
రోజర్స్ బతికిపోయాడు..
లార్డ్స్: ఆస్ట్రేలియా ఓపెనర్ క్రిస్ రోజర్స్ అదృష్టం బాగుంది. ఇంగ్లండ్‌తో యాషెస్ రెండో టెస్టు రెండో రోజు ఆటలోని తొలి బంతికే తన మెడ వెనుక భాగంలో పేసర్ అండర్సన్ వేసిన బంతి గట్టిగా తగిలింది.
ఈ బంతిని తప్పించుకునే క్రమంలో తల పక్కకి తిప్పుకున్నా హెల్మెట్ వెనుక కింది భాగంలో తగిలింది. అయితే సరికొత్త రీతిలో తయారైన ఈ హెల్మెట్ పూర్తి రక్షణాత్మకంగా ఉండడంతో దెబ్బ నుంచి తప్పించుకున్నాడు. సరిగ్గా ఇదే తరహాలో బంతి తగిలి ఆసీస్ ఆటగాడు ఫిల్ హ్యూస్ మైదానంలో ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే.