స్వదేశంలో పాకిస్తాన్‌తో జరగనున్న టెస్టు సిరీస్ అనంతరం టెస్టు క్రికెట్‌కు ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ఇదివరకే తన నిర్ణయాన్ని వార్నర్ వెల్లడించాడు. పెర్త్ వేదికగా తొలి టెస్టుకు తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో వార్నర్‌కు చోటు దక్కింది.
ఈ క్రమంలో వార్నర్ ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఘనంగా విడ్కోలు పలకడానికి వార్నర్ అర్హడు కాదని జాన్సన్ అభిప్రాయపడ్డాడు. కాగా 2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా బాల్ టాంపరింగ్ వివాదంలో డేవిడ్ వార్నర్ చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతడిపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించింది. ఇదే విషయాన్ని మరోసారి టార్గెట్ చేస్తూ వార్నర్‌పై జాన్సన్ విమర్శలు గుప్పించాడు.
"డేవిడ్ వార్నర్‌కు వీడ్కోలు పలికేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సిద్దమవుతోంది. టెస్టు క్రికెట్‌లో ఓపెనర్‌గా దారుణంగా విఫలమవుతున్న అతడికి తన రిటైర్మెంట్ తేదీని తనే నామినేట్ చేసే అవకాశమెందుకు ఇచ్చారు..? ఆస్ట్రేలియన్ క్రికెట్ చరిత్రలో అతిపెద్ద కుంభకోణంలో నిలిచిన ఒక ఆటగాడిని హీరోగా విడ్కోలు పలకడానికి ఎందుకు సిద్దమవుతున్నారు అంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై జాన్సన్ ప్రశ్నల వర్షం కురిపించాడు.
తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియాన్, మిచ్ మార్ష్, లాన్స్ మోరిస్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్
చదవండి: పాకిస్తాన్ క్రికెట్‌లో మరో కీలక పరిణామం.. సల్మాన్ భట్‌పై వేటు
Comments
Please login to add a commentAdd a comment