్ (83 బ్యాటింగ్), స్మిత్ (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 35/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో రూట్ (15), పీటర్సన్ (4) వెంటనే అవుటయ్యారు. కార్‌బెరీ, బెల్ నిలకడగా ఆడుతూ నాలుగో వికెట్‌కు 45 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశారు. అయితే జాన్సన్ బంతులకు మిడిల్, లోయర్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. బెల్ క్రీజులో నిలదొక్కుకున్నా... రెండోఎండ్‌లో ఆసీస్ పేసర్ వరుస పెట్టి వికెట్లు తీస్తూ పోయాడు. దీంతో ఇంగ్లండ్ 61 పరుగులకు చివరి 7 వికెట్లు కోల్పోయింది. లియోన్, సిడిల్, వాట్సన్ తలా ఓ వికెట్ తీశారు. -
చెలరేగిన జాన్సన్
బ్రిస్బేన్: పేసర్ మిషెల్ జాన్సన్ బంతితో రాణించి యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు ఆధిక్యం అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 52.4 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ కార్బెర్రీ (113 బంతుల్లో 40; 4 ఫోర్లు)టాప్ స్కోరర్. జాన్సన్ నాలుగు, హారిస్ మూడు వికెట్లు తీశారు. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌటైంది. బ్రాడ్ హాడిన్ (153 బంతుల్లో 94; 8 ఫోర్లు; 1 సిక్స్) సెంచరీని కోల్పోయాడు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఆసీస్ వికెట్ నష్టపోకుండా 22 ఓవర్లలో 65 పరుగులు చేసింది. క్రీజులో రోజర్స్ (15), వార్నర్ (45) ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 159 కలుపుకుని ఆసీస్ 224 పరుగుల ఆధిక్యంలో ఉంది.