క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్ టెస్టుకు సమయం అసన్నమైంది. శుక్రవారం(డిసెంబర్ 6) నుంచి ఆడిలైడ్ ఓవల్ వేదికగా ఈ డే అండ్ నైట్ టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమించాయి.
ఈ అడిలైడ్ టెస్టులో ఎలాగైనా గెలిచి కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆతిథ్య ఆసీస్ భావిస్తుంటే.. భారత్ మాత్రం తమ జోరును కొనసాగించాలని యోచిస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో పాల్గోనున్నాడు. ఈ సందర్భంగా స్టార్ ప్లేయర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు తుది జట్టులో చోటుపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
జడ్డూ, అశ్విన్ ఇద్దరూ చాలా సీనియర్ ప్లేయర్లు అని, వారిద్దరూ ఈ సిరీస్‌లో భారత్‌కు కీలకంగా మారనున్నారని హిట్‌మ్యాన్ తెలిపాడు. ఈ కానీ ఈ స్పిన్ దయం రెండో టెస్టులో ఆడుతారా లేదా అన్నది భారత కెప్టెన్ క్లారిటీ ఇవ్వలేదు. కాగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో వీరిద్దిరికి తుది జట్టులో చోటు దక్కకపోవడం అందరని ఆశ్చర్యపరిచింది.
భారత్ కేవలం ఒక స్పిన్నర్‌తో ఆడింది. ఈ క్రమంలో రెండో టెస్టుకు ఈ స్పిన్ మాంత్రకులకు చోటు లభిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కానీ రోహిత్ వ్యాఖ్యలు చూస్తుంటే రెండో టెస్టుకూ వీరిద్దరూ బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.
"అశ్విన్, జడేజా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు తుది జట్టులో చోటు ఇవ్వకుండా వదిలివేయడం ఎల్లప్పుడూ కష్టమే. కానీ కొన్ని సమయాల్లో జట్టుకు ఏదో ఉత్తమమో అదే చేయాలి. అందుకే వారికి తొలి టెస్టులో ఆడే అవకాశం లభించలేదు.
కానీ ఈ సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో వారిద్దరూ భారత్‌కు కీలకంగా మారుతారని భావిస్తున్నాను అని రోహిత్ పేర్కొన్నాడు. అదే విధంగా కేఎల్ రాహుల్ ఓపెననర్‌గానే కొనసాగనున్నాడని హిట్‌మ్యాన్ స్పష్టం చేశాడు.
చదవండి: SMT 2024: అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ
Comments
Please login to add a commentAdd a comment