బౌండరీ లైన్‌ నుంచి రాకెట్‌ త్రో! | Mitchell Johnson Stuns Even Himself With This Wonder Throw From The Deep | Sakshi
Sakshi News home page

బౌండరీ లైన్‌ నుంచి రాకెట్‌ త్రో!

Published Fri, Dec 15 2017 2:21 PM | Last Updated on Fri, Dec 15 2017 4:07 PM

Mitchell Johnson Stuns Even Himself With This Wonder Throw From The Deep - Sakshi

పెర్త్‌:  మిచెల్‌ జాన్సన్‌.. 2013-14 యాషెస్‌ సిరీస్‌ను ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను బెంబేలెత్తించిన జాన్సన్‌ మూడు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులతో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఇంగ్లండ్‌ జట్టు అంటేనే పూనకం వచ్చే జాన్సన్‌.. తాజాగా మరోసారి ఇంగ్లిష్‌ జట్టుకు షాకిచ్చాడు. ఈసారి వరుస వికెట్లతో కాదు.. ఓ అద్బుతమైన రనౌట్‌తో ఇంగ్లండ్‌ జట్టును ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అయితే జాన్సన్‌ ఇలా మెరిసింది యాషెస్‌ సిరీస్‌లో కాదు.. దేశవాళీ టోర్నమెంట్‌లో.

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు దూరంగా ఉంటున్న జాన్సన్‌..  ఆసీస్‌ దేశవాళీ లీగ్‌ల్లో ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరిగిన  ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో జాన్సన్‌ బౌండరీ లైన్‌ వద్ద నుంచే త్రో విసిరి వికెట్లను పడగొట్టాడు. తొలుత బౌండరీకి వెళ్లకుండా బంతిని ఆపిన జాన్సన్‌..ఆపై నేరుగా ఆ బంతిని నాన్‌ స్టైకర్‌ వైపు విసిరాడు. అది కాస్త వికెట్లను తాకడంతో డామ్‌ బెస్‌ రనౌట్‌గా నిష్క్రమించాడు. ప్రస్తుతం జాన్సన్‌ విసిరిన త్రో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement