సిడ్నీ: కొంతకాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ లబ్‌షేన్ కొత్త ఏడాదిని కూడా ఘనంగా ప్రారంభించాడు. గత సంవత్సరం 11 టెస్టులు ఆడి 1104 పరుగులు చేసి ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచిన లబ్‌షేన్... న్యూజిలాండ్‌తో శుక్రవారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆరంభమైన మూడో టెస్టులో అజేయ సెంచరీతో (210 బంతుల్లో 130 బ్యాటింగ్; 12 ఫోర్లు, సిక్స్) చెలరేగాడు. ఇప్పటి వరకు కెరీర్‌లో 14 టెస్టులు ఆడిన లబ్‌షేన్ ఖాతాలో ఇది నాలుగో శతకం కాగా... ఈ నాలుగు గత ఐదు టెస్టుల్లోనే రావడం విశేషం. అతనికి మాజీ సారథి స్టీవ్ స్మిత్ (182 బంతుల్లో 63; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ కూడా తోడవ్వటంతో ఆసీస్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 283 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన ఆ్రస్టేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. బర్న్స్ (18) త్వరగా అవుట్ ఆయ్యాడు. ఈ దశలో వార్నర్ (45; 3 ఫోర్లు)కు జత కలిసిన లబ్‌షేన్ ఇన్నింగ్స్‌ను నిరి్మంచే పనిలో పడ్డాడు. వార్నర్ వెనుదిరిగాక క్రీజులోకొచ్చిన స్మిత్ ఖాతా తెరవడానికి ఏకంగా 39 బంతులు తీసుకున్నాడు. ఖాతా తెరిచాక స్మిత్ తన బ్యాట్‌కు పని చెప్పాడు. ఇదే క్రమంలో కెరీర్‌లో 28వ అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. లబ్õÙన్, స్మిత్ మూడో వికెట్‌కు 156 పరుగులు జోడించారు. ప్రస్తుతం లబ్‌షేన్‌తో పాటు వేడ్ (22 బ్యాటింగ్; 2 ఫోర్లు, సిక్స్) క్రీజులో ఉన్నాడు. ఇప్పటికే ఆసీస్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment