ఇండియా బౌలింగ్
పుణే: భారత్ తో గురువారమిక్కడ ప్రారంభమైన తొలి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. పిచ్ బాగా డ్రైగా ఉందని, బౌన్స్ కు అవకాశం ఉండదన్న ఉద్దేశంతో బ్యాటింగ్ తీసుకున్నామని స్మిత్ తెలిపాడు. టీ20 మ్యాచ్ లకు, టెస్టులకు చాలా తేడా ఉందని, ఈ సిరీస్ కు బాగా ప్రాక్టీస్ చేశామన్నాడు. ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఆల్ రౌండర్లతో బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు.
ఎటువంటి అంచనాలు లేకుండానే టాస్ కు వచ్చానని టీమిండియా కెప్టెన్ కోహ్లి తెలిపాడు. భువనేశ్వర్ కుమార్ స్థానంలో జయంత్ యాదవ్ ను తీసుకున్నట్టు వెల్లడించాడు. ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జయంత్, అశ్విన్, జడేశాలతో తమ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉందన్నాడు.