Legends League Cricket 2022: Mitchell Johnson Finds Snake In Lucknow Hotel Room - Sakshi
Sakshi News home page

LLC 2022: మిచెల్ జాన్సన్‌కు వింత అనుభవం.. హోటల్ గదిలో పాము!

Published Mon, Sep 19 2022 7:37 PM | Last Updated on Mon, Sep 19 2022 8:00 PM

Mitchell Johnson on finding snake in hotel room - Sakshi

భారత్‌ వేదికగా జరుగుతోన్న లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ సెకెండ్‌ సీజన్‌ ఉత్కంఠ భరితంగా జరుగుతోంది. ఈ టోర్నీలో మొత్తం నాలుగు జట్లు పాల్గొంటున్నాయి. అదే విధంగా ఈ లీగ్‌లో వివిధ దేశాలకు చెందిన క్రికెట్‌ దిగ్గజాలు భాగమై ఉన్నారు. కాగా ఈ లీగ్‌లో ఆడుతున్న ఆస్ట్రేలియా మాజీ బౌలర్‌ మిచెల్ జాన్సన్‌కు ఓ వింత అనుభవం ఎదురైంది.

ఈ ఈవెంట్‌లో జాన్సన్‌ ఇండియా క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో కోల్‌కతాలో తన బస చేస్తున్న హోటల్ గదిలో పాము ప్రత్యక్షమైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను జాన్సన్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశాడు.

ఆ ఫోటోకు " ఇది ఏ జాతికి చెందిన పాము..ఎవరికైనా తెలుసా? నా గది తలుపుకు  వేలాడుతున్నాను" అని క్యాప్షన్‌గా అతడు పెట్టాడు. ఇక ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌ ఆడిన జాన్సన్‌ ఒక్క వికెట్‌ పడగొట్టాడు. గుజరాత్‌ జైయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ వికెట్‌ను జాన్సన్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.


చదవండిT20 World Cup 2022: ప్రపంచకప్‌లో షాహీన్ అఫ్రిది ఆడకూడదు: పాక్‌ మాజీ ఆటగాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement