ఆస్ట్రేలియా 273/5 | Australia 273/5 | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా 273/5

Published Fri, Dec 6 2013 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM

Australia 273/5

అడిలైడ్: బ్యాట్స్‌మెన్ బాధ్యతా యుతంగా ఆడటంతో ఇంగ్లండ్ తో గురువారం మొదలైన యాషెస్ సిరీస్ రెండో టెస్టు తొలి రోజు ఆస్ట్రేలియా గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 91 ఓవర్లలో 5 వికెట్లకు 273 పరుగులు చేసింది. క్లార్క్ (48 బ్యాటింగ్), హాడిన్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
 
 అంతకుముందు రోజర్స్ (167 బంతుల్లో 11 ఫోర్లతో 72), వాట్సన్ (119 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 51) నిలకడగా ఆడి రెండో వికెట్‌కు 121 పరుగులు జోడించారు. చివరి సెషన్‌లో బెయిలీ (93 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53) దూకుడుగా ఆడాడు. 10 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను పనేసర్ వదిలేయడంతో బయటపడిన బెయిలీ ఆ తర్వాత బ్యాట్ ఝుళిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్ 2, అండర్సన్, స్వాన్, పనేసర్ తలా ఓ వికెట్ తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement