
స్మిత్ సెంచరీ
సిడ్నీ: భారత్ తో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా యువ ఆటగాడు స్టీవెన్ స్మిత్ సెంచరీ సాధించాడు. 89 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 4వ సెంచరీ.
భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొని స్మిత్ శతకం బాదాడు. ఫించ్ తో కలిసి రెండో వికెట్ కు 182 బంతుల్లో 173 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.