
'విరాట్ బ్యాటింగ్ అద్భుతం'
ముంబై: భారత యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ భీకరమైన బ్యాట్స్మన్ అని, అతని బ్యాటింగ్ చూడటాన్ని ఇష్టపడతానని ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవెన్ స్మిత్ అన్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన గత టెస్టు సిరీస్లో కోహ్లీ అద్భుతంగా రాణించాడని స్మిత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఐపీఎల్లో స్మిత్ రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్లో రాజస్థాన్ ఆటతీరు సంతృప్తికరంగా ఉందని స్మిత్ అన్నాడు. రాయల్స్ మెంటర్ రాహుల్ ద్రావిడ్ తమకు ఆదర్శమని చెప్పాడు. ద్రావిడ్ అనుభవాలు జట్టుకు ఉపయోగపడుతున్నాయని, అతన్నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు.