300 వికెట్ల క్లబ్ లో మిచెల్ జాన్సన్ | Mitchell Johnson joins Australian 300 test wicket club in style | Sakshi
Sakshi News home page

300 వికెట్ల క్లబ్ లో మిచెల్ జాన్సన్

Published Thu, Jul 30 2015 6:47 PM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM

300 వికెట్ల క్లబ్ లో మిచెల్ జాన్సన్

300 వికెట్ల క్లబ్ లో మిచెల్ జాన్సన్

బర్మింగ్ హామ్: ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ టెస్టులో 300 వికెట్ల క్లబ్ లో చేరాడు. యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో అతడు ఈ ఘనత సాధించాడు. బారిస్టో వికెట్ పడగొట్టి టెస్టుల్లో 300 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన ఐదో ఆస్ట్రేలియా బౌలర్ గా గుర్తింపు పొందాడు. మిచెల్ జాన్సన్ కంటే ముందు డెన్నీస్ లిల్లీ, షేన్ వార్న్, గ్లెన్ మెక్ గ్రాత్, బ్రెట్ లీ 300 వికెట్లు పడగొట్టిన ఘనత సాధించారు.

టెస్టుల్లో 2 వేల పరుగులు, 300 వికెట్లు పడగొట్టిన రెండో ఆస్ట్రేలియన్ ప్లేయర్ జాన్సన్. అంతకుముందు షేన్ వార్న్ ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ జాన్సన్ కు 69వది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement