Australia vs England 4th Ashes Test: Ben Stokes Survives as Ball Hits the Stumps but Fails to Dislodge the Bails - Sakshi
Sakshi News home page

Viral: ఏందయ్యా ఇది.. స్టంప్స్ తాకినా బెయిల్స్ కదల్లా.. స్టోక్స్ బచాయించాడు పో!

Published Fri, Jan 7 2022 12:54 PM | Last Updated on Fri, Jan 7 2022 4:11 PM

Ben Stokes survives as ball hits the stumps but fails to dislodge the bails - Sakshi

సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో యాషెస్‌ టెస్టులో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో 30 వ ఓవర్‌ వేసిన  కామెరాన్ గ్రీన్ బౌలింగ్‌లో..  బెన్‌ స్టోక్స్‌ డిఫెన్స్‌ ఆడడానికి ప్రయత్నించగా బంతి మిస్‌ అయ్యి ప్యాడ్‌ తాకినట్లుగా కీపర్‌ చేతికి వెళ్లింది. ఈ క్రమంలో కీపర్‌తో పాటు బౌలర్‌ అప్పీల్‌ చేయగా అంపైర్ ఔట్‌ అని వేలు పైకెత్తాడు. వెంటనే  స్టోక్స్‌ రివ్యూ తీసుకున్నాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్‌ చోటు చేసుకుంది. రీప్లేలో బంతి నేరుగా ప్యాడ్‌ తాకకుండా, ఆఫ్‌ స్టంప్‌ని తాకింది.

అయితే బంతి స్టంప్స్‌ని తాకినా బెయిల్స్ పడక పోవడం గమనర్హం. కాగా రీప్లేలో అది చూసిన స్టోక్స్‌.. బతికి పోయాను అంటూ గట్టిగా నవ్వాడు. అయితే ఈ సంఘటన మాత్రం ఆసీస్‌ క్రికెటర్లతో పాటు, అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా చివరికి 66 పరుగులు చేసిన స్టోక్స్‌, లయాన్‌ బౌలింగ్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

చదవండి: టీమిండియాకు భారీ షాక్‌.. మూడో టెస్ట్‌కు స్టార్‌ బౌలర్‌ దూరం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement