ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న యాషెస్ రెండో టెస్ట్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్సన్ సన్ గ్లాసెస్ పెట్టుకుని స్పిన్ బౌలింగ్ చేస్తూ అందరనీ ఆశ్చర్యపరుస్తూ స్పిన్ బౌలింగ్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండానే ఇంగ్లండ్ బరిలోకి దిగింది. దీంతో ఆ జట్టు కెప్టెన్ జో రూట్ పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే రూట్ గాయం కారణంగా 4వ రోజు మొదటి సెషన్‌లో ఫీల్డ్‌లోకి రాలేదు. దీంతో రాబిన్సన్ స్పిన్నర్‌గా అవతారం ఎత్తాడు.
స్పిన్ బౌలింగ్ చేసిన రాబిన్సన్‌ను క్రికెట్ దిగ్గజాలు షేన్ వార్న్,స్టీవ్ వా ప్రశంసించారు. ఇక రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా పట్టు బిగిస్తుంది. రెండో ఇన్నింగ్స్‌లో 230-9 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన అధిక్యంతో కలుపుకుని 468 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 473 పరుగుల సాధిచంగా, ఇంగ్లండ్ 236 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 237 పరుగుల ఆధిక్యం ఆసీస్‌కు లభించింది. ఆస్ట్రేలియా విజయానికి 7 వికెట్ల దూరంలో ఉండగా, ఇంగ్లండ్ ఇంకా 391 పరుగులు వెనుకబడి ఉంది, మ్యాచ్ ప్రస్తుతం జరుగుతోంది.
చదవండి: IPL 2022: ఒడిశా ఆటగాడికి బంఫర్ ఆఫర్.. ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్‌కు!
England pacer Ollie Robinson bowling off spin 🤯😂
— CRICKET VIDEOS 🏏 (@AbdullahNeaz) December 19, 2021
#Ashes #Ashes2021pic.twitter.com/ado3C7MC0V
Comments
Please login to add a commentAdd a comment