సిడ్నీ: ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా జట్టు వరుసగా భారీ విజయాలు నమోదు చేయడంలో లబూషేన్ పాత్రనే కీలకంగా చెప్పాలి. గతేడాది పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన లబూషేన్.. ఈ ఏడాది విశేషంగా రాణించి ఆసీస్ జట్టుకు వెన్నుముకగా మారిపోయాడు. ఇప్పుడు ఆసీస్ అత్యంత పటిష్టంగా మారిందంటే అందుకు లబూషేన్ ఆట కారణం. టెస్టుల్లో 58.05 సగటుతో పాటు హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన అరుదైన ఘనతను కూడా లబూషేన్ సొంతం చేసుకున్నాడు. దాంతో అతని వన్డే అరంగేట్రం షురూ అయ్యింది.
వచ్చే నెలలో భారత పర్యటనలో భాగంగా ఆసీస్ వన్డే జట్టులో లబూషేన్ చోటు దక్కించుకున్నాడు. జనవరి 14వ తేదీ నుంచి భారత్‌తో ఆరంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌లో లబూషేన్‌కు అవకాశం కల్పించారు ఆసీస్ సెలక్టర్లు. ఈ మేరకు 14 మందితో కూడిన జట్టులో లబూషేన్ సునాయసంగా చోటు దక్కించుకున్నాడు. కాగా, మానసిక సమస్యలతో కొన్ని వారాలు క్రికెట్‌కు దూరమై తిరిగి తాను సిద్ధమంటూ ప్రకటించిన ఆసీస్ హార్డ్ హిట్టర్ మ్యాక్స్‌వెల్‌కు చోటు దక్కలేదు. అంతేకాకుండా ఆసీస్ భారీ మార్పులతో భారత పర‍్యటనకు సిద్ధమైంది. టీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో తమ జట్టును పూర్తిగా పరీక్షించడానికి భారత్‌తో ఆడే వన్డే సిరీస్ కీలకంగా భావిస్తోంది సీఏ మేనేజ్‌మెంట్.
దాంతో వన్డే వరల్డ్‌కప్‌లో ఆడిన ఏడుగురు ఆటగాళ్లు.. భారత్‌తో వన్డే సిరీస్‌లో అవకాశం దక్కించుకోలేకపోయారు. వీరిలో మ్యాక్స్‌వెల్‌తో పాటు మార్కస్ స్టోయినిస్, నాథన్ లయన్, ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, కౌల్టర్ నైల్, బెహ్రెన్‌డ్రాఫ్‌లను పక్కన పెట్టింది. అయితే బెహ్రెన్‌డార్ఫ్‌కు గాయం కూడా కావడంతో అతన్ని అసలు పరిశీలించలేదు. కాగా, ఆసీస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ సైతం భారత పర్యటనకు రావడం లేదు. అతని స్థానంలో సీనియర్ అసిస్టెంట్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ జట్టుతో పాటు భారత్‌కు రానున్నాడు.
ఆసీస్ వన్డే జట్టు ఇదే..
అరోన్ ఫించ్(కెప్టెన్), సీన్ అబాట్, అస్టన్ ఆగర్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమ్మిన్స్, హ్యాండ్‌స్కాంబ్, హజిల్‌వుడ్, లబూషేన్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, అస్టన్ టర్నర్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా
Comments
Please login to add a commentAdd a comment