England-Australia
-
‘నా జీవితంలోనే అత్యంత కఠినమైన రోజు’
నాటింగ్‌హామ్ : ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన వన్డేలో 242 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టిమ్ పెయిన్ సేన దారుణంగా విఫలమైన నేపథ్యంలో వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది. ఆసీస్ భారీ ఓటమిపై కెప్టెన్ టిమ్ పెయిన్ మాట్లాడుతూ.. ‘చిన్ననాటి నుంచే క్రికెట్ ఆడుతున్నాను. కానీ ఈరోజు(మంగళవారం) నా జీవితంలో అత్యంత కఠినమైన రోజు. మా ప్రయత్నాలేవీ ఫలించలేదు. కానీ వాళ్లు(ఇంగ్లండ్) మాపై సునాయాసంగా పైచేయి సాధించారు. మా మెడపై కత్తి పెట్టినంత పని చేశారు. ఈ రోజు ఆటలో మేము చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోయాం. మా ప్రణాళికను అమలు చేయడంలో కొంచెం కూడా సఫలం కాలేకపోయామని’ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ చెత్త ప్రదర్శన నుంచి పాఠాలు నేర్చుకుంటున్నామన్న టిమ్.. ఓటమి కూడా ఒక్కోసారి మంచి చేస్తుందని.. తమకు ఇదొక ఒక కనువిప్పులాంటిదని వ్యాఖ్యానించాడు. రాబోయే మ్యాచ్‌లలో తమ వ్యూహాలను పక్కాగా అమలు చేసి గెలుపొందుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా మ్యాచ్ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇంగ్లండ్ జట్టు మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగానే 5 వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. -
‘వాట్ ద హెల్.. అసలేం జరుగుతోంది’
ఆస్ట్రేలియా క్రికెట్ పరువు తీసారంటూ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న ఆసీస్ జట్టుపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన డే- నైట్ వన్డేలో 242 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టిమ్ పెయిన్ సేన దారుణంగా విఫలమైన నేపథ్యంలో ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసీస్ వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త ప్రదర్శన కావడంతో ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజం షేన్‌వార్న్... ‘ఇప్పుడే నిద్ర లేచాను. ఇంగ్లండ్ స్కోరు చూశాను. అసలు అక్కడ ఏం జరుగుతోంది. వాట్ ద హెల్ అంటూ’ ట్వీట్ చేశాడు. ఇక ఆసీస్ మాజీ సారథి మైకేల్ క్లార్క్ కూడా ట్విటర్ వేదికగా తమ జట్టు ప్రదర్శనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కాగా 1986లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 206 పరుగులతో ఓడిన ఆసీస్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో ఆ రికార్డును అధిగమించి మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. Just woke up and saw the score in England. What the hell happened over there & what is going on boys ? Gulp..... — Shane Warne (@ShaneWarne) June 19, 2018 Morning 🏏🤦♂️ — Michael Clarke (@MClarke23) June 19, 2018 -
వన్డే క్రికెట్లో పెను సంచలనం.!
నాటింగ్‌హామ్: 50 ఓవర్లలో 41 ఫోర్లు, 21 సిక్సర్లతో ఏకంగా 481 పరుగులు... ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సొంతగడ్డపై సృష్టించిన వీర విధ్వంసం ఇది. ఆస్ట్రేలియాపై సునామీలా విరుచుకుపడిన మోర్గాన్ సేన వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మంగళవారం జరిగిన డే–నైట్ మూడో వన్డేలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 481 పరుగులు చేసింది. ఫలితంగా ఇప్పటి వరకు తమ పేరిటే ఉన్న 444 పరుగుల (2016లో పాకిస్తాన్‌పై) రికార్డును తుడిచి పెట్టింది. అలెక్స్ హేల్స్ (92 బంతుల్లో 147; 16 ఫోర్లు, 5 సిక్సర్లు), జాన్ బెయిర్‌స్టో (92 బంతుల్లో 139; 15 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకాలతో విరుచుకు పడగా... జేసన్ రాయ్ (61 బంతుల్లో 82; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇయాన్ మోర్గాన్ (30 బంతుల్లో 67; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో తమ వంతు పాత్ర పోషించారు. మ్యాచ్‌లో మూడు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు కావడం విశేషం. ఇంగ్లండ్ ధాటికి ఆసీస్ బౌలర్లలో టై అత్యధికంగా 100 పరుగులు సమర్పించుకోగా, రిచర్డ్సన్ 92, స్టొయినిస్ 85 పరుగులు ఇచ్చారు. 46 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 450 వద్ద నిలిచింది. బ్యాటింగ్ జోరు చూస్తే స్కోరు 500 పరుగులు దాటుతుందని అనిపించింది. అయితే చివరి నాలుగు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా లేకుండా 31 పరుగులు మాత్రమే ఇచ్చిన ఆసీస్... వరుస బంతుల్లో హేల్స్, మోర్గాన్ వికెట్లు కూడా తీయడంతో స్కోరు 481కే పరిమితమైంది. 482 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రషిద్ (4/47) దెబ్బకు 239 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాటింగ్‌లో ట్రావిస్ హెడ్ (51), స్టోయినీస్ (44)లు టాప్ స్కోరర్లుగా నిలిచారు. 5 వన్డేల సిరీస్‌లో 3-0తో ఇంగ్లండ్ సిరీస్ కైవసం చేసుకుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
యాషెస్ సిరీస్: రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఘనవిజయం
అడిలైడ్ : యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 5 మ్యాచుల సిరీస్‌లో 2-0తో స్మిత్ సేన ఆధిక్యం సాధించింది. అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం ఆసీస్‌నే వరించింది. 442/8 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా 138 పరుగులకే కుప్పకూలింది. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 227 ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఆసీస్ 120 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 138 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్‌కు కేవలం 354 పరుగుల లక్ష్యమే ఏర్పడింది. కానీ మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు. దీంతో ఆసీస్ విజయం సులువైంది. -
క్రికెట్ చరిత్రలోనే తొలి సారి..!
అడిలైడ్ : ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో స్మిత్ సేన విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంది. కేవలం మూడు బంతుల తేడాలోనే రెండు రివ్యూలను కోల్పోయింది. దీంతో ఈ విపత్కర పరిస్థితి ఎదుర్కొన్న తొలి జట్టుగా నిలిచింది. కమిన్స్ వేసిన 42 ఓవర్లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ విషయంలో తొలి రివ్యూను కోల్పోయిన ఆసీస్, డేవిడ్ మాలన్ విషయంలో రెండోసారి తప్పులో కాలేసి రివ్యూను కోల్పోయింది. ఒకటి క్యాచ్ అవుట్ కోసం.. మరొకటి ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూ కోరగా అంపైర్ అలీమ్‌దార్ నౌటౌట్‌గా ప్రకటించడంతో రెండు రివ్యూల అవకాశం కోల్పోయింది. గతంలో ప్రతీ 80 ఓవర్లకు రెండు రివ్యూలును అదనంగా ఇచ్చేలా నిబంధనలు ఉండగా, ప్రస్తుతం ఇన్నింగ్స్ మొత్తం రెండే రివ్యూలు ఉండడం ఆసీస్‌ను దెబ్బతీసింది. కేవలం మూడు బంతుల్లోనూ రెండింటినీ కోల్పోయింది. క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. -
చావో రేవో తేల్చుకుంటాం: స్మిత్
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ తో జరిగే చావో రేవో మ్యాచ్‌కు సిద్దంగా ఉన్నామని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. టోర్నీలో ఆసీస్ ఆడిన రెండు మ్యాచ్‌లు వర్షంతో రద్దవ్వడంతో ఆసీస్‌కు క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. గ్రూప్-ఏ లో మిగిలిన ఇంగ్లండ్ మ్యాచ్ చావో రేవో అన్నట్లుగా మారింది.రెండు పాయింట్లతో ఉన్న ఆసీస్ టోర్నీ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పని సరిగా గెలవాల్సిందే. ఆడిన రెండు మ్యాచుల్లో ఆసీస్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే వర్షం ఆటంకం కలిగించడంతో స్మిత్ అసహనం వ్యక్తం చేశాడు. శనివారం ఇంగ్లండ్ తో జరిగే మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు రాణిస్తారని స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌ను ఎదుర్కోనేందుకు తమ ఆటగాళ్లు సిద్దంగా ఉన్నారని, బౌలింగ్, బ్యాటింగ్ విభాగం బలంగా ఉందని స్మిత్ నొక్కి చెప్పాడు. మా జట్టు ఆటగాళ్లు గత కొద్ది రోజులుగా మంచి క్రికెట్ ఆడారని, ఐపీఎల్ లాంటి టోర్నిలతో ఫామ్‌లోకి వచ్చారని, ఇదే మా జట్టును ముందుకు తీసుకువెళ్తుందని స్మిత్ వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్ మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్లు రాణించారని, ఇదే ఊపుతో ఇంగ్లండ్‌పై విజయం సాధిస్తామన్నాడు.బంగ్లాపై 4 వికెట్లు తీసిన స్టార్క్‌ను స్మిత్ కొనియాడాడు.