Tim Paine Comments On England Key Players: ఇంగ్లండ్ ఆటగాళ్లపై ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ కీలక వాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు లేకపోయినా ఈ ఏడాది యాషెస్ సిరీస్ తప్పక జరుగుతుందని అతడు తెలిపాడు. ఈ వారంలోపు యాషెస్‌లో పాల్గోనే జట్టును ఇంగ్లండ్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు పైన్ వెల్లడించాడు. కాగా ఇటీవల కాలంలో ఇంగ్లండ్ అగ్రశ్రేణి ఆటగాళ్లు కెప్టెన్ జో రూట్, జోస్ బట్లర్, జేమ్స్ ఆండర్సన్ బయో-బబుల్ ఆంక్షలను సడలించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అయితే వీళ్ల అభ్యర్ధను అసీస్ ప్రభుత్వం నిరాకరించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన టిమ్ పైన్ ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ తీరుపై పెదవి విరిచాడు.
"వాళ్లు ఇక్కడికి రావడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎవరూ మిమ్మల్ని రమ్మని బలవంతం చేయడం లేదు. మీరు రాకూడదనుకుంటే, రాకండి. అయినా యాషెస్ సీరీస్ ముందుకు వెళ్తోంది. మొదటి టెస్ట్ డిసెంబర్ 8 న జరుగుతుంది. జో రూట్ ఇక్కడ ఉన్నా లేకపోయినా, జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇక్కడకు వస్తారు అనుకుంటున్నా. మేం మెరుగైన సౌకర్యాలే కల్పిస్తాం. ఎందుకంటే మీతో పాటు మేం కూడా అవే నిబంధనలు(బయో బబుల్) పాటించాలి కదా " అని టిమ్ పైన్ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది డిసెంబర్‌లో ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. రెండు దేశాల మధ్య ప్రసిద్ధ యాషెస్ సిరీస్ జరగనుంది. అయితే అంతకు ముందు సిరీస్‌కు వ్యతిరేకంగా ఇంగ్లీష్ ఆటగాళ్లు తిరుగుబాటు మొదలు పెట్టడంతో యాషెస్ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
చదవండి:Chris Gayle: అందుకే నేను తప్పుకొంటున్నా...
Comments
Please login to add a commentAdd a comment