జొహెన్నెస్‌బర్గ్: ట్యాంపరింగ్ వివాదంపై దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్.. ఆసీస్ క్రికెటర్లకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. తమతో మూడో టెస్టు సందర్భంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్ క్రాఫ్ట్‌లు ట్యాంపరింగ్‌కు పాల్పడి నిషేధం గురైన తరుణంలో వారికి డుప్లెసిస్ అండగా నిలిచాడు. గురువారం జొహెన్నెస్‌బర్గ్‌లో మీడియాతో మాట్లాడిన డుప్లెసిస్ స్మిత్‌ను మంచి వ్యక్తిగా అభివర్ణించాడు.
'నా మనసు అంతరాల్లో స్మిత్ గురించి తీవ్ర వేదనకు గురయ్యాను. రానున్న రోజులు స్మిత్‌కు చాలా కష్టంగా ఉంటాయి, అతడు ధైర్యంగా ఉండాలి. క్రికెట్ ఆస్ట్రేలియా ఉన్నత విలువల కోసం స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లపై నిషేధం విధించింది. కానీ ఆ ముగ్గురిపై తీసుకున్న చర్యలు కఠినంగా ఉన్నాయి' అని వారికి డుప్లెసిస్ బాసటగా నిలిచాడు. అయితే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సమయంలో ఒక రింగ్‌టోన్ డు ప్లెసిస్‌ను కలవర పెట్టింది. వాయిస్ రికార్డు చేసే క్రమంలో టేబుల్‌పై ఉన్న జర్నలిస్టు మొబైల్‌కు ఒక కాల్ వచ్చింది. అయితే ఆ ఫోన్ రింగ్‌టోన్ కాస్త వెరైటీగా ఉండటంతో డుప్లెసిస్‌కు కాసేపు అర్ధం కాలేదు. ఆ తర్వాత అది ఫోన్ రింగ్‌టోన్ అని తెలుసుకున్న డుప్లెసిస్ నవ్వుకున్నాడు. కాసేపు ఆ మూడ్‌లోనే ఉండిపోయిన డుప్లెసిస్ దానికి ‘షాకింగ్ రింగ్ టోన్’గా నామకరణం చేశాడు. ఆపై డు ప్లెసిస్ తిరిగి మీడియా సభ్యులతో సమావేశం కొనసాగించాడు.
Comments
Please login to add a commentAdd a comment