రాయుడు ‘లోకల్’!
పేరుకు హైదరాబాద్ జట్టయినా.. సన్‌రైజర్ తరపున ఒక్కరు కూడా స్థానిక ఆటగాడు బరిలోకి దిగకపోవడంతో జట్టులో ‘లోకల్ ఫ్లేయర్’ కనిపించలేదు. రాష్ట్రానికి చెందిన నలుగురు ఆటగాళ్లు వేణుగోపాలరావు, ఆశిష్‌రెడ్డి, సి.వి.మిలింద్, రికీ భుయ్‌లు జట్టులో ఉన్నా ఒక్కరికి కూడా తుదిజట్టులో అవకాశం కల్పించలేదు. దీంతో అభిమానుల్లో ఈ అసంతృప్తి కనిపించింది. పైగా ప్రత్యర్థి జట్టయిన ముంబై ఇండియన్స్ మాత్రం అంబటి రాయుడుతోపాటు హైదరాబాద్ రంజీ ఆటగాడైన ప్రజ్ఞాన్ ఓజాల రూపంలో ఇద్దరు స్థానిక ఆటగాళ్లను ఆడించింది. దీంతో సన్‌రైజర్స్‌తోపాటు ముంబైకీ అభిమానుల నుంచి మద్దతు బాగాలభించింది. తెలుగు తేజం రాయుడు బ్యాటింగ్ చేస్తున్నంతసేపూ ఫ్యాన్స్ చప్పట్లు, కేరింతలతో ప్రోత్సహించారు.