కుప్పకూలిన పాకిస్తాన్ | England v Pakistan: second Test, day three – as it happened | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన పాకిస్తాన్

Published Mon, Jul 25 2016 2:54 AM | Last Updated on Sat, Mar 23 2019 8:32 PM

కుప్పకూలిన పాకిస్తాన్ - Sakshi

కుప్పకూలిన పాకిస్తాన్

మాంచెస్టర్: ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి రెండో టెస్టులో పాకిస్తాన్ జట్టు 63.4 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. పేసర్ క్రిస్ వోక్స్ (4/67)కు తోడు మొయిన్ అలీ, స్టోక్స్ రెండేసి వికెట్లతో రాణించడంతో పాక్ కోలుకోలేకపోయింది. 76 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో మిస్బా (52) అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు. అనంతరం పాక్‌ను ఫాలోఆన్ ఆడించకుండా ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌కు దిగింది. వీరి బ్యాటింగ్‌కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించగా మూడో రోజు ముగిసే సమయానికి 21 ఓవర్లలో వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 489 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement