అడిలైడ్ : ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో స్మిత్ సేన విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంది. కేవలం మూడు బంతుల తేడాలోనే రెండు రివ్యూలను కోల్పోయింది. దీంతో ఈ విపత్కర పరిస్థితి ఎదుర్కొన్న తొలి జట్టుగా నిలిచింది.
కమిన్స్ వేసిన 42 ఓవర్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ విషయంలో తొలి రివ్యూను కోల్పోయిన ఆసీస్, డేవిడ్ మాలన్ విషయంలో రెండోసారి తప్పులో కాలేసి రివ్యూను కోల్పోయింది. ఒకటి క్యాచ్ అవుట్ కోసం.. మరొకటి ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూ కోరగా అంపైర్ అలీమ్‌దార్ నౌటౌట్‌గా ప్రకటించడంతో రెండు రివ్యూల అవకాశం కోల్పోయింది.
గతంలో ప్రతీ 80 ఓవర్లకు రెండు రివ్యూలును అదనంగా ఇచ్చేలా నిబంధనలు ఉండగా, ప్రస్తుతం ఇన్నింగ్స్ మొత్తం రెండే రివ్యూలు ఉండడం ఆసీస్‌ను దెబ్బతీసింది. కేవలం మూడు బంతుల్లోనూ రెండింటినీ కోల్పోయింది. క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment