స్మిత్, మార్ష్ సెంచరీలు
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్ షాన్ మార్ష్ సెంచరీలు సాధించారు. ఆట మూడో రోజు డ్రింక్స్ విరామ సమయానికి ఆసీస్ 3 వికెట్లు నష్టపోయి 275 పరుగులు చేసింది. మార్ష్ 281 బంతుల్లో 19 ఫోర్లతో 130 పరుగుల చేయగా, స్మిత్ 218 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ తో 119 పరుగులు సాధించాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 246 పరుగులు జత చేసి లంకపై ఏ వికెట్ కైనా మూడో అత్యుత్తమ భాగస్వామ్యాన్ని సాధించారు.
మార్ష్ కు ఇది నాలుగో టెస్టు సెంచరీ కాగా, శ్రీలంకపై రెండోది. స్మిత్ 15వ టెస్టు సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 355 పరుగులకు ఆలౌటైంది. మొదటి రెండు టెస్టుల్లో ఓటమి పాలైన ఆస్టేలియా ఈ మ్యాచ్ లో గెలిచి వైట్ వాష్ తప్పించుకోవాలన్న పట్టుదలతో ఆడుతోంది.