మెల్‌బోర్న్: హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మార్చుకోవడంలో అత్యంత పరిణితి కనబరచే ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్.. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఒక అద్భుతమైన క్యాచ్‌తో వెనుదిరిగాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా కివీస్ పేసర్ నీల్ వాగ్నర్ వేసిన 105వ ఓవర్‌ను ఆడటానికి తీవ్ర ఇబ్బంది పడ్డాడు. కచ్చితమైన లెంగ్త్ డెలవరీలతో పాటు పదునైన బౌన్సర్లతో స్మిత్‌ను వాగ్నర్ హడలెత్తించాడు.
చివరగా ఆ ఓవర్ నాల్గో బంతికి స్మిత్ తడబడ్డాడు. ఆ షార్ట్ పిచ్ బంతిని ఎలా ఆడాలో తెలియక బ్యాట్ అడ్డం పెట్టడంతో అది కాస్తా ఎడ్జ్ తీసుకుంది. ఆ సమయంలో గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్న హెన్రీ నికోలస్ సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్‌ను అందుకోవడం మరొక హైలైట్. గల్లీ నుంచి బంతి వెనక్కి వెళుతున్న సమయంలో గాల్లో డైవ్ కొట్టి మరీ దాన్ని అందుకున్నాడు నికోలస్. కేవలం అది పూర్తిగా చేతిలో పడకపోయినా రెండు వేళ్లతో బంతిని ఒడిసి పట్టుకున్నాడు. దాంతో స్మిత్ ఇన్నింగ్స్ 85 పరుగుల వ‍్యక్తిగత స్కోరు వద్ద ముగిసింది.
257/4 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్..మరో 27 పరుగులు జత చేసిన తర్వాత స్మిత్ వికెట్‌ను కోల్పోయింది. ఇక్కడ స్మిత్ అతని ఓవర్ నైట్ స్కోరుకు మరో 8 పరుగులు మాత్రమే జోడించి ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఇక ట్రావిస్ హెడ్(114) సెంచరీ సాధించగా, కెప్టెన్ టిమ్ పైన్(79) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దాంతో ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగులు చేసింది.
✈ We have takeoff! ✈
— cricket.com.au (@cricketcomau) December 27, 2019
A flying Henry Nicholls takes a screamer in the gully to remove Steve Smith! @bet365_aus | #AUSvNZ pic.twitter.com/SlCDEWXNSY
Comments
Please login to add a commentAdd a comment