స్మిత్ సూపర్ సెంచరీ
స్మిత్ సూపర్ సెంచరీ
Published Mon, Dec 5 2016 1:08 AM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM
ఆస్ట్రేలియా చేతిలో కివీస్ చిత్తు
సిడ్నీ: చాపెల్-హ్యాడ్లీ వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు శుభారంభం చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్ 68 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా చేతిలో 0-5 తేడాతో చిత్తుగా వన్డే సిరీస్ ఓడిన తర్వాత ఆస్ట్రేలియాకు ఇదే తొలి గెలుపు కావడం విశేషం. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (157 బంతుల్లో 164; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ సెంచరీతో చెలరేగాడు. అతని కెరీర్‌లో ఇది ఏడో సెంచరీ. స్మిత్‌కు ట్రెవిస్ హెడ్ (60 బంతుల్లో 52; 5 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు.
వీరిద్దరు ఐదో వికెట్‌కు 127 పరుగులు జోడించారు. అనంతరం న్యూజిలాండ్ 44.2 ఓవర్లలో 256 పరుగులకు ఆలౌటైంది. మార్టిన్ గప్టిల్ (102 బంతుల్లో 114; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) కెరీర్‌లో 11వ సెంచరీ సాధించినా, జట్టును గెలిపించడంలో విఫలమయ్యాడు. చివర్లో మున్రో (49) ఫర్వాలేదనిపించాడు. హాజల్‌వుడ్‌కు 3 వికెట్లు దక్కాయి. తాజా ఫలితంతో మూడో వన్డేల సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే మంగళవారం కాన్‌బెర్రాలో జరుగుతుంది.
Advertisement
Advertisement