batting
-
BCCI: ఈ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు..!
-
సూర్యకుమార్ వల్లే సాధ్యమైంది
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో మూడో టి20లో అజేయ సెంచరీతో ఆకట్టుకున్న హైదరాబాద్ బ్యాటర్ ఠాకూర్ తిలక్ వర్మ... ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సాధారణంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే తిలక్... ఈ మ్యాచ్‌కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను అడిగి మరీ మూడో స్థానంలో బరిలోకి దిగి సత్తా చాటాడు. తొలి రెండు టి20ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి వరుసగా 33, 20 పరుగులు చేసిన తిలక్ వర్మ... తనను తాను నిరూపించుకోవడానికి ఒక స్థానం ముందే బ్యాటింగ్‌కు దిగాలనుకుంటున్నట్లు కెప్టెన్ కు వివరించాడు. దీనికి అంగీకరించిన సూర్యకుమార్ తాను బ్యాటింగ్ చేయాల్సిన మూడో ప్లేస్‌లో తిలక్‌ను దింపాడు. దీంతో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే క్రీజులోకి అడుగుపెట్టిన తిలక్ చివరి వరకు అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించాడు. సెంచరీ అనంతరం అభివాదం చేస్తున్న సమయంలో తిలక్ తన హావభావాలతో సారథికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు. ‘సూర్యకుమార్ వల్లే అది సాధ్యమైంది. అతడు మూడో స్థానంలో ఆడే అవకాశం ఇవ్వడంతోనే స్వేచ్ఛగా ఆడాను. గత రెండు మ్యాచ్‌ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశా. నాకు స్వతహాగా వన్‌డౌన్‌లో బ్యాటింగ్ ఇష్టం. అదే సూర్యకు చెప్పా. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రే అతడు దానికి అంగీకారం తెలిపాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు మైదానంలో నేనేంటో నిరూపించుకుంటా అని ముందే చెప్పాను. విఫలమైన సమయంలోనూ టీమ్ మేనేజ్మెంట్ అండగా నిలిచింది. సహజ సిద్ధమైన ఆట ఆడేవిధంగా ప్రోత్సహించింది. కెపె్టన్, తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. వికెట్ పడ్డా వెనకడుగు వేయవద్దని సూచించారు’ అని తిలక్ చెప్పుకొచ్చాడు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన మూడో టి20లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించగా... తిలక్ వర్మ 56 బంతుల్లోనే అజేయంగా 107 పరుగులు చేసి అంతర్జాతీయ క్రికెట్లో తొలి శతకం తన పేరిట లిఖించుకున్నాడు. అందులో 7 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. గాయాల కారణంగా కొన్నాళ్ల పాటు జట్టుకు దూరమైన తిలక్ వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకోవడమే తన పని అని వివరించాడు. ఆల్‌రౌండర్‌గా జట్టుకు సేవలందించేందుకు ఎప్పుడూ ముందుంటానని వెల్లడించాడు. -
కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌లో గిల్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నాలుగేళ్ల తర్వాత టాప్–10లో ముగ్గురు భారత బ్యాటర్లకు చోటు దక్కింది. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో శుబ్‌మన్ గిల్ 759 రేటింగ్ పాయింట్లతో కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత స్టార్స్ విరాట్ కోహ్లి 715 పాయింట్లతో ఎనిమిదో ర్యాంక్‌లో, కెప్టెన్ రోహిత్ శర్మ 707 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు. 2019లో రోహిత్, కోహ్లి, శిఖర్ ధావన్ టాప్–10 ర్యాంకింగ్స్‌లో నిలిచారు. పాకిస్తాన్ కెపె్టన్ బాబర్ ఆజమ్ 863 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. పాక్ నుంచి కూడా ముగ్గురు టాప్–10లో ఉండటం విశేషం. ఇమామ్ ఉల్ హఖ్ 735 పాయింట్లతో ఐదో ర్యాంక్‌లో, ఫఖర్ జమాన్ 705 పాయింట్లతో పదో ర్యాంక్‌లో ఉన్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ ఏడో ర్యాంక్‌లో, మొహమ్మద్ సిరాజ్ తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచారు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా ఒక స్థానం మెరుగుపర్చుకొని ఆరో ర్యాంక్‌లో ఉన్నాడు. -
తిలక్ వర్మ... పేరు గుర్తుంచుకోండి!
తిలక్ పేరులో ‘లక్’ ఉంది. ఈ ‘లక్’ చోటు వచ్చేందుకు పనికొస్తుందేమో కానీ... రాణించేందుకు ఏమాత్రం ఉపయోగపడదు. శక్తి, సామర్థ్యాలతో పాటు టెక్నిక్, వచి్చన అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలన్న పట్టుదల, పాతుకుపోవాలన్న సంకల్పమే ఏ ఆటగాడినైనా నిలబెడతాయి. ఎడంచేతి వాటం బ్యాటర్ తిలక్ వర్మ కూడా అదే చేశాడు. కష్టపడే జట్టులోకి వచ్చాడు. వచ్చాక ప్రత్యర్థి బౌలర్ల భరతం పడుతున్నాడు. బ్యాటింగ్‌లో ఈ నిలకడే భారత టీమ్ మేనేజ్మెంట్ కంట నాలుగో స్థానంపై ఆశాకిరణమయ్యేలా చేస్తోంది. ఠాకూర్ తిలక్ వర్మ ఐపీఎల్లో దంచేస్తుంటే అందరికి తెలిసొచి్చంది. కానీ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) డివిజన్ లీగ్ క్రికెట్లోనే అతను వార్తల్లో వ్యక్తి అని చాలా మందికి తెలియదు. మూడు రోజుల ఆటలో జట్టును అర్ధ సెంచరీలతో ఆదుకున్నాడు. సెంచరీలతో గెలిపించాడు. ఐపీఎల్ వేలంలోకి వచ్చాక లీగ్‌లో మనోడున్నాడు అనిపించాడు. నిలకడైన ఆటతో మెల్లిగా ముంబై ఇండియన్స్ జట్టు మొనగాడయ్యాడు. ఇప్పుడు కరీబియన్‌కు తీసుకెళ్తే భారత ఆశాకిరణమయ్యాడు. అలా ఒక్కో మెట్టెక్కుతూ... కింది నుంచే పైకొచ్చాడు. గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తిలక్ ఆ సీజన్లో ముంబైని మురిపించాడు. షాట్ల ఎంపిక, బంతిని పంపిన ప్లేసింగ్ తీరు, ధాటిగా ఆడే నైపుణ్యం ఇవన్నీ గమనించిన ముంబై యాజమాన్యం అతనికి విరివిగా అవకాశాలిచి్చంది. అన్ని మ్యాచ్‌ల్లో బరిలోకి దింపింది. దాంతో 131.02 స్ట్రయిక్‌రేట్‌తో 397 పరుగులు చేశాడు. 36.09 సగటు నమోదు చేశాడు. ఈ సీజన్లోనూ 11 మ్యాచ్‌ల్లో ఆడిస్తే 164.11 స్ట్రయిక్ రేట్‌తో 343 పరుగులు చేశాడు. సగటేమో 42.87! అంటే ఈ రెండేళ్లలో సగటు, స్ట్రయిక్‌రేట్ రెండు పెంచుకున్నాడు. జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఈ గణాంకాలతోనే తిలక్ వర్మ అదరగొట్టాడనుకుంటే పొరబడినట్లే! ఎందుకంటే ముంబై కష్టాల్లో ఉంటే ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగితే... అతను మాత్రం యథేచ్ఛగా ఆడిన తీరే అందరిమెప్పు పొందేలా చేసింది. క్రికెట్ విశ్లేషకులు, ప్రముఖ టీవీ వ్యాఖ్యా తలే కాదు... దిగ్గజ క్రికెటర్లు సైతం తిలక్ వర్మ ఆటకు, ఆడిన తీరుకు ముచ్చటపడ్డారు. ప్రశంసలు కురిపించారు. విండీస్‌లో సిక్సర్లతో... అతని ప్రతిభను బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ కూడా గుర్తించి కరీబియన్ పర్యటనకు పంపింది. కేవలం టి20ల్లో మాత్రమే అవకాశమిచ్చింది. అంతర్జాతీయ క్రికెట్లో అరుదుగా లభించిన ఈ సదవకాశాన్ని హైదరాబాదీ లెఫ్ట్ హ్యాండర్ వదులుకోలేదు. కోచ్ రాహుల్ ద్రవిడ్, కెపె్టన్ హార్దిక్ పాండ్యాల గేమ్ ప్లాన్‌లో భాగమైన తిలక్... విండీస్ తురుపుముక్కలైన సీమర్లను సునాయాసంగా ఎదుర్కొన్నాడు. ఎదుర్కొన్న తొలి బంతికి పరుగు తీయలేకపోయాడు... కానీ అంతర్జాతీయ పరుగుల ప్రయాణాన్ని మాత్రం సిక్సర్లతో ప్రారంభించాడు. తొలి రెండు టి20ల్లో 39 పరుగులు, 51 పరుగులు అతనిదే టాప్ స్కోర్! తర్వాత మూడు మ్యాచ్‌ల్లో 49 నాటౌట్, 7 నాటౌట్, 27 పరుగులు... ఇలా ప్రతి మ్యాచ్‌లోనూ బాధ్యత కనబరిచాడు. ఓవరాల్‌గా 173 పరుగులతో ఈ సిరీస్‌లో భారత టాప్ స్కోరర్‌గా అవతరించాడు. అందుకే భారత కెపె్టన్ రోహిత్ ఓ ఇంటర్యూలో హైదరాబాదీ ఆటగాడిని ప్రత్యేకంగా ప్రస్తావించాడు, ప్రశంసించాడు. ఆసియా కప్, ప్రపంచకప్‌లపై... యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ తర్వాత బదులు తోచని ప్రశ్నగా మిగిలిపోయిన నాలుగో స్థానం ఇప్పుడు తిలక్‌ను ఊరిస్తోంది. ఆసియా కప్‌లో సెలక్టర్లు మాత్రం అతన్ని కొనసాగించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇక అక్కడ కూడా మ్యాచ్ మ్యాచ్‌కు ఇలాంటి నిలకడ, ధాటైన జోరు కొనసాగిస్తే మాత్రం స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ కోసం అతని పేరును పరిశీలించడం, చోటివ్వడం ఖాయమవుతుందేమో చూడాలి. –సాక్షి క్రీడా విభాగం -
తిలక్ వర్మ బాటింగ్ గురించి తన తల్లి మాటల్లో...
-
ఫైనల్ లో జడేజా బాటింగ్ పై సురేష్ రైనా కామెంట్స్
-
IPL 2023: అర్థం కాని పిచ్‌లు.. పరుగుల వర్షం కష్టమేనట!
ఐపీఎల్(IPL 2023) అంటేనే పరుగుల వర్షానికి పెట్టింది పేరు. సింగిల్స్ వచ్చినట్లుగా బౌండరీలు, సిక్సర్లు వస్తుంటాయి. ఐపీఎల్ ముగిసే సమయానికి బౌండరీల కౌంట్ మీటర్ రికార్డులు సృష్టించడం చూస్తుంటాం. గత 15 సీజన్లలో ఇదే తరహాలో బ్యాటర్లు పండగ చేసుకున్నారు. ఆరెంజ్ క్యాప్ కోసం బ్యాటర్లు పోటీపడి పరుగులు సాధించేవారు. అయితే ఈసారి మాత్రం ఐపీఎల్లో బ్యాటర్లకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అర్థం కాని పిచ్‌ల కారణంగా టి20 క్రికెట్లో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు టి20లు అంటే పరుగుల ప్రవాహం అనేవారు. కానీ కొన్నాళ్లుగా బౌలర్లు కూడా పండగ చేసుకుంటున్నారు. వరుసబెట్టి వికెట్లు తీస్తూ టి20 మ్యాచ్‌ను కాస్త టి10 మ్యాచ్‌లుగా మారుస్తున్నారు. ఇక ఇవాళ ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందా.. బ్యాటర్లకా అన్న ప్రశ్న తలెత్తింది. నిజానికి అహ్మదాబాద్ పిచ్ బౌలర్లకు ఎక్కువగా అనుకూలిస్తుందంటున్నారు. ఇక్కడి పిచ్‌పై తేమ ఎక్కువగా ఉంటుండడంతో బ్యాటర్లు పరుగులు చేయడం కష్టంగా మారుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో 150 కంటే ఎక్కువ పరుగులు చేస్తే ఆ జట్టుకే కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. లోస్కోరింగ్లు నమోదైన ఆశ్చర్యపోనక్కర్లేదు. అహ్మదాబాద్ మాత్రమే కాదు.. ఐపీఎల్ మ్యాచ్‌లు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడి పిచ్‌లు ఎలా స్పందిస్తాయో ముందే చెప్పలేని స్థితి ఏర్పడింది. అయితే క్యురేటర్లు మాత్రం బ్యాటర్లు పండగ చేసుకునేలానే పిచ్‌లు రూపొందించనట్లు పేర్కొంటున్నారు.అయితే వాళ్ల మాటలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. అందుకు ఇంకో కారణం ఉంది. అదే వాతావరణం సమస్య. ప్రస్తుతం క్యుములో నింబస్ మేఘాల వల్ల ఉపరితల ఆవర్తనం రోజురోజుకి మారుతూ వస్తుంది. దీంతో పిచ్‌లు బ్యాటర్లకు అనుకూలంగా ఉండడం లేదని క్రీడా విశ్లేషకులు వాపోతున్నారు. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఐపీఎల్ 16వ సీజన్లో బ్యాటర్ల మెరుపులు కాస్త తక్కువే ఉండొచ్చు. చదవండి: IPL 2023: తెర వెనుక నాయకులను చూసేద్దామా.. -
ధోని.. బ్యాట్ కొరకడం వెనుక అసలు కథ ఇదే!
సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫినిషర్‌గా మరోసారి రాణించాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 21 పరుగులు చేశాడు. ధోని ధనాధన్ ఇన్నింగ్స్‌తో సీఎస్కే 200 పరుగుల మార్క్‌ను దాటింది. అంతకముందు ఓపెనర్లు డెవన్ కాన్వే(49 బంతుల్లో 89), రుతురాజ్ గైక్వాడ్(33 బంతుల్లో 41) రాణించారు. ఆ తర్వాత లక్ష్య చేధనలో ఘోరంగా విఫలమైన ఢిల్లీ 117 పరుగులకే కుప్పకూలింది. ఈ విషయం పక్కనబెడితే ధోని క్రీజులోకి రావడానికి ముందు తన బ్యాట్‌ను కొరకడం అలవాటు. టీమిండియాకు ఆడిన సమయంలో ధోని చాలా సందర్భాల్లో తన బ్యాట్‌ను కొరికి పరిశీలించేవాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లోనూ ధోని బ్యాటింగ్ రావడానికి ముందు తన బ్యాట్‌ను కొరుకుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అసలు ధోని ఇలా చేయడం వెనుక కారణాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా ట్విటర్లో వెల్లడించాడు. ''ధోని బ్యాట్ కొరకడంపై మీకు సందేహాలు ఉన్నాయా.. అయితే వినండి. ధోని తన బ్యాట్‌పై ఏదైనా టేప్ ఉండే అవకాశం ఉంటుందని.. దానిని తొలగించడానికే నోటితో కొరుకుతుంటాడు. ప్రతీసారి బ్యాటింగ్‌కు వెళ్లడానికి ముందు బ్యాట్‌పై ఎలాంటి టేప్ లేదా థ్రెడ్ ఉండకూడదని ధోని అనుకుంటాడు. అందుకే మీరెప్పుడైనా ధోని బ్యాట్‌ను గమనించండి.. ఎలాంటి టేప్, థ్రెడ్ కనిపించవు.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సీఎస్కే గెలిచినప్పటికి ప్లేఆఫ్ అవకాశాలు దాదాపు లేనట్లే. 11 మ్యాచ్‌ల్లో నాలుగు మాత్రమే గెలిచిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక మ్యాచ్ ఓటమితో ఢిల్లీకి అవకాశాలు సన్నగిల్లాయి. 11 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు.. ఆరు ఓటములతో ఐదో స్థానంలో ఉంది. చదవండి: MS Dhoni: ధోని అరుదైన ఫీట్.. ఐపీఎల్ చరిత్రలో ఎవరికి సాధ్యం కాలేదు CSK VS DC: కాన్వే హ్యాట్రిక్ హాఫ్ సెంచరీస్.. డుప్లెసిస్, రుతురాజ్ తర్వాత..! In case you’re wondering why Dhoni often ‘eats’ his bat. He does that to remove tape of the bat as he likes his bat to be clean. You won’t see a single piece of tape or thread coming out of MS’s bat. #CSKvDC #TATAIPL2022 — Amit Mishra (@MishiAmit) May 8, 2022 -
జడేజా ‘కత్తి’ దూశాడు!
రవీంద్ర జడేజా అద్భుత బ్యాటింగ్‌కు శ్రీలంక కకావికలమైంది. గాయం నుంచి కోలుకొని మళ్లీ జట్టులోకి వచ్చిన అతను తొలి మ్యాచ్‌లోనే తన విలువేంటో చూపించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జడేజా మెరుపు ప్రదర్శనతో శతకం బాదడంతో పాటు బౌలింగ్‌లో కీలక వికెట్ తీసి రెండో రోజే మ్యాచ్‌ను భారత్ చేతుల్లోకి తెచ్చాడు. అశ్విన్ కూడా ఇదే తరహా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థి పని పట్టాడు. అటు పేలవ బౌలింగ్, ఫీల్డింగ్‌తో పూర్తిగా చేతులెత్తేసిన లంక బ్యాటింగ్‌లోనూ తడబడి అప్పుడే నాలుగు వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. లంకను ఎక్కువ ఓవర్లు ఆడించే క్రమంలో జడేజా డబుల్ సెంచరీకి అవకాశం ఇవ్వకుండా భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడమే రెండో రోజు ఆటలో కాస్త చర్చనీయాంశం! మొహాలి: శ్రీలంకతో తొలి టెస్టులో రెండో రోజే భారత్‌కు మ్యాచ్‌పై పట్టు చిక్కింది. ఓవర్‌నైట్ స్కోరు 357/6తో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 129.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 574 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రవీంద్ర జడేజా (228 బంతుల్లో 175 నాటౌట్; 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెరీర్లో అత్యుత్తమ స్కోరు సాధించగా, అశ్విన్ (82 బంతుల్లో 61; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 130 పరుగులు జత చేశారు. అనంతరం లంక ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 466 పరుగులు వెనుకబడి ఉంది. భారీ భాగస్వామ్యం... తొలి రోజు అజేయంగా నిలిచిన జడేజా, అశ్విన్ ద్వయం శనివారం అదే జోరును కొనసాగిస్తూ శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రెండో ఓవర్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న జడేజాకు అశ్విన్ అండగా నిలిచాడు. వీరిద్దరూ వన్డే తరహాలో ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టారు. ఫెర్నాండో ఓవర్లో జడేజా రెండు ఫోర్లు కొట్టడంతో స్కోరు 400 పరుగులకు చేరింది. ఆ తర్వాత అశ్విన్ హాఫ్ సెంచరీ కూడా పూర్తయింది. తొలి సెషన్లో అశ్విన్ వికెట్ కోల్పోయినా... 27 ఓవర్లలో భారత్ ఏకంగా 111 పరుగులు నమోదు చేసింది. ఎంబుల్డెనియా బౌలింగ్‌లో సింగిల్ తీసి 160 బంతుల్లో జడేజా సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. లంచ్ విరామం తర్వాత కొద్ది సేపటికే జయంత్ యాదవ్ (2) వెనుదిరిగాడు. ఈ స్థితిలో జడేజా స్కోరు 104 పరుగులు. ఆ తర్వాత జడేజా మరింత చెలరేగిపోయాడు. 60 బంతుల్లోనే తర్వాతి 71 పరుగులు సాధించాడు. ఫెర్నాండో బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అనంతరం ఎంబుల్డెనియా ఓవర్లో వరుసగా 6, 4, 4 బాదాడు. డిసిల్వా బౌలింగ్‌లో మరో భారీ సిక్స్‌తో అతను 150 పరుగులకు చేరుకున్నాడు. షమీ (20 నాటౌట్) అతనికి చక్కగా సహకరించాడు. వీరిద్దరు 94 బంతుల్లోనే 103 పరుగులు జోడించగా జడేజానే 71 పరుగులు చేశాడు. అయితే డబుల్ సెంచరీకి చేరువవుతున్న తరుణంలో అనూహ్యంగా భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శ్రీలంక ఓపెనర్లు కరుణరత్నే, తిరిమన్నె 18 ఓవర్ల పాటు భారత బౌలర్లను నిరోధించారు. అనంతరం అశ్విన్ బౌలింగ్‌లో తిరిమన్నె వికెట్ల ముందు దొరికిపోవడంతో పతనం మొదలైంది. ఆ తర్వాత కరుణరత్నేను జడేజా... మాథ్యూస్ (22)ను బుమ్రా... ధనంజయ డిసిల్వా (1)ను అశ్విన్ పెవిలియన్‌కు పంపించారు. హ్యాడ్లీని దాటిన అశ్విన్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్ దిగ్గజం రిచర్ హ్యాడ్లీ (431)ను అశ్విన్ అధిగమించాడు. ప్రస్తుతం 432 వికెట్లతో అతను ఓవరాల్‌గా 11వ స్థానానికి చేరుకున్నాడు. మరో 3 వికెట్లు తీస్తే కపిల్‌దేవ్ (434)ను అశ్విన్ దాటుతాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (ఎల్బీ) (బి) ఎంబుల్డెనియా 33; రోహిత్ (సి) లక్మల్ (బి) కుమార 29; విహారి (బి) ఫెర్నాండో 58; కోహ్లి (బి) ఎంబుల్డెనియా 45; పంత్ (బి) లక్మల్ 96; శ్రేయస్ (ఎల్బీ) (బి) డిసిల్వా 27; జడేజా (నాటౌట్) 175; అశ్విన్ (సి) డిక్వెలా (బి) లక్మల్ 61; జయంత్ (సి) తిరిమన్నె (బి) ఫెర్నాండో 2; షమీ (నాటౌట్) 20; ఎక్స్‌ట్రాలు 28; మొత్తం (129.2 ఓవర్లలో 8 వికెట్లకు డిక్లేర్డ్) 574. వికెట్ల పతనం: 1–52, 2–80, 3–170, 4–175, 5–228, 6–332, 7–462, 8–471. బౌలింగ్: లక్మల్ 25–1–90–2, ఫెర్నాండో 26–1–135–2, కుమార 10.5–1–52–1, ఎంబుల్డెనియా 46–3–188–2, డిసిల్వా 18.2–1–79–1, అసలంక 3.1–0–14–0. శ్రీలంక తొలి ఇన్నింగ్స్: కరుణరత్నే (ఎల్బీ) (బి) జడేజా 28; తిరిమన్నె (ఎల్బీ) (బి) అశ్విన్ 17; నిసాంక (బ్యాటింగ్) 26; మాథ్యూస్ (ఎల్బీ) (బి) బుమ్రా 22; డిసిల్వా (ఎల్బీ) (బి) అశ్విన్ 1; అసలంక (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (43 ఓవర్లలో 4 వికెట్లకు) 108. వికెట్ల పతనం: 1–48, 2–59, 3–96, 4–103. బౌలింగ్: 7–3–17–0, బుమ్రా 9–2–20–1, అశ్విన్ 13–6–21–2, జయంత్ 5–2–14–0, జడేజా 9–3–30–1. -
పుజారా ఆడకపోయుంటే...
100 బంతుల్లో 16 పరుగులు... 133 బంతుల్లో 40... 174 బంతుల్లో అర్ధ సెంచరీ... తొలి వంద బంతుల్లో ఒక్క ఫోర్ కూడా లేదు... శనివారం చతేశ్వర్ పుజారా బ్యాటింగ్ సాగిన తీరు ఇది. దీనిపైనే పలువురు మాజీలు, అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. రికీ పాంటింగ్ కూడా ‘ఇది సరైన పద్ధతి కాదు. స్కోరింగ్ వేగం మరింత ఎక్కువగా ఉండాల్సింది. ఈ తరహా ఆట ఇతర బ్యాట్స్‌మెన్‌పై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది’ అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఇలా ఆడటం ఇదేమీ మొదటిసారి కాదు! నిజానికి ఇదే అతని బలం కూడా. పరుగులు చేయడంలో అతని శైలే ఇది. పుజారా విషయంలో ఇలాంటిది బ్రహ్మాండంగా పని చేస్తుంది కూడా. సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో పాతుకుపోయి... ప్రత్యర్థి బౌలర్లు అలసిపోయి, గతి తప్పి పేలవ బంతులు వేసే వరకు వేచి చూడటం... ఆపై పరుగులు రాబట్టడం అతనికి తెలిసిన విద్య. 2018లో జొహన్నెస్‌బర్గ్ టెస్టులో 50వ బంతికి తొలి పరుగు తీసిన రోజు కూడా పుజారా శైలిపై విమర్శలు రాలేదు. రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి సిరీస్ గెలిచినప్పుడు పుజారా ఇదే మంత్రం పఠించాడు. సిరీస్ మొత్తంలో అసాధారణంగా సుమారు 30 గంటల పాటు అతను బ్యాటింగ్ చేసిన విషయం మరచిపోవద్దు. అతనిలో ‘దూకుడు’ లోపించిందని చెప్పడంలో అర్థం లేదు. సాధారణంగా అయితే నిలదొక్కుకోవడానికి కొంత సమయం తీసుకున్నా... ఆ తర్వాత షాట్లు ఆడుతూ లెక్క సరి చేయడం అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ చేస్తుంటారు. అడిలైడ్ టెస్టులో కోహ్లి తన తొలి 80 బంతుల్లో 29 పరుగులే చేసి ఆపై కొంత జోరు పెంచాడు. అయితే పుజారాకు అలాంటి షాట్ల ‘రిస్క్’ విలువేమిటో బాగా తెలుసు. శనివారం భారత జట్టు ఉన్న స్థితిలో అలాంటి రిస్క్‌లు కూడా అనవసరమని అతను భావించినట్లున్నాడు. అన్నింటికి మించి ఫామ్‌లో ఉన్న ముగ్గురు అత్యుత్తమ పేసర్లను అతను ఎదుర్కొంటున్నాడు. పిచ్ భిన్నంగా స్పందిస్తోంది. ఎన్ని ఎక్కువ బంతులు ఆడితే అన్ని ఎక్కువ పరుగులు చేసే అవకాశం తనకు పెరుగుతుందని అతను అనుకున్నాడు. అన్నింటికి మించి తన సహచరుల బ్యాటింగ్ బలంపై కూడా అతనికి అంచనా ఉంది. టెస్టు క్రికెట్లో సుమారు 31 వేల బంతులు ఆడిన పుజారాకు తనకు ఏది బాగా పని చేస్తుందో తెలీదా! చివరకు అతను భయపడినట్లే జరిగింది. కమిన్స్ వేసిన ఒక అద్భుత బంతికి పుజారా వెనుదిరిగాక జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. అతను కూడా పట్టుదలగా నిలబడకుండా వేగంగా ఆడితే చాలనే భావనలో వెళితే అసలు ఈ మాత్రం స్కోరైనా వచ్చేదా! జట్టు పేలవ ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఎదుర్కోగలిగిన బ్యాట్స్‌మెన్ అని చూడకుండా రహానేపై ఒత్తిడి పెరిగి అవుట్ కావడానికి కారణమయ్యాడని, అతని ఆట శైలి కారణంగానే విహారి కూడా రనౌట్ అయ్యాడని విమర్శించడంలో ఏమాత్రం అర్థం లేదు. నేను బాగా ఆడుతున్న సమయంలో ఒక మంచి బంతికి అవుటయ్యాను. నాకు తెలిసిన శైలిలోనే నేను బ్యాటింగ్ చేస్తాను. అంతకంటే మెరుగ్గా నేను ఏమీ చేయలేను. కమిన్స్ వేసిన ఆ బంతి ఈ సిరీస్‌లోనే అత్యుత్తమమైంది. నేను ఆడక తప్పని పరిస్థితి. మనది కాని రోజు చిన్న తప్పులు కూడా పెద్దవిగా కనిపిస్తాయి. పుజారా, భారత బ్యాట్స్‌మన్ -
రాహుల్ శైలి మార్చుకోవాలి
ఈ ఐపీఎల్లో నాకు ఆసక్తి కలిగించిన చాలా అంశాల్లో కేఎల్ రాహుల్, అతని బ్యాటింగ్‌పై కెప్టెన్సీ ప్రభావం గురించి చెప్పుకోవాలి. రాహుల్ అద్భుత ఆటగాడు. కొందరికి మాత్రమే సాధ్యమయ్యే రీతిలో 360 డిగ్రీల్లో ఆడగలడు. అందులోనూ కళాత్మకత ఉంటుంది. క్రికెట్ పుస్తకంలో లేని షాట్లను కూడా అందంగా, కవర్ డ్రైవ్ తరహాలో క్లాస్‌గా ఆడతాడు. ఈ మెగా టోర్నీలో రాహుల్‌కు 2018 ఏడాది చెప్పుకోదగ్గది. ఆ సీజన్లోనే రాహుల్ గొప్ప టి20 బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. ముఖ్యంగా స్ట్రయిక్ రేట్ విషయంలో దిగ్గజాలను తలపించాడు. కళ్లు చెదిరేలా 158 స్ట్రయిక్‌రేట్‌తో 659 పరుగులు సాధించాడు. అది నమ్మశక్యం కాని ప్రదర్శన. నిజాయితీగా చెప్పాలంటే దాన్ని మళ్లీ మళ్లీ పునరావృతం చేయలేం. కానీ ఆ తర్వాతి సీజన్లోనే అతనిలో మార్పు కనిపించింది. ముందులా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. గణాంకాలను పరిశీలిస్తే అతని స్ట్రయిక్‌రేట్ 130కి పడిపోవడం మనం గమనించవచ్చు. చకాచకా వేగంగా పరుగులు సాధించే రాహుల్ విషయంలో గణాంకాలు దీన్ని స్పష్టం చేశాయి. గత ఏడాది, 2020లో కూడా రాహుల్ 130 స్ట్రయిక్రేట్లోనే ఆడుతున్నాడు. దీన్ని మనం ఒక మ్యాచ్‌లో చక్కగా గమనించవచ్చు. షార్జాలో రాజస్తాన్‌తో మ్యాచ్‌లో మయాంక్ 200 మించిన స్ట్రయిక్‌రేట్‌తో ఆడుతుంటే... అతనితో కలిసి ఎక్కువ భాగం ఆడిన రాహుల్ మాత్రం 127 స్ట్రయిక్‌రేట్ నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోయింది. కచ్చితంగా రాహుల్ మాత్రమే ఆ ఓటమికి బాధ్యుడు కాదు. ఇదంతా కెప్టెన్సీ బాధ్యతతో వచ్చిన అదనపు భారమని నేను అనుకోవట్లేదు. 2018 తర్వాత తన వికెట్‌కు రాహుల్ అత్యంత ప్రాధాన్యమిస్తుండటంతో ప్రదర్శన దిగజారినట్లుగా అనిపిస్తోంది. ఇది కేవలం ఫ్రాంచైజీ క్రికెట్‌కు మాత్రమే పరిమితం. అదే అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల విషయానికొస్తే రాహుల్ స్ట్రయిక్‌రేట్ 143గా ఉంది. అక్కడ అతను చాలా సులభంగా పరుగులు చేస్తున్నాడు. ఎందుకు? నా అంచనా ప్రకారం అంతర్జాతీయ టి20లు ఆడేటప్పుడు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో తనకన్నా క్లాస్ ఆటగాళ్లు ఉన్నట్లు రాహుల్ భావిస్తాడు. తన వికెట్‌కు అంతగా ప్రాధాన్యం ఇవ్వనవసరం లేదనుకుంటాడు. ఇప్పడు పంజాబ్‌ను పాయింట్ల పట్టికలో పైకి తీసుకెళ్లాలంటే, రాహుల్ టీమిండియాకు ఆడే ధోరణిని అవలంభించాలి. ఇతరుల గురించి ఆందోళన వీడాలి. ఇప్పుడు ఆడుతున్న శైలి అతనికిగాని, పంజాబ్ జట్టుకు గాని ఏమాదిరిగానూ ఉపయోగపడదు. -
టి20 కోసం నా బ్యాటింగ్ మార్చుకునేవాడిని
కోల్‌కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ టి20 క్రికెట్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ తరంలో తాను క్రికెట్ ఆడి ఉంటే టి20 ఫార్మాట్‌కు తగినట్లుగా తన క్రికెటింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేవాడినని అన్నాడు. పవర్ హిట్టింగ్‌కు ఈ ఫార్మాట్ లైసెన్స్‌గా పనిచేస్తుందని పేర్కొన్నాడు. ‘టి20 క్రికెట్ ఆడి ఉంటే ఆ ఫార్మాట్‌ను నేను ఆస్వాదించేవాడిని. ఐపీఎల్లో ఐదేళ్లు ఆ ఫార్మాట్లో ఆడినప్పటికీ మరింతకాలం ఆడితే బావుండు అనిపిస్తోంది’ అని బీసీసీఐ ట్విట్టర్ ఖాతా వేదికగా గంగూలీ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా 2002 నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్ సంబరాలను గంగూలీ గుర్తు చేసుకున్నాడు. ‘అవి గొప్ప క్షణాలు. అలాంటి మ్యాచ్ గెలుపొందితే చేసుకునే సంబరాలు కూడా ఆ స్థాయిలోనే ఉండాలి. నేను ఆడిన గొప్ప మ్యాచ్‌ల్లో నాట్‌వెస్ట్ ఫైనల్ కూడా ఒకటి’ అని గంగూలీ నాటి మధుర స్మృతులను తలుచుకున్నాడు. -
‘నా శైలి అందరికీ తెలుసు’
రాజ్‌కోట్: భారత టెస్టు జట్టులో కీలక సభ్యుడైన చతేశ్వర్ పుజారా పలు సందర్భాల్లో బాగా నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంపై విమర్శలు ఎదుర్కొన్నాడు. గతంలో ఒక సారి జట్టు కోచ్, కెప్టెన్ కూడా అతని స్ట్రయిక్‌రేట్‌ను ప్రశ్నించారు. దూకుడుకు చిరునామాగా మారిన ఈతరం క్రికెట్లో పుజారా బ్యాటింగ్ శైలి చాలా మందిని ఆకట్టుకోదు. ఇటీవల బెంగాల్‌తో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో కూడా అతను ఇదే తరహాలో ఆడాడు. జ్వరంనుంచి కోలుకొని ఇన్నింగ్స్ కొనసాగించిన అతను 237 బంతుల్లో 66 పరుగులు చేశాడు. దీంతో సగటు క్రికెట్ అభిమానులు మళ్లీ పుజారా ఆటతీరును విమర్శించారు. దీనిపై ఇప్పుడు స్వయంగా పుజారానే స్పందించాడు. ‘నా ఆటతీరు గురించి మీడియాలోనే అనేక రకమైన వార్తలు కనిపిస్తాయి. అయితే జట్టు అంతర్గత చర్చల్లో మాత్రం దీని గురించి అసలు ప్రస్తావనే ఉండదు. ఈ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ నాకు పూర్తిగా మద్దతిస్తోంది. వేగంగా ఆడాలంటూ కెప్టెన్‌నుంచి గానీ కోచ్‌నుంచి గానీ నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు’ అని పుజారా వివరణ ఇచ్చాడు. కరోనా కారణంగా ప్రస్తుతం ఎక్కడికీ వెళ్లకుండా పుజారా కూడా ఇంట్లోనే ఉంటున్నాడు. ‘మీ అందరికీ ఒక విషయం చెప్పదల్చుకున్నా. నా స్ట్రయిక్‌రేట్ గురించి చర్చ రాగానే అంతా టీమ్ మేనేజ్మెంట్ నాతో ఎలా వ్యవహరిస్తోందో అని ఆలోచిస్తారు. అయితే వారందరికీ నా శైలి బాగా తెలుసు. నా ఆట ప్రాధాన్యత కూడా తెలుసు. కాబట్టి ఎప్పుడూ నాపై ఒత్తిడి పెంచలేదు’ అని పుజారా అన్నాడు. సోషల్ మీడియాలో చాలా మంది తనను పరుగులు చేసేందుకు అన్నేసి బంతులు ఎందుకు తీసుకుంటావని అడుగుతుంటావని, అయితే తాను వాటిని పట్టించుకోనని చింటూ చెప్పాడు. ‘అసలు అలాంటి వాటిపై నేను దృష్టి పెట్టను. జట్టు మ్యాచ్‌లు గెలిచేలా నా వంతు పాత్ర పోషించడమే నా పని. చాలా మందికి ఒక వ్యక్తిలో తప్పును గురించి మాట్లాడే అలవాటు ఉంటుంది. ఇది నా ఒక్కడికే పరిమితం కాదు. నేను ఆడిన టెస్టులు, వాటిలో చేసిన పరుగులు, క్రీజ్‌లో గడిపిన సమయం చూస్తే ప్రత్యర్థి జట్టులో కూడా ఎక్కువ మంది ఇదే తరహాలో ఆడారని అర్థమవుతుంది’ అని ఈ సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్ వ్యాఖ్యానించాడు. అయితే తన గురించి తాను వాస్తవంగా ఆలోచిస్తానని, మరీ దూకుడుతనంతో ఆడలేనని ప్రత్యేకంగా విషయం తనకు తెలుసని కూడా పుజారా వివరించాడు. ‘నేను డేవిడ్ వార్నర్‌లా, వీరేంద్ర సెహ్వాగ్‌లా ఆడలేనని నాకు తెలుసు. కానీ ఒక సాధారణ బ్యాట్స్‌మన్ క్రీజ్‌లో ఎక్కువ సమయం తీసుకుంటే తప్పేమీ లేదు’ అని అతను చెప్పాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన సిరీస్‌లో ఒకే ఒక అర్ధ సెంచరీ చేసిన పుజారా ఈ ఏడాదిలో ఒక్క శతకం కూడా కొట్టలేకపోయాడు. ఇది తనను కొంత నిరాశకు గురి చేసిందని భారత టెస్టు స్పెషలిస్ట్ చెప్పాడు. ‘అభిమానులు నేను భారీ ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటారు. నేనూ సెంచరీ చేయాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగుతాను. అయితే ఓవరాల్‌గా టెస్టుల్లో దాదాపు 50 సగటు ఉందంటే ప్రతీ రెండో ఇన్నింగ్స్‌లో నేను అర్ధ సెంచరీ చేసినట్లే. సీజన్ గొప్పగా సాగలేదనేది వాస్తవం. అయితే మరీ ఘోరంగా ఏమీ ఆడలేదు. నా ఫామ్ దిగజారిందని అంగీకరించను. ప్రతీ ఇన్నింగ్స్‌కు తనదైన విలువ ఉంది’ అని పుజారా వెల్లడించాడు. ఈతరం క్రికెటర్లు టెస్టులపై ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదని అతను అభిప్రాయ పడ్డాడు. ‘పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తుంది. డబ్బులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి కుర్రాళ్లు టెస్టులకు దూరంగా ఉంటున్నారనేది వాస్తవం. ఇందులో తప్పేమీ లేదు కానీ టెస్టులకు కూడా ప్రత్యేకత ఉంది. ఒక ఆటగాడి అసలు సత్తాను ఐదు రోజుల మ్యాచ్‌లే బయటపెడతాయి’ అని పుజారా అన్నాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్ తమకు అత్యంత కీలకమన్న భారత టెస్టు మూడో నంబర్ ఆటగాడు... మన పేసర్లు పూర్తి ఫిట్నెస్, తగినంత విరామంతో సిద్ధంగా ఉంటే మళ్లీ సిరీస్ గెలవవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై 2018–19 సిరీస్‌ను భారత్ 2–1తో సొంతం చేసుకుంది. -
కొడుకు కోసం తల్లి బౌలర్ అవతారం
-
వైరల్ : బౌలర్‌గా అవతారమెత్తిన తల్లి
భారత్‌లో క్రికెట్‌కు క్రేజ్ మామూలుగా ఉండదు. చిన్న పిల్లవాడి నుంచి పండు ముసలివాడి వరకు జెంటిల్మాన్ క్రీడకు పడిచచ్చి పోతారు. మ్యాచ్ ఉందంటే చాలు.. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా స్టేడియంలో వాలిపోతారు. ఇటీవల ఓ దివ్యాంగ బాలుడు రెండు కాళ్లు చచ్చుబడిపోయినా.. తోటి పిల్లలతో కలిసి పోటాపోటీగా క్రికెట్ ఆడుతూ అందర్నీ ఆకర్షించాడు. తాజాగా ఓ తల్లి తన రెండేళ్ల కొడుకు కోసం బౌలర్ అవతారమెత్తి.. వీధుల్లో బౌలింగ్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. రద్దీగా ఉన్న రోడ్డులో తన కుమారుడికి బౌలింగ్ చేస్తూ.. కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ట్విటర్లో షేర్ చేశాడు. ‘కొడుకు బ్యాటింగ్.. అమ్మ బౌలింగ్.. మొత్తానికి బ్యాటిఫుల్’ అని క్యాప్షెన్ పెట్టాడు. కాసేపట్లోనే అది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. -
ఒక్కసారి బ్యాటింగ్ మొదలుపెడితే..
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ బ్యాట్ తయారు చేసేందుకు కెనెడాలోని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. నాణ్యమైన కశ్మీరీ, ఇంగ్లిష్ విల్లోను ఎంపిక చేయడమే కాకుండా.. కంప్యూటర్ మోడలింగ్, సమర్థత పెంచేందుకు పనికొచ్చే అల్గారిథమ్‌లను ఇందులో వాడటం విశేషం. ‘అల్గోబ్యాట్’అని పిలుస్తున్న ఈ కొత్తరకం బ్యాట్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యుత్తమ బ్యాట్‌కు ఏమాత్రం తీసిపోదని.. అందరికీ అందుబాటులోనే ధర ఉంటుందని ఫిల్ ఎవన్స్ అనే శాస్త్రవేత్త అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడేవారు దాదాపు 10 లక్షల మంది ఉన్నారు. విరాట్ క్లోహ్లీ, స్టీవ్ స్మిత్, ఇయాన్మోర్గన్ వంటి ఆటగాళ్ల స్ఫూర్తిగా క్రికెట్లోకి అడుగుపెట్టే పిల్లలకు మంచి బ్యాట్ కొనడం ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో మంచి బ్యాట్ ఖరీదు లక్షల్లో ఉండగా.. తమ ఆల్గోబ్యాట్ ఖరీదు రెండు మూడు వేల కంటే ఎక్కువ ఉండదని ఎవన్స్ తెలిపారు. బ్యాట్ జ్యామితిని మార్చడం ద్వారా బంతి తగిలినప్పుడు అతితక్కువ కంపించడం, తక్కువ శక్తితోనే ఎక్కువ దూరం వెళ్లడం ఈ ఆల్గోబ్యాట్ ప్రత్యేకతలని వివరించారు. ఆల్గోబ్యాట్ డిజైన్‌తో సాధారణ కలపతోనూ అత్యుత్తమమైన బ్యాట్లు తయారు చేయొచ్చని, ఆయా కలప రకానికి తగ్గట్లు డిజైన్ మార్చుకునే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆల్గోబ్యాట్ నమూనాలను పరీక్షిస్తున్నామని.. అన్నీ సవ్యంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత మార్కెట్లోకి ప్రవేశపెడతామని వెల్లడించారు. -
‘నాలుగు’ నాకు కొత్త కాదు!
సాక్షి, విశాఖపట్నం: మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం వల్ల తనపై ఎలాంటి ఒత్తిడీ లేదని భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు అన్నాడు. నాలుగో స్థానంలో ఆడటం తనకు అలవాటేనని అతను చెప్పాడు. ‘చాలా కాలంగా నేను నాలుగో స్థానంలో ఆడుతున్నాను. టీమ్ మేనేజ్మెంట్ ఆ స్థానంలో ఆడమని చెప్పడంలో కొత్తేమీ లేదు. నేను నాలుగో స్థానానికి సరైన వాడినంటూ కెప్టెన్ కోహ్లి చేసిన వ్యాఖ్య వల్ల ఎలాంటి ఒత్తిడికి గురి కావడం లేదు. అదేమీ అదనపు బాధ్యత కాదు. నిజాయితీగా చెప్పాలంటే ప్రస్తుతం ఈ సిరీస్‌పైనే దృష్టి పెట్టాను. అంతకుమించి ఇంకేమీ ఆలోచించడం లేదు’ అని రాయుడు స్పష్టం చేశాడు. ఆసియా కప్‌లో రాణించిన రాయుడు, అంతకుముందు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైనా...యో యో టెస్టులో విఫలం కావడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే నిర్దేశిత ఫిట్నెస్ ప్రమాణాలకు తానేమీ వ్యతిరేకం కాదని అతను వెల్లడించాడు. ‘నేను యో యో టెస్టులో ఉత్తీర్ణత సాధించడం సంతోషమే. అయితే ఈ టెస్టుకు, నా ఫిట్నెస్ సన్నద్ధతకు ఎలాంటి సంబంధం లేదు. ఒకసారి గాయపడిన తర్వాత ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాను. సిరీస్‌ల మధ్యలో దొరికే కొద్దిపాటి విరామంలో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కు వెళ్లి ఫిట్నెస్ను మెరుగుపర్చుకునే ప్రయత్నం చేస్తుంటాను. నిజానికి ఐపీఎల్‌కు ముందే దీనిపై శ్రమించాను. ఫిట్నెస్పరంగా చూస్తే పునరాగమనం చేసేందుకు నాకు ఐపీఎల్ మంచి అవకాశం ఇచ్చింది’ అని రాయుడు పేర్కొన్నాడు. మరోవైపు మున్ముందు ఎలాంటి సవాల్‌కైనా మిడిలార్డర్ సిద్ధంగా ఉండాలని రాయుడు అన్నాడు. ‘భారత టాప్–3 అద్భుతంగా రాణిస్తుండటం గొప్ప విషయం. తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్ కూడా ఎప్పుడు ఏ సవాల్ ఎదురైనా బాగా బ్యాటింగ్ చేసేందుకు సన్నద్ధంగా ఉండాలి. నాకు తెలిసి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జట్టులో పరిస్థితి ఏమిటో అందరికీ బాగా తెలుసు. సిరీస్‌లో ఒక్కటే మ్యాచ్ ముగిసింది. తర్వాతి మ్యాచ్‌లలో విండీస్ గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నా’ అని రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బ్యాటింగ్ ఇవ్వలేదని కత్తితో దాడి..
కోటా: రాజస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. క్రికెట్లో బ్యాటింగ్ అవకాశం ఇవ్వలేదని ఓ యువకుడిపై మరో వ్యక్తి కత్తితో దాడికి పాల్పడటంతో ఆ యువకుడు మృతిచెందాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతుల్ కుమార్‌సింగ్ (17) కోటా నగరంలోని ఓ ఇన్స్టిట్యూట్లో నీట్ పరీక్ష కోసం మూడేళ్ల నుంచి కోచింగ్ తీసుకుంటున్నాడు. రాహుల్ భటీ అనే స్థానికుడు తన మిత్రులతో కలసి శనివారం సాయంత్రం క్రికెట్ ఆడుతుండగా తనకు బ్యాటింగ్ అవకాశం ఇవ్వమని అతుల్ వారిని అడిగాడు. సమ్మతించిన వారు బ్యాటింగ్ అవకాశం ఇచ్చారు. అయితే కొన్ని ఓవర్ల తర్వాత బ్యాటింగ్ ఇవ్వమంటే అతుల్ ఒప్పుకోలేదు. మరికొన్ని బాల్స్ వేయమని కోరాడు. చిన్నగా మొదలైన గొడవ చినికి చినికి గాలివానలా మారింది. ఆగ్రహానికి గురైన రాహుల్ తన దగ్గరున్న కత్తితో అతుల్‌ను పొడిచాడు. తీవ్రగాయాలపాలైన అతుల్‌ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక కోర్టు ఎదుట హాజరుపరచడంతో.. 3 రోజుల కస్టడీ విధించింది. -
వామ్మో.. బ్యాట్ తోనూ బాదేస్తున్నాడు!
కోల్‌కతా: ఐపీఎల్ లో ఇప్పటివరకు బంతితోనే సత్తా చాటిన కోల్‌కతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ ఇప్పుడు బ్యాట్ తోనూ చెలరేగుతున్నాడు. బౌలర్ గానే కాదు బ్యాట్స్ మన్ గానూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఓపెనర్ గా బరిలోకి పరుగుల ప్రవాహం పారిస్తున్నాడు. గుజరాత్ లయన్స్ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో నరైన్ మరోసారి విజృంభించాడు. 247.05 స్ట్రైక్ రేటుతో 17 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్ తో 42 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 40 ప్లస్ పరుగుల్లో ఇదే అత్యధిక స్ట్రైక్ రేటు కావడం విశేషం. ఈ నెల 5న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ సన్ రైజర్స్ ఆటగాడు యువరాజ్ సింగ్ 229.62 స్ట్రైక్ రేటుతో 27 బంతుల్లో 62 పరుగులు సాధించాడు. బ్యాటింగ్ చేస్తోంది స్పిన్నరా, హిట్టరా అని అనుమానం కలిగేలా సునీల్ చెలరేగుతున్నాడు. క్రిస్ లిన్ గాయం కారణంగా ఓపెనర్ గా ప్రమోషన్ పొందిన ఈ వెస్టిండీస్ ఆటగాడు జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు. బిగ్‌బాష్ టోర్నిలో మెల్బోర్న్ రెనెగాడ్స్ జట్టు తరపున ఓపెనర్‌గా అతడికి అనుభవం ఉన్నప్పటికీ ఐపీఎల్ లో ఓపెనర్ గా రావడం ఈ సీజన్ లోనే మొదలైంది. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్ లో నైట్ రైడర్స్ ఓపెనర్ గా తొలిసారిగా బరిలోకి దిగి సత్తా చాటాడు. 18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు సాధించాడు. దీంతో నైట్ రైడర్స్ అతడిని ఓపెనర్ గా కొనసాగిస్తోంది. -
కోల్‌కతా మ్యాచ్ లో బిగ్ సర్ప్రైజ్!
కోల్‌కతా: పంజాబ్ కింగ్స్ ఎలెవన్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య గురువారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఛేజింగ్ దిగిన కోల్‌కతా టీమ్ ఊహంచని ప్రయోగం చేసింది. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ ను ఓపెనర్‌గా పంపి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నరైన్ నిలబెట్టుకున్నాడు. బ్యాట్స్ మన్ కు ఏమాత్రం తీసిపోని రీతిలో చెలరేగాడు. బంతితోనే కాదు బ్యాట్ తోనూ సత్తా చాటగలనని నిరూపించాడు. 18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు సాధించాడు. నరైన్ సంచలన ఇన్నింగ్స్ తో ప్రత్యర్థి బౌలర్లకు దిమ్మతిరిగింది. కెప్టెన్ గౌతమ్ గంభీర్ కూడా అర్థ సెంచరీతో రాణించడంతో కోల్‌కతా అలవోకగా విజయం సాధించింది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో సత్తా చాటిన నరైన్ కు ’మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. అయితే ఓపెనింగ్ కు దిగడం నరైన్ కు ఇదే తొలిసారి కాదు. బిగ్‌బాష్ టోర్నిలో మెల్బోర్న్ రెనెగాడ్స్ జట్టు తరపున ప్రాతినిథ్యం వహించిన అతడు ఓపెనర్‌గా పలు మ్యాచ్ లు ఆడాడు. కోల్‌కతా తర్వాతి మ్యాచుల్లో అతడిని ఓపెనర్ గా కొనసాగించే అవకాశముంది. -
నాలుగు నచ్చింది
ఆర్డర్ మార్చి ఫలితం సాధించిన ధోని ఒత్తిడికి దూరంగా స్వేచ్ఛగా బ్యాటింగ్ భారత్‌కు అద్భుత విజయాలు అందించిన కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని సాధించిన కీర్తి అపారం. దీంతో పాటు వన్డేల్లో తన బ్యాటింగ్‌తోనూ సత్తా చాటిన అతను సుదీర్ఘకాలంగా ‘ఫినిషర్’ అనే పదానికి అసలైన అర్థంగా మారిపోయాడు. ముందుగా బ్యాటింగ్ అరుుతే చివరి ఓవర్లలో మెరుపు షాట్లతో స్కోరు బోర్డును పరుగెత్తించడం, లక్ష్యాన్ని ఛేదించే సమయంలోనైతే కావాల్సిన వేగంతో పాటు సరిగ్గా లెక్క వేసుకొని అతను గెలిపించిన మ్యాచ్‌లు ఎన్నో. ఇక సిక్సర్‌తో మ్యాచ్ ముగించిన క్షణాలు అభిమానులందరి మనసుల్లో ముద్రించుకుపోయారుు. అరుుతే అలాంటి ఫినిషర్ ఇప్పుడు ‘ఫినిష్’ కావాలని అతనే భావిస్తున్నాడు. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడాలని కోరుకుంటున్నాడు. సాక్షి క్రీడా విభాగం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ధోని ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే సమయానికి భారత్ విజయం కోసం 31.2 ఓవర్లలో 171 పరుగులు చేయాల్సి ఉంది. రన్‌రేట్ కూడా ఆరు లోపే ఉంది. ముగ్గురు టాపార్డర్ బ్యాట్స్‌మెన్ అప్పటికే వెనుదిరిగిన దశలో ధోని మ్యాచ్‌ను గెలిపిస్తాడని అభిమానులు ఆశించడంలో తప్పు లేదు. కానీ ఇబ్బందిగా ఆడిన ధోని చివరకు 65 బంతుల్లో 39 పరుగులే చేసి వెనుదిరిగాడు. ఇది సహజంగానే అందరినీ నిరాశలో ముంచెత్తింది. సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకుండా ధోని ఫినిషర్ అనేది ముగిసిపోరుున గతంగా చాలా మంది వ్యాఖ్యలు చేశారు. గతంలో ఒకసారి ఇలాంటి చర్చే వచ్చినప్పుడు ‘నేనొక్కడినే ఫినిష్ చేయాలా, మిగతావారు జట్టు సభ్యులు కారా’ అంటూ ఒకింత ఆగ్రహంతోనే ధోని జవాబిచ్చాడు. కానీ ఈసారి అతను మరో సారి చర్చకు అవకాశం ఇవ్వలేదు. ఆ స్థానంలో తన సహజమైన ఆటతీరును కోల్పోతున్నానని, అందుకే నాలుగో స్థానానికి మారుతున్నానని కచ్చితంగా చెప్పేశాడు. గెలుపులో భాగమై... మొహాలీ వన్డేలో 9వ ఓవర్లోనే ధోని క్రీజ్‌లోకి వచ్చాడు. 41 పరుగులకే జట్టు 2 వికెట్లు కోల్పోరుున దశలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి బాధ్యతాయుతంగా ఆడాడు. తగినన్ని ఓవర్లు ఉండటంతో అతను వచ్చీ రాగానే షాట్లకు పోకుండా కుదురుగా ఆడే అవకాశం దక్కింది. మొదటి 30 బంతుల్లో 20 పరుగులే చేసినా ఆ తర్వాత మెల్లగా దూకుడు పెంచి మంచి స్ట్రైక్‌రేట్‌ను అందుకున్నాడు. ఇప్పుడు ఇదే తరహా ఆటను అతను ఇష్టపడుతున్నాడు. క్రీజ్‌లో ఎక్కువ సేపు గడపాలని భావిస్తున్నట్లు అతనే స్వయంగా చెప్పుకున్నాడు ‘అప్పటికే 2 వికెట్లు మాత్రమే కోల్పోరుు ఉంటాము పెద్దగా ఒత్తిడి ఉండదు. ఇది జట్టు కోసం కాకుండా నా కోసం తీసుకున్న నిర్ణయం. చాలా కాలంగా దీని గురించి ఆలోచిస్తున్నాను. ఈ మ్యాచ్‌లో పరుగులు సాధించడం సంతోషంగా ఉంది. ఇలాంటి ఇన్నింగ్స మరిన్ని ఆడాలని కోరుకుంటున్నా’ అని ధోని వ్యాఖ్యానించాడు. ఒక దశలో సెంచరీ చేస్తాడనిపించి విఫలమైనా... ఈ ఇన్నింగ్స చూసినవారు అతని ఆటను ప్రశంసించకుండా ఉండలేరు. వాస్తవంగా కూడా మూడో వన్డేలో ధోని ముందుగా రాకుండా పాండే గానీ జాదవ్ గానీ వచ్చి ఉంటే పరిస్థితి ఇంత మెరుగ్గా ఉండకపోయేదేమో. ఆ సమయంలో మరో వికెట్ పడితే మళ్లీ ధోనిపైనే ముగించాల్సిన ఒత్తిడి, ఫలితం మారే ప్రమాదం కూడా ఉండేది. కానీ ఇలాంటిది లేకుండా అతను స్వేచ్ఛగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగలిగాడు. ఐదునుంచి ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగినప్పుడు వచ్చీ రాగానే మిగిలిన 10-12 ఓవర్లలో భారీ షాట్లు కొట్టాలని ప్రయత్నించడం, అటు వైపు చెప్పుకోదగ్గ బ్యాట్స్‌మన్ లేక మొత్తం భారం తనపైనే పడటం వల్ల తన స్ట్రరుుక్ రొటేట్ చేసే సామర్థ్యం కోల్పోరుునట్లు ధోని అంగీకరించాడు. అరుుతే జట్టు అవసరాల దృష్ట్యా మరో అనుభవజ్ఞుడైన ఆటగాడు లేక ఫినిషింగ్ బాధ్యతను అతను తీసుకున్నాడు. ఇక ముందూ కొనసాగాలి వన్డేల్లో మధ్య ఓవర్లలో జాగ్రత్తగా ఆడుతూనే మధ్య మధ్యలో భారీ షాట్లు కొట్టగల నైపుణ్యం కీలకం. విరాట్ కోహ్లి ఇందులో మాస్టర్ కాగా మరో వైపునుంచి కూడా అదే స్థారుు ఆటగాడు ఉంటే భారత్‌కు తిరుగుండదు. దానికి ధోనిని మించిన బ్యాట్స్‌మన్ ఎవరూ ఉండరు. 3, 4 స్థానాల్లో కోహ్లి, ధోని ఆడే జట్టును దెబ్బ తీయడం ఏ ప్రత్యర్థికీ అంత సులువు కాదు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో సగంకంటే ఎక్కువ ఓవర్లు (27.1) క్రీజ్‌లో కలిసి ఆడటంతో మ్యాచ్ దిశను మార్చడం సాధ్యమైంది. వీరిద్దరు కలిసి 151 పరుగులు జోడించడంతోనే మ్యాచ్ మన చేతుల్లోకి వచ్చింది. వీరిద్దరి మధ్య ఉండే సమన్వయం జట్టు పనిని సులువు చేస్తుందనడంలో సందేహం లేదు. ‘నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగితే నాకు విరాట్‌తో కలిసి ఆడే అవకాశం వస్తుంది. మేమిద్దరం వికెట్ల మధ్య చాలా వేగంగా పరుగెత్తుతాం. పరుగు లేని చోట సింగిల్, సింగిల్ అనుకున్న చోట రెండు పరుగులు తీసి అత్యుత్తమ ఫీల్డర్లపై కూడా ఒత్తిడి పెంచగలం. మధ్య ఓవర్లలో వందకుపైగా పరుగులు భాగస్వామ్యం ఒకటి నమోదైతే ఆ తర్వాతి బ్యాట్స్‌మెన్ పని సులువవుతుంది’ అని మహి విశ్లేషించాడు. నాలుగో స్థానంలో ఆడినప్పుడు కూడా అతని రికార్డు అద్భుతంగానే ఉంది. 24 వన్డేల్లో ధోని 61.63 సగటుతో 1171 పరుగులు సాధించాడు. ఒక వైపు ధోని కెరీర్ చివరి దశలో ఉండగా, మరో వైపు 2019 వరల్డ్ కప్ జట్టును నిర్మించే ప్రయత్నాలు సాగుతున్నారుు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత కూడా అతనిపై ఉంది. మ్యాచ్‌లో నాలుగో స్థానంతో బరిలోకి దిగినప్పుడు ఇతర ఆటగాళ్లకు దిశానిర్దేశం చేసే అవకాశం కూడా లభిస్తుంది. రైనాను ఇక నమ్మలేని పరిస్థితి ఉండటంతో ధోనికి నాలుగు సరైన స్థానంగా కనిపిస్తోంది. అదే కొనసాగితే ఇక భారత్ మరో ఫినిషర్‌ను వెతుక్కోవాల్సి వస్తుంది. అది పాండేనా, పాండ్యానా, మరొకరా అనేది త్వరలో తేలుతుంది! -
కుప్పకూలిన పాకిస్తాన్
మాంచెస్టర్: ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి రెండో టెస్టులో పాకిస్తాన్ జట్టు 63.4 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. పేసర్ క్రిస్ వోక్స్ (4/67)కు తోడు మొయిన్ అలీ, స్టోక్స్ రెండేసి వికెట్లతో రాణించడంతో పాక్ కోలుకోలేకపోయింది. 76 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో మిస్బా (52) అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు. అనంతరం పాక్‌ను ఫాలోఆన్ ఆడించకుండా ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌కు దిగింది. వీరి బ్యాటింగ్‌కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించగా మూడో రోజు ముగిసే సమయానికి 21 ఓవర్లలో వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 489 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
అతడు ఓ మెషిన్లా బ్యాటింగ్ చేస్తాడు
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీపై రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ బౌలర్ ఆడం జెంపా ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ ఓ మెషిన్ బ్యాటింగ్ చేస్తాడంటూ కితాబిచ్చాడు. అతనిలో ప్రత్యేక నైపుణ్యం ఉందని అన్నాడు. పుణెలో శనివారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అజేయ సెంచరీ చేసి జట్టును గెలిపించిన సంగతి తెలిసిందే. 'కోహ్లీ బ్యాటింగ్ ఓ మెషిన్లా ఉంటుంది. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడాలని చూడడు. కొంత సమయం తీసుకుంటాడు. క్రీజులో కుదురుకున్నాక దూకుడు పెంచుతాడు. బెంగళూరులో మ్యాచ్‌లో విరాట్ అద్భుతంగా ఆడాడు' అని జెంపా అన్నాడు. బెంగళూరు స్టేడియంలో ఆడిన అనుభవం తనకుందని, ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా తరపున ఆడానని చెప్పాడు. ఇక్కడి వాతావరణం అద్భుతంగా ఉందని అన్నాడు. -
శుభసూచకమే!
ట్వంటీ20 క్రికెట్లో పేరుకే కాదు ఆటతో కూడా ఇప్పుడు ధోని సేన నంబర్‌వన్‌గా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాను వారి మైదానంలోనే చిత్తుగా ఓడించిన భారత జట్టు సొంతగడ్డపై తమ పదునేమిటో శ్రీలంకకు రుచి చూపించింది. పుణే మ్యాచ్ ఒక అరుదైన ఫలితం కాగా... ఆ తర్వాత మన అసలు సత్తా బయటపడింది. వెంటనే ఆసియాకప్‌లో పాల్గొనాల్సి ఉన్నా... అసలు లక్ష్యం మాత్రం ప్రపంచకప్. స్వదేశంలో జరుగుతుండటం, మొదటినుంచి చివరి ఆటగాడి వరకు అంతా ఫామ్‌లో ఉండటమే కాదు, మన కోసమే సిద్ధమయ్యే స్పిన్ పిచ్‌లు కూడా భారత్ గెలుపును కోరుతున్నట్లున్నాయి. లంకపై చివరి మ్యాచ్ విజయం కూడా అదే చూపించింది. పొట్టి క్రికెట్లో తాము ఎప్పుడైనా గట్టి పోటీదారులమే అంటూ ధోని సవాల్ విసురుతుండటం వరల్డ్ కప్‌పై మన అంచనాలు పెంచేస్తోంది. * సూపర్ ఫామ్‌లో ధోని సేన * వరల్డ్‌కప్‌కు అన్ని విధాలా రెడీ * లంకపై విజయం ఇచ్చిన ఉత్సాహం ఆ స్ట్రేలియాతో మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక్కటే జట్టు... శ్రీలంకతో సొంతగడ్డపైనే అయినా ఇక్కడా మూడు మ్యాచ్‌లకు జట్టులో మార్పు లేదు. కోహ్లి లేకపోవడంతో రహానేకు అవకాశం దక్కడం తప్ప అనూహ్య నిర్ణయమేదీ లేదు. వరల్డ్‌కప్‌లో ఆడే తుది జట్టుపై కెప్టెన్ ధోని ఇప్పటికే ఒక నిర్ణయం తీసేసుకున్నాడని అర్థమవుతుంది. నేగిలాంటి ఆటగాడిని రిజర్వ్‌గానే చూడటం తప్ప అతడిని పరీక్షించి విశ్వ వేదికపై ఆడించే ఆలోచన కెప్టెన్‌కు ఉన్నట్లుగా లేదు. కాబట్టి ఇక జట్టు విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. యువరాజ్‌కు బ్యాటింగ్ అవకాశం వచ్చినా, రాకున్నా... సీనియర్ హర్భజన్ సేవలు అవసరమా, కాదా... ఇలా ఎవరు ఎలా భావించినా జట్టుకు సంబంధించి ఎవరైనా అనూహ్యంగా గాయపడితే తప్ప మార్పు ఉండకపోవచ్చు. ఈ ఆటగాళ్లే శ్రీలంకతో సిరీస్ విజయం అందించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. బ్యాటింగ్ బాగు బాగు టి20 రికార్డు, ఫామ్‌ను బట్టి టాప్-4 స్థానాల్లో ఎలాంటి మార్పు సాధ్యం కాదని ధోని గట్టిగానే చెప్పేశాడు. రోహిత్, కోహ్లిలతో పాటు ఈ ఫార్మాట్లో రైనా అత్యంత నమ్మదగిన బ్యాట్స్‌మెన్. శిఖర్ ధావన్‌పై ఏమైనా సందేహాలు ఉంటే ఈ సిరీస్‌తో తీరిపోయాయి. ఇక భారత్‌లో ఈ నలుగురి ఐపీఎల్ అనుభవం బ్రహ్మాండంగా పనికి రావడం ఖాయం. ‘టి20 క్రికెట్లో మేం ఎప్పుడైనా గట్టి పోటీదారులమే. మా జట్టులో దాదాపు అందరికీ భారత్‌లో ఎక్కువగా ఆడిన అనుభవం ఉంది. ముఖ్యంగా ఎనిమిది ఐపీఎల్ సీజన్లలో ఏడు ఇక్కడే ఆడాం. అది చాలా కీలక పాత్ర పోషిస్తుంది’ అని ధోని మన బ్యాటింగ్ బలమేమిటో చెప్పేశాడు. లోయర్ ఆర్డర్లో ధోని ఉండగా, తాను చెలరేగగలనని పాండ్యా రాంచీ మ్యాచ్‌లో చూపించాడు. మరోవైపు ఆస్ట్రేలియాలోనూ, ఇక్కడా బ్యాటింగ్‌లో చివర్లో వచ్చిన యువరాజ్ ప్రభావం చూపలేకపోయాడు. అయితే యువీకి ధోని మద్దతుగా నిలవడం బట్టి చూస్తే ఇది పెద్ద సమస్య కాదని అర్థమవుతుంది. ‘అందరికీ బ్యాటింగ్ రాకపోవడమనేది సమస్యే. కానీ 6,7,8 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చేవారు నేరుగా భారీషాట్లకు పోవాల్సి ఉంటుంది. ఇక్కడ వారు ఎన్ని పరుగులు చేశారనేదానికన్నా, ఎంత వేగంగా చేస్తే జట్టుకు అంత ఉపయోగపడుతుంది’ అని విశ్లేషించిన ధోని 9వ స్థానం వరకు బ్యాటింగ్‌పై ఢోకా లేదన్నాడు. స్పిన్...స్పిన్... లంకతో సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో పేస్ వికెట్, రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్ పిచ్, చివరగా స్పిన్ వికెట్...భారత్‌లో వచ్చే వరల్డ్ కప్ పిచ్‌లు ఎలా ఉండాలి అంటూ ఎ, బి, సి చాయిస్ ఇస్తే బీసీసీఐ ఓటు కచ్చితంగా మూడోదానికే పడుతుంది. మన విజయం కోసం పిచ్ ఇలా ఉండాలి అంటూ వైజాగ్ క్యురేటర్ దేశంలోని ప్రపంచకప్ వేదికల క్యురేటర్లకు మార్గం చూపించినట్లుంది! ఎలాంటి విమర్శలు, వివాదాలు వచ్చినా స్పిన్ అనుకూల పిచ్లే ఉంటాయనడంలో ఎలాంటి సందేహాలు లేవు. అశ్విన్, జడేజాలు ‘తిప్పుడు’కు ఇక్కడ ఎలాగూ ఎదురు లేదు. కానీ రైనా, యువీల బంతులకు కూడా పిచ్ గిరిగిరా అంటోంది. ‘భారత్‌లో స్పిన్నర్ల ప్రభావం గురించి కొత్తగా చెప్పేదేముంది. వరల్డ్ కప్‌లో అది మాకు అదనపు ప్రయోజనం. ఆరంభంలో అశ్విన్ బాగా బౌలింగ్ చేస్తే మధ్య ఓవర్లలో పేసర్లను వాడుకునే సౌకర్యం నాకు ఉంటుంది. ఇద్దరు ఆఫ్‌స్పిన్నర్లు, ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు జట్టులో ఉన్నారంటే ఒకరు విఫలమైనా మిగతా ముగ్గురు చూసుకోగలరు. పైగా డెత్ ఓవర్లలో యార్కర్లు వేయగల బుమ్రాపై కూడా నాకు గట్టి నమ్మకం ఉంది’ అంటూ జట్టు స్పిన్‌పై ధోని అచంచల విశ్వాసం ప్రకటించాడు. లోపాలు లేవా! టి20 ఫార్మాట్లో ఉండే అనిశ్చితి గురించి ధోనికి తెలియనిది కాదు. మన జట్టు ఎవరూ ఓడించలేనంత పటిష్టంగా ఉందనే ధోనికి... ఓడిపోయే అవకాశం కూడా ఉందని తెలుసు. అతని అనుభవాన్ని బట్టి చూస్తే తన లోపాలూ తెలుసు. ‘ప్రత్యర్థి జట్టులో అందరికంటే విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ను ఆపడం మా ప్రధాన లక్ష్యం. ఎందుకంటే ఆ ఒక్కడు మ్యాచ్‌ను లాగేసుకోగలడు. ముఖ్యంగా నాకౌట్లో అత్యుత్తమ ఆటతీరు కనబర్చాలి. ఒకరకంగా చెప్పాలంటే ఈ దశ లాటరీ టికెట్ లాంటిది. కాబట్టి నిలకడగా ఆడాల్సి ఉంది’ అని కెప్టెన్ కూల్ వెల్లడించాడు. లంకతో ఫలితం చూస్తే ప్రపంచకప్‌కు ముందు సొంతగడ్డపై మనోళ్ల హోంవర్క్ బాగా జరిగినట్లే. అన్నీ అనుకూలాంశాలే కనబడుతున్న నేపథ్యంలో ఇదే జోరు కొనసాగిస్తే 20-20లో రెండో సారి ‘మెన్ ఇన్ బ్లూ’ విశ్వవిజేతగా నిలవడం ఖాయం. - సాక్షి క్రీడా విభాగం -
బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా
సిడ్నీ: భారత్‌తో జరుగతున్న చివరి, ఐదో వన్డేలో టాస్ ఓడిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లు ఫించ్, డెవిడ్ వార్నర్‌లు బ్యాటింగ్ కు దిగారు. ఇప్పటికే 4-0తో సిరీస్‌లో వెనకంజలో ఉన్న భారత్ శనివారం జరిగే వన్డేలోనైనా విజయం సాధించాలని చూస్తోంది. ఇక ఇప్పటికే సిరిస్ నెగ్గిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది. ఈ రోజు అక్కడ భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా కాకపోయినా కొంత వరకు మ్యాచ్‌కు అంతరాయం కలగవచ్చు. వాతావరణం బాగా లేకపోవడంతో శుక్రవారం భారత్ ప్రాక్టీస్ రద్దయిన విషయం తెలిసిందే.