Ashes 2nd Test: Josh Tongue replaces Moeen Ali as England announces playing xi - Sakshi
Sakshi News home page

Ashes 2nd Test: తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్‌.. అనుకున్న విధంగానే ఓ మార్పు

Published Wed, Jun 28 2023 12:49 PM | Last Updated on Wed, Jun 28 2023 1:29 PM

Ashes 2nd Test: Josh Tongue Into England Squad In Place Of Moeen Ali - Sakshi

ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య యాషెస్‌ సిరీస్‌ 2023లో భాగంగా ఇవాల్టి నుంచి (జూన్‌ 28) ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానం వేదికగా రెండో టెస్ట్‌ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇంగ్లండ్‌ తమ తుది జట్టును ప్రకటించింది. ముందుగా అనుకున్న విధంగానే మేనేజ్‌మెంట్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీని తప్పించింది. అతని స్థానంలో యువ పేసర్‌ జోష్‌ టంగ్‌ తుది జట్టులోకి వచ్చాడు. ఈ ఒక్క మార్పు మినహాయించి తొలి టెస్ట్‌ ఆడిన జట్టునే ఇంగ్లీష్‌ మేనేజ్‌మెంట్‌ యధాతథంగా కొనసాగించింది. ఆసీస్‌.. తమ తుది జట్టును ప్రకటించాల్సి ఉంది. భారతకాలమానం ప్రకారం మ్యాచ్‌ 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.

కాగా, మొయిన్‌ అలీ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన టంగ్‌.. ఇటీవలే టెస్ట్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. యాషెస్‌ సిరీస్‌కు ముందు ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌ ద్వారా టంగ్‌ టెస్ట్‌ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో టంగ్‌ 5 వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్ట్‌ ఓటమి నేపథ్యంలో ఇంగ్లండ్‌ పూర్తిగా పేస్‌ అటాక్‌తోనే బరిలోకి దిగనుంది.

ఇదిలా ఉంటే, యాషెస్‌ సిరీస్‌ 2023 తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ అప్రోచ్‌ అంటూ బొక్కబోర్లా పడింది. స్వయంకృతాపరాధంగానే ఆ జట్టు ఓడింది. తొలి ఇన్నింగ్స్‌లో మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉన్నా ఆ జట్టు ఓవరాక్షన్‌ చేసి చేతులుకాల్చుకుంది. మరి ఈ మ్యాచ్‌లో అయిన ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడుతుందో లేక మరోసారి బజ్‌బాల్‌ అంటూ హడావుడి చేస్తుందో వేచి చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement