లార్డ్స్ వేదికగా జరిగిన యాషెస్ రెండో టెస్టులో 43 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 అధిక్యంలోకి ఆసీస్ దూసుకెళ్లింది. 371 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 327 పరుగులకు ఆలౌటైంది.
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(155) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. తన జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. 114/4 వద్ద ఐదో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లడ్ జట్టు అదనంగా మరో 213 పరుగులు చేసి ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో స్టోక్స్‌తో పాటు బెన్ డకెట్(83) రాణించాడు.
ఇక ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్, హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ తలా 3 వికెట్లు సాధించగా.. గ్రీన్ ఒక్క వికెట్ పడగొట్టాడు. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకి ఆలౌట్ కాగా ఇంగ్లండ్ 325 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న ఆస్ట్రేలియా, రెండో ఇన్నింగ్స్‌లో 279 పరుగులకి ఆలౌట్ అయ్యింది. దీంతో ఇంగ్లండ్ ముందు 371 లక్ష్యాన్ని ఆసీస్ ఉంచింది. ఇక ఇరు జట్లు మధ్య మూడో టెస్టు జూలై 6 నుంచి లీడ్స్ వేదికగా జరగనుంది.
చదవండి: Ashes 2023: నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం.. వాళ్లు ఛీటర్స్! ఆస్ట్రేలియాకు ఇది అలవాటే
Comments
Please login to add a commentAdd a comment