బ్రిస్బేన్: పేసర్ మిషెల్ జాన్సన్ బంతితో రాణించి యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు ఆధిక్యం అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 52.4 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ కార్‌బెర్రీ (113 బంతుల్లో 40; 4 ఫోర్లు)టాప్ స్కోరర్.
జాన్సన్ నాలుగు, హారిస్ మూడు వికెట్లు తీశారు. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌటైంది. బ్రాడ్ హాడిన్ (153 బంతుల్లో 94; 8 ఫోర్లు; 1 సిక్స్) సెంచరీని కోల్పోయాడు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఆసీస్ వికెట్ నష్టపోకుండా 22 ఓవర్లలో 65 పరుగులు చేసింది. క్రీజులో రోజర్స్ (15), వార్నర్ (45) ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 159 కలుపుకుని ఆసీస్ 224 పరుగుల ఆధిక్యంలో ఉంది.
చెలరేగిన జాన్సన్
Published Sat, Nov 23 2013 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM
Advertisement
Advertisement