
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఘనమైన పునరాగమనం చేశాడు. నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో జడేజా అదరగొట్టాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లు వేసిన జడ్డూ 47 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ను జడేజా ఔట్ చేసిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
అప్పటికే క్రీజులో పాతుకుపోవడానికి ప్రయత్నిస్తున్న స్మిత్‌ను అద్భుతమైన బంతితో స్మిత్ బోల్తా కొట్టించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 42 ఓవర్‌లో జడేజా వేసిన ఆఖరి బంతికి స్మిత్ ఢిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే ఆఫ్‌సైడ్ పడిన బంతి ఒక్కసారిగా టర్న్ అయ్యి స్మిత్ బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి స్టంప్స్‌ను గిరాటేసింది.
దీంతో స్మిత్ ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు. కాసేపు క్రీజులోనే అలా ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
177 పరుగులకే కుప్పకూలిన ఆసీస్
ఇక భారత స్పిన్నర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మార్నస్ లబుషేన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్టీవ్ స్మిత్ 37, అలెక్స్ కేరీ 36 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో జడేజా ఐదు వికెట్లతో కంగరూల పతనాన్ని శాసించగా.. అశ్విన్ మూడు వికెట్లతో రాణించాడు. సిరాజ్, షమీ చెరొక వికెట్ తీశారు.
చదవండి: Ravindra Jadeja: పాంచ్ పటాకా.. ఆటతో పాటు తీరు కూడా కొత్తగా
That 𝐌𝐎𝐌𝐄𝐍𝐓 when @imjadeja let one through Steve Smith's defence! 👌👌
— BCCI (@BCCI) February 9, 2023
Follow the match ▶️ https://t.co/SwTGoyHfZx #TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/Lj5j7pHZi3