కోహ్లి.. నువ్వు చేసిందేం బాలేదు! | Virat Kohlis Gesture After my Dismissal Was Not Required, says Steven Smith | Sakshi

కోహ్లి.. నువ్వు చేసిందేం బాలేదు!

Published Sat, Jan 30 2016 1:45 PM | Last Updated on Sun, Sep 3 2017 4:38 PM

కోహ్లి.. నువ్వు చేసిందేం బాలేదు!

కోహ్లి.. నువ్వు చేసిందేం బాలేదు!

అడిలైడ్‌లో జరిగిన మొదటి ట్వంటీ-20 మ్యాచ్‌ సందర్భంగా భారత క్రికెటర్ విరాట్‌ కోహ్లితో తనకు జరిగిన మాటల యుద్ధంపై ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవెన్ స్మిత్‌ తాజాగా స్పందించాడు.

మెల్‌బోర్న్‌: అడిలైడ్‌లో జరిగిన మొదటి ట్వంటీ-20 మ్యాచ్‌ సందర్భంగా భారత క్రికెటర్ విరాట్‌ కోహ్లితో తనకు జరిగిన మాటల యుద్ధంపై  ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవెన్ స్మిత్‌ తాజాగా స్పందించాడు. మ్యాచ్‌లో తన పట్ల కోహ్లి తీరు ఏం బాలేదని పేర్కొన్నాడు. మ్యాచ్‌ కొనసాగుతుండగా మైదానంలో బ్యాటింగ్ చేస్తున్న స్మిత్‌ కాసేపు టీవీ కామెంటేటర్లతో లైవ్‌గా ముచ్చటించాడు. ఆ వెంటనే అతను కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో పెవిలియన్ దిశగా వెళ్తున్న స్మిత్‌తో కోహ్లికి సంవాదం జరిగింది.

'కోహ్లి చాలా అల్పంగా భావోద్వేగాలను ప్రదర్శించాడు. ఎవరైనా ఔటైనా సందర్భంలో అలా స్పందించాల్సిన అవసరం లేదేమో. ఎవరైనా ఔటైతే కొంతవరకు ఎగతాళి చేయవచ్చేమో కానీ ఇలా ప్రవర్తించడం సరికాదు' అంటూ స్మిత్ కోహ్లిపై మండిపడ్డాడు. టీవీ కామెంటేటర్లతో లైవ్‌గా మాట్లాడటం వల్లే స్మిత్ ఔటైనట్టు ఆయన అభిమానులు భావిస్తుండగా స్మిత్‌ మాత్రం దానిని కొట్టిపారేశాడు. షాట్ సెలెక్షన్‌లో పొరపాటు వల్లే తాను ఔటయ్యానని చెప్పాడు.

నిజానికి మైదానంలో టీవీ కామెంటేటర్లతో స్మిత్‌ లైవ్ ముచ్చటించడంతో చిరాకుపడ్డటు కనిపించిన కోహ్లి అతనికి సెండాఫ్ ఇచ్చినట్టు వ్యవహరించాడు. అయితే భారత యువబౌలర్ల పట్ల స్మిత్ దురుసు వ్యాఖ్యలు చేయడంతోనే అతనితో సంవాదం పెట్టుకున్నానని, అతని వద్ద లైవ్ మైక్ ఉన్న విషయం కూడా తనకు తెలియదని కోహ్లి వివరణ ఇచ్చాడు. కాగా, స్మిత్ ఔటయ్యేందుకు కారణమైన ఈ లెటెస్ట్‌ టెక్నాలజీపై క్రికెట్ దిగ్గజాలు మండిపడుతున్నారు. మ్యాచ్ మధ్యలో టీవీ కామెంటేటర్లతో మాట్లాడే ఈ పద్ధతి క్రికెట్‌ను ధంస్వం చేస్తోందని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement